Jagananna Pacha Thoranam
-
యజ్ఞంలా చెట్ల పెంపకం
అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తే మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మొక్కలు నాటి.. అవి వృక్షాలుగా ఎదిగే వరకు తోడుగా నిలుద్దాం. తద్వారా మనకు విస్తృత ప్రయోజనాలు ఉన్నాయనే విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకుని, విరివిగా మొక్కలు నాటుదాం.. చెట్లను సంరక్షించుకుందాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా సాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం 23 శాతం మాత్రమే ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే దిశగా అందరం కలిసి ప్రయత్నం చేయాలన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో ‘జగనన్న పచ్చతోరణం – వన మహోత్సవం’ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ వేప, రావి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో రాష్ట్రంలో అడవులు, అటవీ ఉత్పత్తులకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. చెట్ల పెంపకానికి సంబంధించి రెండు, మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే అవి ఎంత అవసరమో నిరంతరం తెలుస్తుందన్నారు. మనం పీల్చే గాలి ఆక్సిజన్ అని, ప్రపంచంలో ఏ జీవి అయినా ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్ను వదిలేస్తుందని, ఒక్క చెట్టు మాత్రమే పగటి పూట కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్‌ను వదులుతుందని చెప్పారు. ఒక చెట్టు ఉంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశమని తెలిపారు. చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుందన్నారు. మనం పదో తరగతి చదువుల్లో, పరీక్షలు రాసేటప్పుడు ఆస్మోసిస్ అని, ట్రాన్స్పిరేషన్, గటేషన్ అని రకరకాల సిద్ధాంతాలు చదివి ఉంటామని గుర్తు చేశారు. చెట్ల వల్ల వర్షం ఎలా ప్రభావితం అవుతుంది, ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఎందుకుంటాయనే విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలన్నారు. వాటి వల్ల మనకు జరిగే మంచిని జ్ఞాపకం పెట్టుకుంటే, చెట్లను పెంచాల్సిన అవసరం ఎప్పుడూ కనిపిస్తుందని పేర్కొన్నారు. దాదాపు 5 కోట్ల మొక్కలను నాటడానికి అటవీ శాఖను పురమాయిస్తూ ఆ పనికి పూనుకోవాలని అందరినీ కోరుతున్నానని చెప్పారు. ఇందుకోసం అందరూ ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రావాలని, ఇక్కడున్న వారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత తమ మనసులో ప్రతిజ్ఞ చేయాలని కోరారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి బాలినేని అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానమే లక్ష్యం ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అటవీ విస్తీర్ణంలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని, దాన్ని మొదటి స్థానంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా వివిధ శాఖల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నాడు–నేడు కార్యక్రమంలో, జగనన్న కాలనీల్లో, ఇతరత్రా 5 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కోట్లు అప్పులు చేసినా, ఎల్లో మీడియాకు కనిపించలేదని, కానీ సీఎం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక తప్పుడు రాతలు రాస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్, అటవీ దళాల అధిపతి ఎన్ ప్రతీప్‌కుమార్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దుదాం.. ‘ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల్య స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగ పరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ.. వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా, వాడ వాడా, ఇంటా.. బయటా, అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అని అందరితో సీఎం ప్రతిజ్ఞ చేయించారు. మనసా, వాచా, కర్మణా అందరం దీనికి కట్టుబడి ఉంటూ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. -
రహదారులకు ‘పచ్చ తోరణం’
సాక్షి,చిత్తూరు: జిల్లాలోని రహదారులు పచ్చ తోరణంతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుడుతోంది. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించేందుకు నిర్ణయించింది. మొక్కను నాటినప్పటి నుంచి చెట్టయ్యే వరకు సంరక్షించేలా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తిరుపతి మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లో జగనన్న పచ్చతోరణం పక్షోత్సవాలను నిర్వహించనున్నారు. జిల్లాలో 6,10,510 మొక్కలను 15 రోజుల్లో నాటేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రహదారులకు ఇరువైపులా 1,526.28 కిలోమీటర్ల వరకు మొక్కలను నాటుతారు. ఆగస్టు ఒకటి నుంచి 15లోపు మొక్కలు నాటడం పూర్తికాకుంటే మరోవారం రోజుల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం. మొక్కకు రూ.385 ఖర్చు ఉపాధి హామీ పథకం నిధులతో ‘జగనన్న పచ్చతోరణం’ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాటే మొత్తం మొక్కలకు రూ.23,50,46,350 ఖర్చు చేయనున్నారు. ఒక్కో మొక్కకు ఏడాదికి రూ.385 ఖర్చు చేస్తారు. చిన్న మొక్కలను నాటితే త్వరగా ఎదిగే అవకాశం లేదని గుర్తించిన ప్రభుత్వం ఒక్కో మొక్క 6 నుంచి 10 అడుగుల ఎత్తు, రెండేళ్ల వయసు కలిగినవి నాటేందుకు నిర్ణయించింది. ఒక మొక్క కొనుగోలుకు రూ.95, నాటడానికి రూ.110, క్రిమిసంహారక మందు పిచికారీకి రూ.10, నెలకు నిర్వహణ రూ.10, నీటికి రూ.20, ఫెన్సింగ్‌కు రూ.140 చొప్పున మొత్తం రూ.385 ఖర్చు చేస్తారు. లక్ష మొక్కలు సిద్ధం పచ్చతోరణం పక్షోత్సవాలకు జిల్లాలో లక్ష మొక్కలను సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అవసరమైన మొక్కలను దశలవారీగా తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాజమండ్రితో పాటు తమిళనాడులోని పుదుకోట్టై నుంచి మొక్కలను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ప్రస్తుతానికి నిర్దేశించిన ప్రణాళిక మేరకే కాకుండా అదనంగా మరో లక్ష మొక్కలు నాటేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా తంబళ్లపల్లెలో ప్రారంభం తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ఈ పచ్చతోరణాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు చోట్ల రోడ్డుపక్కన మొక్కలు నాటే ప్రక్రియను చేపట్టారు. రాజమండ్రి నుంచి తెప్పించిన మొక్కలను రహదారులకు ఇరువైపులా నాటి సంరక్షించే పనులపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న డబ్బులు
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కల్పిస్తూ రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి ఆగస్టు 24వ తేదీన డబ్బులు చెల్లించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించిన విషయం తెలిసిందే. ‘స్పందన’లో భాగంగా సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆగస్టులో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రకటించడంతో పాటు కోవిడ్, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్టేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ఇందులో 10.01 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయి. లే అవుట్లలో నీరు, కరెంట్ చాలావరకూ కల్పించారు. మిగిలిపోయిన సుమారు 600కిపైగా లే అవుట్లలో నీటి వసతిని కల్పించేలా వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్‌ను 3.18 లక్షల మంది ఎంచుకున్నారు. వీరిలో 20 మందితో ఒక గ్రూపు ఏర్పాటు చేయాలి. స్థానికంగా మేస్త్రీలను గుర్తించి పనులను ఆ గ్రూపులకు అనుసంధానం చేయాలి. ఆగస్టు 10 కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలి. వర్షాలు ప్రారంభమైనందున ఇసుక పంపిణీలో అవాంతరాలు లేకుండా చూసుకోవాలి. ఇళ్ల నిర్మాణం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. టిడ్కో ఇళ్లకు అనర్హులైన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలి. వచ్చే స్పందన లోగా ఈ పని పూర్తి కావాలి. ఇక ముందూ ఫోకస్డ్గా టెస్టులు ఇక ముందూ ఫోకస్డ్గా కోవిడ్ టెస్టులు జరగాలి. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలి. ఎవరైనా కోరితే వారికి కూడా పరీక్షలు చేయాలి. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలి. థర్డ్‌వేవ్ వస్తుందో లేదో తెలియదు కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. మందులు, బయోమెడికల్ ఎక్విప్మెంట్లను సిద్ధం చేసుకోవాలి. వ్యాక్సినేషన్ రాష్ట్రంలో 1.53 కోట్ల మందికి ఇప్పటివరకూ ఒక డోసు వాక్సిన్ ఇచ్చాం. దాదాపు 7 కోట్ల డోసులు అవసరం ఉంటే 1.53 కోట్ల డోసులు వేశాం. వ్యాక్సినేషన్ విషయంలో ఇంకా మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంది. 45 ఏళ్లకు పైబడ్డ వారికి 75.89 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. దీన్ని 90 శాతం వరకూ తీసుకెళ్లాలి. తర్వాత మిగిలిన ప్రాధాన్యతా వర్గాలకు వ్యాక్సిన్లు ఇవ్వాలి. టీచర్లు, గర్భిణులు, కాలేజీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతం ఉంది. రెండో వేవ్‌లో కొన్ని జిల్లాల్లో 25 శాతం పాజిటివిటీ రేటు చూశాం. క్రమంగా తగ్గుతూ వచ్చింది. కోవిడ్ నివారణకు కలెక్టర్లు నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఆశావర్కర్లు, డాక్టర్లు, ఏఎన్ఎంలు అందరూ కలసికట్టుగా పనిచేశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. నిర్మాణ పనులు వేగవంతం కావాలి గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్‌క్లినిక్స్, ఏఎంసీ, బీఎంసీల నిర్మాణంపై దృష్టిపెట్టండి. రాష్ట్రవ్యాప్తంగా 10,929 గ్రామ సచివాలయాలను నిర్మిస్తున్నాం. సచివాలయాల నిర్మాణంలో కృష్ణా, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలు వెనకబడి ఉన్నాయి. కలెక్టర్లు దీనిపై ధ్యాస పెట్టాలి. సెప్టెంబరు 30 కల్లా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. 10,408 ఆర్బీకేలు నిర్మిస్తున్నాం. ఆర్బీకేలలో బేస్మెంట్ లెవల్లో తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు జిలాల్లో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డిసెంబరు 31 కల్లా పూర్తిచేసేలా దృష్టిపెట్టాలి. 4,530 గ్రామ పంచాయతీలకు ఫైబర్ కనెక్షన్లు డిసెంబర్ కల్లా వస్తాయి. ఆ సమయానికి డిజిటల్ లైబ్రరీలను పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలి. డిజిటల్ లైబ్రరీలను పూర్తిచేస్తే సంబంధిత గ్రామాల నుంచే వర్క్‌ఫ్రం హోం అవకాశాలను కల్పించగలుగుతాం. ఆగస్టు 15 కల్లా వీటి నిర్మాణాలు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. స్పందన కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించడం సంతోషకరం. కోవిడ్ కారణంగా ఇన్నాళ్లుగా జరగలేదు. మళ్లీ పునఃప్రారంభం కావడం సంతోషకరం. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం ఇది. ఇళ్ల పట్టాల పంపిణీ మొదటి దశలో 30 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 3,69,448 మందికి కోర్టు కేసుల కారణంగా అందలేదు. ఈ కేసులు త్వరగా పరిష్కారమై వారికి మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నా. ఇళ్ల పట్టాల మంజూరుకు సంబంధించి 10,007 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. వీటిని వెంటనే పరిశీలించి అర్హులను గుర్తించాలి. అర్హులుగా తేల్చిన 1,90,346 మందికి వెంటనే పట్టాలు ఇవ్వాలి. ఇందులో ప్రస్తుతం ఉన్న లే అవుట్లలో దాదాపు 43 వేల మందికి పట్టాలు, మరో 10,652 మందికి ప్రభుత్వ స్థలాల్లోనే పట్టాలు ఇవ్వాలి. మరో 1.36 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలి. 15 నుంచి జగనన్న పచ్చతోరణం.. ఆగస్టు 15 నుంచి 31 వరకూ రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీన్ని చేరుకునేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. ఆగస్టు 5 నాటికి మొక్కల కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఖరారు కావాలి. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. గ్రామాల్లో సర్పంచులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. మొక్కలు నాటగానే సరిపోదు. నీరు పోయడం, సంరక్షణపై దృష్టిపెట్టాలి. మొక్కలు పచ్చగా కళకళలాడేలా శ్రద్ధ వహించాలి. -
లోక కల్యాణం.. పచ్చతోరణం
పర్యావరణం.. పచ్చదనం.. ఈ మాటలు ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.. కాలుష్యపు కోరల నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అందరినీ భాగస్వాములు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సారి జిల్లాలో అధికారులు వినూత్నంగా విత్తన బంతులతో మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. సాక్షి, కడప: రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎక్కడ చూసినా మొక్కలతోపాటు పచ్చదనం కళకళలాడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జగనన్న పచ్చతోరణం పథకం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు కృషి చేస్తోంది. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటేందుకు సన్నద్ధమైంది. ఎక్కడ చూసినా మొక్కలు నాటడం మూలంగా వర్షాలతోపాటు ప్రకృతిపరంగా అనేక ప్రయోజనాలు ఒనగూరేందుకు అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఆరంభ శూరత్వంగా మొక్కలు నాటి వదిలేసినా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొక్కల పెంపకానికి చర్యలు చేపడుతోంది. మొక్కలు నాటడం ద్వారానే పర్యావరణ ప్రయోజనంతోపాటు ప్రకృతి ద్వారా కూడా అనేక లాభాలు లభిస్తాయని భావిస్తూ అందరినీ భాగస్వాములను చేస్తోంది. అందులో భాగంగా డ్వామా, పంచాయతీ, అటవీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, జిల్లా పరిషత్‌ల ద్వారా సమన్వయం చేసుకుంటూ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. జిల్లాలో సుమారు 30 లక్షల పైచిలుకు మొక్కలను ఆగస్టు 15వ తేదీలోగా నాటేలా కసరత్తు చేస్తున్నారు. 1200 కిలో మీటర్ల మేర.. జిల్లాలో జగనన్న పచ్చతోరణం కింద మొక్కల పెంపకానికి భారీ ఎత్తున ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒక పంచాయతీ నుంచి మరో పంచాయతీకి అనుసంధానంగా ఉన్న రోడ్లతోపాటు పంచాయతీ నుంచి మండల కేంద్రానికి వెళ్లే మార్గం, రాష్ట్ర రహదారులు ఇలా ప్రతి చోట మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగం సంకల్పించింది. సుమారు 1200 కిలోమీటర్ల మేర ఐదు లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నారు. మొక్కలను సంరక్షించేందుకు గ్రామ పంచాయతీలో ఒక వాచర్ (ఉపాధి కూలీ)ని ఎంపిక చేసి....250 మొక్కలను సంరక్షించే బాధ్యతను అప్పగిస్తున్నారు. నెలకు నాలుగుసార్లు నీళ్లు అందించాల్సి ఉంటుంది. సర్పంచ్ ఆధ్వర్యంలో కమిటీ గ్రామాలో ఎక్కడా ఒక్క మొక్క కూడా చనిపోకుండా ఉండేందుకు సర్పంచ్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. సర్పంచ్‌తోపాటు సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు కమిటీలో ఉంటారు. అలాగే ఉపాధి హామీ అధికారులందరికీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. మొక్క చనిపోతే బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోనున్నారు. నియోజకవర్గానికి ఓ విలేజ్ పార్కు జిల్లాలోని పది నియోజకవర్గాలకుగాను కార్పొరేషన్ మినహా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో విలేజ్ పార్కులను అధికారులు ఎంపిక చేశారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాలు, పాఠశాలలు, ఇతర సంస్థల్లో దాదాపు రెండు లక్షల మేర మొక్కలు నాటనున్నారు. మండలానికి రెండు బ్లాక్ ప్లాంటేషన్లు జిల్లాలో ప్రతి మండలంలోనూ రెండు బ్లాక్ ప్లాంటేషన్లను ఎంపిక చేశారు. ఒక్కో బ్లాక్ ప్లాంటేషన్‌లో 200 మొక్కలు నాటనున్నారు. జిల్లాలోని సుమారు 100కు పైగా బ్లాక్ ప్లాంటేషన్లను అభివృద్ధి చేసి సుమారు 20 వేలకు పైగా మొక్కలు నాటాలని సంకల్పించారు. ప్రతి మొక్కను కాపాడుతాం జిల్లాలో ఈసారి కొత్తగా విత్తన బంతుల ద్వారా కూడా మొక్కలను అభివృద్ధి చేస్తున్నాం. మొక్కల సంరక్షణ బాధ్యతను పలువురికి అప్పగించాం. జిల్లాలో 30 లక్షలకు పైగా మొక్కలను నాటుతున్నాం. యదుభూషణరెడ్డి, పీడీ, డ్వామా, కడప -
ఏమిటీ విత్తన బంతులు.. ఎలా తయారు చేస్తారు?
సాక్షి, విశాఖపట్నం: పర్యావరణ పరిరక్షణలో కీలకమైన పచ్చని చెట్లను పెంచడానికి వీలైన అన్ని వనరులను అధికార యంత్రాంగం సమీకరిస్తోంది. రెండేళ్లుగా చేపడుతున్న ‘జగనన్న పచ్చతోరణం’ సత్ఫలితాలనిస్తుండడంతో.. పచ్చదనం పెంపునకు ఈ ఏడాది అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది. విశాఖ జిల్లాలోని కొండలు, గుట్టలు, ఖాళీ స్థలాల్లో విసిరేందుకు సామాజిక అటవీ శాఖ 2 లక్షల విత్తన బంతులను తయారుచేయిస్తోంది. అడవులు సహజ సిద్ధంగా తయారు కావాలి. గుంతలు తవ్వి, మొక్కలు నాటి.. అడవులు సృష్టించాలంటే సాధ్యం కాని పని. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడవి జీవ వైవిధ్యానికి అద్దం పడుతుంది. ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోయినా.. అడవుల్లో చెట్లు సహజ సిద్ధంగానే పెరుగుతాయి. ఇలాంటి అడవులను సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా శ్రమిస్తోంది. ఇందుకోసం విలక్షణమైన విత్తన బంతుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. హరిత హారం అడవిలో అంతంత మాత్రంగా కనిపించడం, గుట్టలు, కొండల్లో పచ్చదనం కనుమరుగవుతున్న విషయాలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘జగనన్న పచ్చతోరణం’పేరుతో విత్తన బంతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏమిటీ విత్తన బంతులు? ప్రత్యేకంగా సంరక్షణ అవసరం లేకుండా.. ప్రకృతి సిద్ధంగా త్వరగా పెరిగే చెట్ల రకాలకు అధికారులు విత్తన బంతుల పద్ధతి అమలు చేస్తున్నారు. ముందుగా మన వాతావరణానికి అనుకూలమైన చింత, వేప, కానుగ, రెల్ల, కుంకుడు, ఏగిస మొదలైన చెట్ల నుంచి విత్తనాలు సేకరిస్తారు. జల్లెడ పట్టిన ఎర్రమట్టిని సిద్ధం చేస్తారు. 75 శాతం ఎర్రమట్టిలో 25 శాతం ఆవుపేడ, కొంత కోకాపిట్ను కలిపి ఎరువు మిశ్రమంగా తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని కలిపి వారం రోజులు మురుగబెడతారు. అనంతరం జీవామృతం(ఆవుపేడ, బెల్లం, శనగపిండి)తో మిశ్రమాన్ని ముద్దలుగా తయారు చేస్తారు. ఇవి వీడిపోకుండా గట్టిగా ఉండేందుకు స్టార్చ్ లిక్విడ్, బబుల్ గ్లూ ద్రావణాలు మట్టి ముద్దలో కలుపుతారు. ఈ మట్టి ముద్దల్లో విత్తనాలను పెట్టి ఎండబెట్టారు. తొలకరి వర్షాలు పడిన తర్వాత కందకాలు, గుట్టలు, కొండలు, సాగుకు పనికిరాని భూముల్లో విసురుతారు. అటవీ జాతి మొక్కలే కావడంతో సీడ్ బాల్స్ నుంచి విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. గతేడాది మంచి ఫలితాలు గతేడాది కూడా అటవీ శాఖ విత్తన బంతులను చల్లింది. మొత్తం 2 లక్షల విత్తన బంతులు తయారు చేయగా.. జీవీఎంసీకి 50 వేల బంతులు అందించారు. నౌకాదళంతో కలిసి నగరంలోని కొండలపై జీవీఎంసీ అధికారులు విత్తన బంతులు చల్లారు. మిగిలిన 1.50 లక్షల బంతులను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు విసిరారు. వాటి నుంచి ప్రస్తుతం మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. ఈ ఏడాది కూడా 2 లక్షల సీడ్ బాల్స్ తయారు చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ముఖ్యమంత్రి సూచనలతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విత్తన బంతులు తయారు చేస్తున్నాం. నేడు మనం జాగ్రత్త చేసిన విత్తనమే.. రేపు భారీ వృక్షంగా మారుతుంది. జగనన్న పచ్చతోరణంలో భాగంగా విత్తన బంతుల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. తక్కువ ఖర్చుతో సేంద్రీయ పద్ధతిలో తయారు చేసి.. పెద్ద సంఖ్యలో వృక్ష సంపద పెరిగేలా చర్యలు చేపడుతున్నాం. అవసరమైతే నౌకాదళ సహకారం కూడా తీసుకుంటాం. – ఎన్ ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి సీడ్ బాల్స్‌తో అనేక లాభాలున్నాయి.. కొండప్రాంతాల్లో గోతులు తవ్వి మొక్కలు నాటడం చాలా కష్టతరం. విత్తన బంతుల తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. పోషకాలు అధికంగా ఉండే మట్టిలో విత్తనాలను పెట్టడం వల్ల మొక్కలు బతికే అవకాశాలు 100 శాతం ఉన్నాయి. గతేడాది చేపట్టిన సీడ్‌బాల్స్ ప్రక్రియ సత్ఫలితాలిచ్చింది. ఈ పద్ధతిలో జిల్లాలోని అటవీ ప్రాంతం, రెవెన్యూ హిల్స్‌లో.. అన్ని రకాల ప్రదేశాల్లోనూ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. సెప్టెంబర్‌లో విత్తన బంతులు విసిరే ప్రక్రియ ప్రారంభిస్తాం. – గంపా లక్ష్మణ్, డీఎఫ్‌వో, సామాజిక అటవీ శాఖ -
‘జగనన్న పచ్చతోరణం’ కింద ఈ ఏడాది కోటి మొక్కలు: పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల వెంబడి 17 వేల కిలోమీటర్ల పొడవున ఈ ఏడాది కోటి మొక్కల్ని నాటేందుకు ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమం అమలు చేస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికేలా.. రాష్ట్రంలో పచ్చదనం విలసిల్లేలా అధికారులు, సిబ్బంది బాధ్యత తీసుకోవాలన్నారు. పచ్చతోరణం కార్యక్రమం నిర్వహణపై గ్రామీణాభివృద్ధి శాఖ 13 జిల్లాల అధికారులకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం వర్క్‌షాప్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రాన్ని ఆకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పమని, నాటిన మొక్కల్లో 90 శాతానికి పైగా బతికించాలన్నది ఆయన లక్ష్యమని చెప్పారు. గతంలో మాదిరిగా మొక్క నాటడంతో సరిపెట్టడం లేదని, ప్రతి మొక్క సంరక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేసే వీలు కల్పించామని చెప్పారు. మొక్కలకు నీటి తడులు అందించేందుకు ప్రతినెలా డబ్బులు కూడా కేటాయిస్తున్నామన్నారు. ప్రతి పంచాయతీలో నాటిన మొక్కల్లో కనీసం 83 శాతం మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యతను ఆ గ్రామ సర్పంచ్‌పై పెడుతున్నట్టు చెప్పారు. లేనిపక్షంలో వారు పదవికి అనర్హులుగా ప్రకటించేలా నిబంధనలు ఉన్నాయనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మొక్కల సంరక్షణతో నిరుద్యోగులకు ఉపాధి మొక్కల సంరక్షణ బాధ్యతను నిరుద్యోగ యువతకు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి మొక్కకు నెలకు నాలుగు తడుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని, ప్రతి తడికి రూ.5 చొప్పున కిలోమీటర్ పరిధిలో కనీసం 400 మొక్కల్ని సంరక్షిస్తే నెలకు రూ.8 వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 10 కిలోమీటర్ల పరిధిలోని మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకొనే వారు ట్రాక్టరు కొనుక్కుంటే రెండేళ్లు తిరిగే సరికి అతనికి కొనుగోలు ఖర్చు లభించి ట్రాక్టరు మిగిలే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ఏడాది మొక్కల పెంపకంలో ఉత్తమ ఫలితాలు సాధించిన తొలి మూడు జిల్లాల అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో సన్మానిస్తామని, అదే సమయంలో చివరి మూడు స్థానాల్లో నిలిచే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఏడాది 44 వేల మంది రైతులకు చెందిన 70 వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ.. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి (సోషల్ ఫారెస్ట్) చిరంజీవి చౌదరి, ఉద్యావ శాఖ కమిషనర్ శ్రీధర్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ నవీన్‌కుమార్, సెర్ప్ సీఈవో రాజాబాబు, డైరెక్టర్ చినతాతయ్య, పంచాయతీరాజ్ ఈఎన్సీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
సర్పంచ్ లు మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-
పల్లె.. పల్లెకు.. జగనన్న పచ్చతోరణం
తిరుపతి రూరల్: జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కింద 10 లక్షల పూలు, పండ్ల చెట్ల ఉచిత పంపిణీకి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికి నిమ్మ, దానిమ్మ, జామ, ఉసిరి, బత్తాయి, దబ్బ, సీతాఫలం, సపోటా వంటి పండ్ల చెట్లతో పాటు, మందారం, నందివర్ధనం, గన్నేరు, టెకోమో, పారిజాతాల్లో వారికి నచ్చిన నాలుగు మొక్కలను అందజేశారు. పలువురికి మొక్కలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సంకల్పించినట్లుగా ప్రతి పల్లె, వీధి, ఇల్లు.. పూలు, పండ్ల చెట్లతో కళకళలాడాలన్నారు. ఉచితంగా ఇస్తున్న ఈ పూలు, పండ్ల చెట్లను పెంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 20 కోట్ల మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి సంకల్పించారని, రాష్ట్రంలో పచ్చదనాన్ని, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు పచ్చతోరణం కార్యక్రమంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలియజేశారు. నాటిన మొక్కల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని చెప్పారు. -
‘జగనన్న పచ్చతోరణం’పై ప్రత్యేక దృష్టి: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: జగనన్న పచ్చతోరణంపై ప్రత్యేక దృష్టి పెట్టామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామాల్లో మొక్కలను పెంచే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగిస్తున్నామని.. పైలట్ ప్రాజెక్ట్‌గా చిత్తూరు జిల్లాను ఎంపిక చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నరేగా పనులపై విచారణ జరుగుతోందన్నారు. ఇప్పటికే రూ.5లక్షలలోపు పెండింగ్‌లో ఉన్న నరేగా బిల్లులను చెల్లించామని.. మిగిలిన పనులకు విజిలెన్స్ నివేదిక రాగానే చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: బాలల సంక్షేమానికి ఏపీ కృషి భేష్ ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’ -
అటవీ విస్తీర్ణం పెంపుదలలో ఏపీ సెకండ్!
పచ్చదనం (గ్రీన్ కవర్) పెంపుదలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉంది. జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు వై ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్ కవర్ సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 2020– 21లో ‘జగనన్న పచ్చతోరణం’ పథకం కింద 20 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం. ఇప్పటికే 9.50 కోట్ల మొక్కలు నాటడం పూర్తయింది. మొక్కలు నాటి.. చేతులు దులుపుకోవడం కాకుండా గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం గత ఏడాది జులై 20న ఉత్తర్వులు జారీ చేసింది. నాటిన వాటిలో కనీసం 85 శాతం మొక్కలు చెట్లుగా ఎదిగేలా పరిరక్షణ చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పశువుల నుంచి రక్షణ కోసం నాటిన ప్రతి మొక్కకూ ట్రీ గార్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పచ్చదనం ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 28.30 లక్షల మంది నివసించనున్న కాలనీలను పచ్చని పందిరిలా మార్చాలనే ఆశయంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని ప్రభుత్వం తలపెట్టింది. ► విశాఖపట్నాన్ని పచ్చని మహానగరంగా తీర్చిదిద్దే చర్యలు విస్తృతంగా సాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు ‘గ్రీన్ విశాఖ’ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మొక్కలు నాటుతున్నట్లు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) కమిషనర్ కోటేశ్వరరావు తెలిపారు. ► ఈ నేపథ్యంలో నాటిన ప్రతి మొక్కను బిడ్డలా సంరక్షించి సజావుగా పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గ నిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ‘ఒక్కొక్కరు ఒక్కో మొక్క’ నాటి సంరక్షించాలనే నినాదాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ► పచ్చదనం పెంపునకు గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల సేవలను వినియోగించుకుంటోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రాహదారులు, గ్రామీణ రోడ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. నర్సరీల్లో 6 కోట్ల మొక్కల పెంపకం రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర అటవీ శాఖ సామాజిక అటవీ విభాగానికి చెందిన 737 నర్సరీల్లో 2020లో 6.03 కోట్ల మొక్కలు పెంచారు. గత ఏడాది (2020) జులై 22న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సీఎం జగన్ మొక్కలు నాటి జగనన్న పచ్చతోరణానికి శ్రీకారం చుట్టారు. ► పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజం కోసం ఇప్పటికే దేశంలోనే మొట్టమొదటిగా ‘ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం’ అమల్లోకి తెచ్చిన సీఎం జగన్ పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ► రాష్ట్ర అటవీ శాఖ నోడల్ ఏజెన్సీగా 29 ప్రధాన శాఖల ద్వారా 2020–21లో 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛంద సంస్థలు, వనసంరక్షణ సమితులు, స్వయం సహాయక సంఘాలు, పేపర్ మిల్లులతోపాటు అన్ని వర్గాల ప్రజలను ఈ మహాక్రతువులో భాగస్వాములను చేస్తోంది. ► రాష్ట్రంలో 1,62,968 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం ఉండగా 37,258 చదరపు కిలో మీటర్ల (మొత్తం భూభాగంలో 23 శాతం) మేర అటవీ ప్రాంతం ఉంది. దీంతో పాటు అడవి వెలుపల మూడు శాతం గ్రీన్ కవర్ ఉంది. అంటే, 26 శాతం గ్రీన్ కవర్ ఉన్నట్లు లెక్క. దీన్ని 33 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. – లేబాక రఘురామిరెడ్డి, సాక్షి, అమరావతి అటవీ విస్తీర్ణం పెంపులో ఏపీ సెకండ్! దేశ వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెంపుదలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వితీయ స్థానంలో నిలవడం గమనార్హం. 16వ భారత అటవీ నివేదిక (ఐఎస్ఎఫ్ఆర్ 2019) ప్రకారం 1,025 చదరపు కిలోమీటర్ల గ్రీన్ కవర్ పెంపు ద్వారా కర్ణాటక దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 990 కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెంపుతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలోనూ, 823 కిలోమీటర్ల పెంపుతో కేరళ తృతీయ స్థానంలోనూ నిలిచాయి. ప్రతి రెండేళ్లకోసారి దేశంలో అటవీ విస్తీర్ణం, వనరుల వినియోగంపై భారత అటవీ సర్వే (ఎఫ్ఎస్ఐ) విభాగం ఐఎస్ఎఫ్ఆర్ నివేదికను వెల్లడిస్తుంది. 2017 –18 సంవత్సరాలతో పోల్చితే 2019 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ విస్తీర్ణం 990 చదరపు కిలోమీటర్లు పెరగడం విశేషం. గత ఏడాది జులై 22వ తేదీ నుంచి ఇప్పటి వరకూ వివిధ విభాగాల ద్వారా 9.50 కోట్ల మొక్కలు నాటడం విశేషం. వాటి వివరాలిలా ఉన్నాయి. జిల్లాల వారీగా నాటిన మొక్కలు(లక్షల్లో) అనంతపురం 61.861 చిత్తూరు 87.645 గుంటూరు 32.281 నెల్లూరు 9.487 ప్రకాశం 60.046 వైఎస్సార్‌కడప 20.342 కర్నూలు 36.282 పశ్చిమ గోదావరి 170.020 తూర్పుగోదావరి 56.016 కృష్ణా 36.628 శ్రీకాకుళం 92.431 విశాఖపట్నం 162238 విజయనగరం 124.978 మొత్తం 950.255 నాలుగు రకాల ప్లాంటేషన్ పచ్చదనం పెంపులో భాగంగా ప్రభుత్వం నాలుగు రకాల ప్లాంటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎవెన్యూ ప్లాంటేషన్ : జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రహదారులు తదితర చోట్ల మొక్కలు నాటడాన్ని ఎవెన్యూ ప్లాంటేషన్ అంటారు. చింత, వేప, మర్రి, కానుగ, రావి, బాదం, నిద్రగన్నేరు, ఏడాకులపాయ, నేరేడు తదితర మొక్కలను ఈ ప్లాంటేషన్‌కు వినియోగిస్తారు. బ్యాంక్ ప్లాంటేషన్ : స్థానిక పరిస్థితులు, భూమిని బట్టి సాగునీటి కాలువల వెంబడి సుబాబుల్, టేకు, జామాయిల్, వేప, మలబార్ నీమ్, బాదం తదితర మొక్కలను నాటుతారు. బ్లాక్ ప్లాంటేషన్ : చెట్లు క్షీణించిన అటవీ ప్రాంతం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, రెవెన్యూ పోరంబోకు, దేవాలయ భూములు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర సంస్థల ప్రాంగణాల్లో మొక్కలు నాటడాన్ని బ్లాక్ ప్లాంటేషన్ అంటారు. ఆయా అటవీ ప్రాంతాల వాతావరణం, నేల పరిస్థితులను బట్టి ఎర్ర చందనం, శ్రీగంధం, మోదుగ, నేరవేప, రోజ్ఉడ్, మద్ది, నీరుద్ది, ఏగిస తదితర మొక్కలు పెంచుతారు. ఇళ్లు, పొలాలు: ఇళ్ల వద్ద, పొలం గట్లపైనా నాటుకోవడం కోసం అటవీ శాఖ మొక్కలు ఇస్తుంది. సాధారణంగా రైతులు వేప, చింత, ఎర్రచందనం, టేకు, శ్రీగంధం, ఉసిరి, మామిడి, దానిమ్మ, జామ, సపోటా తదితర మొక్కలను ఇష్టపడుతుంటారు. -
ఏపీ: రాష్ట్రమంతటా ‘పచ్చ’ తోరణం..!
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం కింద మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. జూలై 22వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు అదేరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అక్టోబర్ నెలాఖరు నాటికి వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రయివేట్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 7.35 కోట్ల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యావరణ నిర్వహణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి దేశంలోనే మొదటిసారి ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. పచ్చదనం పెంపు కోసం విస్తృతంగా మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. ట్రీకవర్ పెంపుపైనా ప్రధానంగా దృష్టి పెట్టారు. దీంతో అటవీశాఖ నోడల్ విభాగంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో రెండు నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటించనున్నారు. అటవీ శాఖ ఒక్కటే గత నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3.33 కోట్ల మొక్కలు నాటించింది. ఇతర శాఖలు, విభాగాలు కలిపి సుమారు 4.02 కోట్ల మొక్కలు నాటించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 7.35 కోట్ల మొక్కలు నాటినట్లయింది. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురుస్తుండటంతో నాటినవన్నీ బాగా బతికాయి. వాతావరణం అనుకూలించడంతో బాగా ఇగుర్లు వేసి ఏపుగా పెరుగుతున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయతీరాజ్ రోడ్ల వెంబడి కూడా మొక్కలు నాటారు. రహదారుల వెంబడి నాటిన చింత, వేప, నేరేడు, ఏడాకుల పాయ, బాదం, రావి మొక్కలు చెట్లుగా మారితే రోడ్లకు పచ్చతోరణాలుగా మారతాయని అధికారులు చెబుతున్నారు. సామాజిక అటవీ శాఖ ఉచితంగా పంపణీ చేసిన శ్రీగంధం, టేకు, ఎర్రచందనం, సపోటా, ఉసిరి, వేప, చింత, రావి మొక్కలను రైతులు పొలం గట్లపైనా, ఇళ్ల వద్ద నాటుకుంటున్నారు. అక్టోబర్ నెలాఖరువరకూ నాటిన మొక్కలు (గణాంకాలు లక్షల్లో) అటవీ సర్కిల్ అటవీశాఖ ఇతర శాఖలు మొత్తం అనంతపురం 29.59 100.13 129.72 గుంటూరు 15.42 48.99 64.41 కడప 24.75 11.65 36.40 విజయవాడ 43.40 107.33 150.73 విశాఖపట్నం 220.34 133.42 353.76 మొత్తం 333.50 133.42 735.02 -
జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి శ్రీకారం
-
‘పచ్చ తోరణం’ ప్రారంభించిన సీఎం జగన్
-
దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపాడులో ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. పేదల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్లో మొక్కలు నాటారు. వేప, రావి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తీరును సీఎం వైఎస్ జగన్ ఎండగట్టారు. పేద ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేయాలని సంకల్పించాం. పేదలకు మంచి జరగకూడదన్న దుర్భుద్ధితో ప్రతిపక్షం కోర్టుల్లో కేసులు వేయడం చూశాం. దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు.. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున పేదలకు 30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో వీడియో షేర్ చేశారు. (చదవండి: కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం) “ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేయాలని సంకల్పించాం. పేదలకు మంచి జరగకూడదన్న దుర్భుద్ధితో ప్రతిపక్షం కోర్టుల్లో కేసులు వేయడం చూశాం. దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు.. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున పేదలకు 30లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నాను.” pic.twitter.com/dxDYzRlO57 — YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2020 (‘పచ్చ తోరణం’ ప్రారంభించిన సీఎం జగన్) -
జగనన్న పచ్చతోరణం
-
‘పచ్చ తోరణం’ ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, కృష్ణాజిల్లా: ‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపాడు ‘వనం మనం’ ప్రాంగణానికి చేరుకొన్న ఆయన.. పేదల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్లో మొక్కలు నాటి ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేప, రావి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వన మహోత్సవంలో భాగంగా 20 కోట్ల మొక్కల్ని నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 13 వేల పంచాయితీలు ఉంటే, 17 వేల లే అవుట్లు సిద్ధం చేశామని.. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. మొక్కల్ని నాటాలని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు, అధికారులతో ఈ సందర్భంగా ప్రతిజ్ఙ చేయించారు. అదే విధంగా... ఆగస్టు 15న 30 లక్షల మందికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. ‘‘పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కేసులు వేస్తున్నారు. వారి వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున పేదలకు ఇళ్ల స్థలాలు అందించే కార్యక్రమం చేస్తాం’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బాలినేని శ్రీనివాస్ రెడ్డి , కొడాలి నాని , పేర్ని నాని , వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ , సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం , మహిళాకమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు వహిస్తూ నవరత్నాల తరహాలో తొమ్మిది రకాల మొక్కలు నాటారు. కాగా వన మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం.. పేదల కోసం సిద్ధం చేసిన పదిహేడు వేల లే అవుట్లను పచ్చదనంతో నింపేందుకు సంకల్పించింది. ఈ క్రమంలో ప్రభుత్వం తరపున ఆరు కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ‘జగమంతా వనం.. ఆరోగ్యంతో మనం’ అనే నినాదంతో అధికారులు మందుకు వెళ్తున్నారు. ప్రతీ ఒక్కరూ పది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు. ప్రతి ఇల్లు, ప్రతీ ఊరూ పచ్చదనంతో సింగారిద్దామంటూ.. హంగూ ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదన్న సీఎం జగన్ సూచనల మేరకు సాదాసీదాగా కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు జగనన్న పచ్చ తోరణం
సాక్షి, అమరావతి: ‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఆయన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉదయం 9 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి పాల్గొననున్నారు. వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం జీవరాశులకు ప్రాణవాయువు అందించే మొక్కలను విరివిగా నాటడం ద్వారా చెట్ల పెంపకానికి త్రికరణ శుద్ధితో పాటుపడతామని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనుదామని రాష్ట్ర అటవీ దళాల అధిపతి ఎన్.ప్రతీప్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన ‘జగనన్న పచ్చతోరణం’ ప్రచార సామగ్రిని మంగళవారం విడుదల చేశారు. మొక్కల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే : పెద్దిరెడ్డి జగనన్న పచ్చతోరణంలో భాగంగా రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత కూడా ప్రభుత్వమే చేపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈ కార్యక్రమ ప్రారంభ ఏర్పాట్లను మంగళవారం ఆయన మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి, సీఎం ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్‌లతో కలిసి పరిశీలించారు.