‘జగనన్న పచ్చతోరణం’పై ప్రత్యేక దృష్టి: పెద్దిరెడ్డి | Minister Peddireddy Said Special Focus On Jagananna Pacha Thoranam | Sakshi
Sakshi News home page

‘జగనన్న పచ్చతోరణం’పై ప్రత్యేక దృష్టి: పెద్దిరెడ్డి

Published Sat, Jun 12 2021 12:49 PM | Last Updated on Sat, Jun 12 2021 1:12 PM

Minister Peddireddy Said Special Focus On Jagananna Pacha Thoranam - Sakshi

సాక్షి, తిరుపతి: జగనన్న పచ్చతోరణంపై ప్రత్యేక దృష్టి పెట్టామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామాల్లో మొక్కలను పెంచే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగిస్తున్నామని.. పైలట్‌ ప్రాజెక్ట్‌గా చిత్తూరు జిల్లాను ఎంపిక చేశామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన నరేగా పనులపై విచారణ జరుగుతోందన్నారు. ఇప్పటికే రూ.5లక్షలలోపు పెండింగ్‌లో ఉన్న నరేగా బిల్లులను చెల్లించామని.. మిగిలిన పనులకు విజిలెన్స్‌ నివేదిక రాగానే చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి  పేర్కొన్నారు.

చదవండి: బాలల సంక్షేమానికి ఏపీ కృషి భేష్‌ 
‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement