‘నా ముందు చంద్రబాబు ఎప్పటికీ జీరోనే’ | ysrcp mla peddireddy ramachandra reddy takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘నా ముందు చంద్రబాబు ఎప్పటికీ జీరోనే’

Published Fri, Apr 7 2017 3:15 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

‘నా ముందు చంద్రబాబు ఎప్పటికీ జీరోనే’

‘నా ముందు చంద్రబాబు ఎప్పటికీ జీరోనే’

చిత్తూరు: తనను రాజకీయంగా సాధించడానికే పార్టీ ఫిరాయించిన అమర్‌నాధరెడ్డికి మంత్రి పదవి ఇచ్చిరని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల హయంలోనే డీసీసీ అధ్యక్షుడిగా జిల్లా నుంచి ఎక్కువ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని, నాటికి నేటికి తన ముందు చంద్రబాబు జీరోనే అని ఆయన అన్నారు.

రాష్ట్రం విడిపోవడానికి కారణం గవర్నరే అని ఫిరాయింపుదారులతో గవర్నర్‌ అనైతికంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. రాష్ట్రపతి వెంటనే కలుగచేసుకుని గవర్నర్‌ని రీకాల్‌ చెయ్యాలని అన్నారు. గిరిజనులు, మైనార్టీల ద్రోహి చంద్రబాబు అని పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాధరెడ్డికి పరిశ్రమల శాఖ మంత్రిగా ఏపీ కేబినెట్‌లో చోటు కల్పించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement