లీజు నిర్వాహకులకే అనుమతులు పునరుద్ధరించాం  | Peddireddy Ramachandra Reddy Slams On Yellow Media Over Laterite | Sakshi
Sakshi News home page

లీజు నిర్వాహకులకే అనుమతులు పునరుద్ధరించాం 

Published Mon, Jun 22 2020 4:05 AM | Last Updated on Mon, Jun 22 2020 8:08 AM

Peddireddy Ramachandra Reddy Slams On Yellow Media Over Laterite - Sakshi

సాక్షి, తిరుపతి తుడా: తూర్పుగోదావరి జిల్లాలోని లేటరైట్‌ నిక్షేపాల నమూనాలను కెమికల్‌ అనాలసిస్‌కు పంపామని.. అందులో అల్యూమినియం ఉన్నట్లు తేలడంతో తిరిగి లీజు నిర్వాహకులకే అనుమతులను పునరుద్ధరించామని రాష్ట్ర గనులు, భూగర్భ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. బాక్సైట్‌కు అయితే కేంద్రమే అనుమతులిస్తుందని ఆయనన్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక నిరాధారమైన ఆరోపణలతో ‘ఏటా రూ.180 కోట్లు’ స్వాహా చేస్తున్నట్లు అసత్య కథనాన్ని ప్రచురిం చిందని ఆయన మండిపడ్డారు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మందికి 2033 వరకు ఈ లేటరైట్‌ నిక్షేపాల తవ్వకాలకు అనుమతులిచ్చారని మంత్రి తెలిపారు. తిరుపతిలోని తన నివాసంలో పెద్దిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • ఆదివారం ఆ పత్రిక ప్రచురించిన ‘ఏటా రూ. 180 కోట్లు’ స్వాహా కథనంపై చట్టపరంగా చర్యలు తప్పవు. ఇప్పటికే నోటీసులు జారీచేశాం. సరైన వివరణ ఇవ్వకున్నా ఆధారాలు చూపకుంటే పరువు నష్టం దావా వేస్తాం.
  • చంద్రబాబు హయాంలో దోచేశారు కాబట్టే మా ప్రభుత్వం కూడా దోచేస్తోందనే భ్రమలో ఎల్లో మీడియా ఉన్నట్లుంది.
  • ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
  • ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ఆంధ్రజ్యోతి కుట్ర చేస్తోంది.
  • గనుల కేటాయింపుల్లో ముఖ్యనేత అంటూ ఒకసారి.. మంత్రి సమీ ప బంధువంటూ మరోసారి కథనాలను రాయడం సరైందికాదు.
  • గతంలోనూ సరస్వతి పవర్‌కు కోట్లు కట్టబెట్టారంటూ అసత్యాన్ని ప్రచారం చేశారు.
  • రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ జరిగి తీరుతుంది. కరోనా కా రణంగా ఆలస్యమవుతోంది. సరైన సమయంలో నిర్ణయిస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement