
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా ఉపాధి హామీ పనులు చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి ఇప్పటి వరకు 23,67 కోట్ల పనిదినాలు కల్పించామని తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించాలని అధికారులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న సచివాలయాలు, ఆర్బీకె, అంగన్‌వాడీలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జల్‌జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి రూ.4వేల కోట్లు కేటాయించారని, ఈ నిధులతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలని పేర్కొన్నారు.
వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేసి మంచినీటి సమస్య లేకుండా చూడాలని చెప్పారు. గతంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని, రూ.5 లక్షల లోపు పనులకు ఇప్పటికే బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ అధికారులపై ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపు ఉండదని, కేసులు నమోదు చేస్తారంటూ కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు ఈ ప్రభుత్వం అండగా వుంటుందని తెలిపారు.
చదవండి : (అందుకే అప్పులు చేశాం: మంత్రి బుగ్గన)
(ఆ హక్కు ఎవరికీ లేదు: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment