సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపాడులో ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. పేదల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్‌లో మొక్కలు నాటారు. వేప, రావి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తీరును సీఎం వైఎస్ జగన్ ఎండగట్టారు. పేద ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేయాలని సంకల్పించాం. పేదలకు మంచి జరగకూడదన్న దుర్భుద్ధితో ప్రతిపక్షం కోర్టుల్లో కేసులు వేయడం చూశాం. దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు.. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున పేదలకు 30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో వీడియో షేర్ చేశారు.
(చదవండి: కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం)
“ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేయాలని సంకల్పించాం. పేదలకు మంచి జరగకూడదన్న దుర్భుద్ధితో ప్రతిపక్షం కోర్టుల్లో కేసులు వేయడం చూశాం. దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు.. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున పేదలకు 30లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నాను.” pic.twitter.com/dxDYzRlO57
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2020
Comments
Please login to add a commentAdd a comment