మంత్రి పెద్దిరెడ్డి, అధికారుల‌కు సీఎం జగన్‌ అభినందనలు | Peddireddy Ramachandra Reddy Meets CM Jagan At Amaravati | Sakshi
Sakshi News home page

మంత్రి పెద్దిరెడ్డి, అధికారుల‌కు సీఎం జగన్‌ అభినందనలు

Published Tue, Jan 18 2022 5:33 PM | Last Updated on Tue, Jan 18 2022 6:52 PM

Peddireddy Ramachandra Reddy Meets CM Jagan At Amaravati - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్‌ సీఈఓ ఇంతియాజ్‌ అహ్మద్‌ సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు.

ఈ సందర్భంగా.. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల ద్వారా పేదల సుస్ధిరాభివృద్ధి కోసం సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ) చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. స్కోచ్‌ అందించిన గోల్డ్‌ అవార్డులను సీఎం వైఎస్‌ జగన్‌కు చూపించారు. ఈ మేర‌కు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి,  సెర్ప్ సీఈఓలను సీఎం జగన్‌ అభినందించారు.

చదవండి: రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించిన సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement