
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం తగదని మండిపడ్డారు. ఎన్నికల్లో డబ్బులు పంచటం టీడీపి సంస్కృతని, ఇప్పటికే చంద్రబాబు తన అనుచరుల ద్వారా ఎన్నికల కోసం డబ్బులు కూడ పెడుతున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, గతంకంటే వచ్చే ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న జిల్లాల పునర్విభజన ఒక చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఉగాది రోజున లాంచనంగా కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని, దీంతో కొత్త జిల్లాల వల్ల ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత దగ్గర కానున్నట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment