
శ్రీ సత్యసాయి జిల్లా: మడకశిరలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి శంకర్ నారాయణ, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన 600 హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి అని విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం చిరస్థాయిగా నిలిచేలా చంద్రబాబు ఒక్క పథకమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు.
మరోవైపు మూడేళ్లలో 98.44 శాతం హామీలను నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. సీఎం జగన్ పాలనపై ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడేవారికి గుర్తింపు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 175కు 175 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: నాణ్యతలో రాజీ పడొద్దు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment