సాక్షి, విజయవాడ: గ్రామ సచివాలయ పరిధిలో ఎవరైనా ఇసుక కావాలంటే ఆ గ్రామ సచివాలయంలో బుకింగ్ చేసుకోవచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులు, మైనింగ్ అధికారులతో సోమవారం ఆయన సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ: ఇసుక బుకింగ్‌కు సంబంధించిన వెబ్‌సైట్ 5 నిమిషాల్లోనే క్లోజ్ అవుతుందని ప్రజా ప్రతినిధులు, వినియోగాదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఇసుక బుకింగ్ ప్రక్రియను ఏపీఎండీసీ నుంచి గ్రామ సచివాలయాలకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయంలో వచ్చిన డిమాండ్‌ను బట్టి ఏపీఎండీసీ అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. (పల్లె పల్లెకూ ఎల్‌ఈడీ వెలుగులు)
ఈ పద్ధతి ద్వారా వినియోగదారులకు న్యాయం జరుగుతుందని, ఒకే ఆధార్ కార్డుతో వందలాదీ మంది తీసుకుంటూన్నారన్నారు. అందుచేత ఇసుక దుర్వినియోగం కాకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తున్నామని తెలిపారు. ఇసుక యాడ్ గురించి పది కిలోమిట్లర్లలోపే స్టాక్ పాయింట్ ఉండాలని నిర్ణయించామన్నారు. దీనివల్ల వినియోగదారులకు ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తగ్గతాయని, దీనివల్ల వినియోగాదారునికి మేలు జరుగుతుందన్నారు. త్వరలోనే వీటన్నిటిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment