సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలో రేపు (బుధవారం) ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం పర్యవేక్షించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రేపు ఇబ్రహీంపట్నంలో మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 35 లక్షల మందికి ఇవ్వబోయే ఇళ్ల పట్టాల లే అవుట్లలో ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమం కింద మొక్కలు నాటుతున్నామని మంత్రి తెలిపారు. అంతేగాక ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి మొక్కకు ట్రీ గార్డు ఏర్పాటు చేసి 80 శాతం మొక్కలు కాపాడే బాధ్యత గ్రామ సర్పంచ్‌లకు ఇచ్చామని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment