Housing Places
-
విలువలే ‘ఇల్లు’వెత్తు ఆస్తి
మంగళగిరి: విలువలే నిలువెత్తు ఆస్తి అని ఆ మహిళ నిరూపించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థల పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. తనకు ఇప్పటికే ఇల్లు ఉందని, ఈ స్థలం పేదలకు దక్కేలా చూడాలని కోరారు. ఆమె నిజాయితీని అధికారులు, పేదలు ప్రశంసిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. నగర పరిధిలోని యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గ 2019లో సొంతింటి కోసం దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం అర్హురాలిగా గుర్తించింది. ఆ తర్వాత ఆమె భర్త సుబ్రమణ్య శర్మ పేరుతో 100 చదరపు గజాల స్థలం కొని బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా ఎంపికైన కనకదుర్గ పేరుతో అధికారులు ఇంటిస్థల పట్టాను మంజూరు చేశారు. ఇటీవల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందించారు. అయితే తనకు సొంతిల్లు ఉందని, పేదలకు చెందాల్సిన సెంటు స్థలం తాను పొందడం భావ్యం కాదని భావించిన కనకదుర్గ ఆ పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. అనర్హులైనా.. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం స్థల పట్టాలు మంజూరు చేస్తోంది. అయితే వీటిని అనర్హులూ తీసుకుంటున్నారు. అప్పటికే తమ పేరు మీద ఆస్తులు, స్థలాలను ఇంట్లో వేరేవారి పేరు మీదకు మార్చి ఇంటిస్థలం, టిడ్కో గృహ పట్టాలు పొందుతున్నారు. ►నగరంలోని ఇందిరానగర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఇప్పటికి మూడు పారీ్టలు మారి ప్రస్తుతం టీడీపీ కండువా కప్పుకున్నాడు. ఆయనకు అనేక ఆస్తులున్నా తల్లి పేరున ఏ ఆస్తి లేకుండా చేసి టిడ్కో ఇల్లు పొందాడు. ఈ ఉదంతం నగరంలో చర్చనీయాంశమవుతోంది. ► కమర్షియల్ కాంప్లెక్స్‌తోపాటు నగరంలో మరో రెండు ఇళ్లు ఉన్న ఓ వ్యక్తి తన భార్య పేరున టిడ్కో ఇల్లు పొందడం గమనార్హం. ► యర్రబాలెంలో రెండు అంతస్తుల డాబాలో ఉండే ఓ మహిళ తనకు నెలకు రూ.25వేల వరకు అద్దెల రూపంలో ఆదాయం వస్తున్నా.. ఇంటిస్థల పట్టాను పొందారు. ఇలా అనేక మంది తమ పేర్ల మీద ఆస్తులు లేకుండా చేసుకుని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే స్థలాలను అర్హులకు దక్కకుండా కాజేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా నిబంధనల వల్ల అధికారులూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కనకదుర్గను ఆదర్శంగా తీసుకుని అనర్హులు పొందిన ఇంటిస్థల పట్టాలను వెనక్కి ఇవ్వాలని అధికారులు, ప్రజలు కోరుతున్నారు. అనర్హులు ఉంటే పట్టాలు రద్దుచేస్తాం పేదల ఇళ్ళ స్థలాలను అనర్హులు పొంది ఉంటే కచ్చితంగా పట్టా రద్దు చేసి చర్యలు తీసుకుంటాం. అనర్హులను ఎంపిక చేసిన సిబ్బందిపైనా చర్యలు తప్పవు. అనర్హులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పట్టాలు వెనక్కి ఇచ్చి పేదలకు దక్కేలా సహకరించాలి. ఇంట్లో ఎవరికైనా స్థలం, ఆస్తి ఉండి స్థలాలు పొందిన అనర్హులు వెంటనే పట్టాలు వెనక్కి ఇవ్వాలి. – జీవీ రామ్‌ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి -
ఇల్లు కొనుక్కున్నా.. పట్టా వెనక్కి తీసుకోండి
మంగళగిరి: రాష్ట్రంలో ఇల్లులేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం పట్టాలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గను అధికారులు అర్హురాలిగా గుర్తించి ఇటీవల ఆమెకు పట్టాను అందజేశారు. నిజానికి.. 2019లో తనకు సొంతిల్లు లేకపోవడంతో కనకదుర్గ అందుకోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తాజాగా అర్హురాలిగా గుర్తించింది. కానీ, 2019 అనంతరం తన భర్త దండిభొట్ల సుబ్రహ్మణ్య శర్మ పేరుతో వున్న వంద చదరపు గజాల స్థలాన్ని విక్రయించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఈ ఏడాది మార్చి 23న రిజిస్ట్రేషన్ చేయించుకుని అందులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా కనకదుర్గను ఎంపిక చేసిన అధికారులు ఆమె పేరున పట్టాను మంజూరుచేసి ఇటీవల అందరితో పాటు అందజేశారు. కానీ, తనకు సొంతిల్లు ఉండగా పేదలకు చెందాల్సిన సెంటు స్థలాన్ని తాను పొందకూడదని కనకదుర్గ గ్రహించి ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటి స్థలాన్ని రద్దుచేసి వేరొక అర్హురాలికి ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులకు ఆదివారం ఆమె లేఖ రాశారు. -
త్వరలో అక్రిడేషన్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు: పేర్ని నాని
సాక్షి, పశ్చిమగోదావరి: త్వరలో అక్రిడేషన్ జర్నలిస్టులను ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిజమైన విలేకరులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కొత్త అక్రిడేషన్ పాలసీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని తెలిపారు. కొంతమంది పత్రికలు, చానళ్లు లేకపోయినా విలేకర్లగా చలామణి అవుతున్నారని, అటువంటి వారిని తొలగించేందుకు కొత్తగా జీఎస్టీ తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఇవీ చదవండి: చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ నిబంధనల సవరణ మనబడి నాడు-నేడు: టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా -
‘పట్టా’లతో పట్టలేని ఆనందం
సాక్షి నెట్వర్క్: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యజ్ఞం మంగళవారం కూడా లబ్ధిదారుల ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణంలో సాగింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 30.75లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుండడంతో తమ కల సాకారమవుతోందని అక్కచెల్లెమ్మలు పట్టలేని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడికక్కడ.. తమకు కేటాయించిన స్థలాలను చూసుకునేందుకు వారంతా లేఅవుట్ల వద్దకు బంధుమిత్రులతో పెద్ద ఎత్తున వస్తుండడంతో అక్కడంతా కోలాహలంగా ఓ జాతరను తలపిస్తోంది. ఎవరికి వారు సెల్ఫీలు దిగుతున్నారు. కొందరైతే పట్టాలు తీసుకున్న వెంటనే శంకుస్థాపన చేసుకుంటున్నారు. ► అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలో 19వ రోజు మంగళవారం 2,474 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 14 నియోజకవర్గాల పరిధిలో 85,761 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలంతో పాటు పట్టాలను పంపిణీ చేశారు. ► చిత్తూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం నాటికి 8,158 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ► కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలో మంగళవారం 1,233 మందికి ఇంటి స్థలాల పట్టాలను అందజేశారు. అలాగే, ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. మిగిలిన ప్రాంతాల్లో అధికారులు పట్టాల పంపిణీ చేపట్టారు. ► వైఎస్సార్ కడప జిల్లాలో మంగళవారం 3,901 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో మొత్తం 1,10,001 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయింది. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం 1,582 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు, 261 మందికి టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. ► ప్రకాశం జిల్లాలో మంగళవారం 762 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 84,027 మందికి పట్టాలివ్వాల్సి ఉండగా 63,360 మందికి పట్టాలిచ్చారు. అలాగే, జిల్లాలో మొత్తం 9,568 టిడ్కో ఇళ్ల సేల్ అగ్రిమెంట్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 3,004 మందికి ఇచ్చారు. ► గుంటూరు జిల్లాలో మంగళవారం 530 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ► తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం వరకు 2,45,911 మందికి ఇళ్లు పట్టాలను పంపిణీ చేశారు. 1,93,506 మందికి ఇళ్ల పట్టాలు, 19,981 మందికి టిడ్కో గృహాలు, 32,424 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు. మంగళవారం ఒక్కరోజు 3,094 ఇళ్ల స్థలాల పట్టాలు అందించినట్లు వివరించారు. అదే విధంగా 1,33,540 మందికి గృహనిర్మాణం చేపట్టేందుకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం మొత్తం 1,403 మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ► శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంగళవారం 1,293 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 19 రోజుల్లో 61,394 పట్టాలను అందజేశారు. -
దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపాడులో ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. పేదల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్లో మొక్కలు నాటారు. వేప, రావి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తీరును సీఎం వైఎస్ జగన్ ఎండగట్టారు. పేద ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేయాలని సంకల్పించాం. పేదలకు మంచి జరగకూడదన్న దుర్భుద్ధితో ప్రతిపక్షం కోర్టుల్లో కేసులు వేయడం చూశాం. దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు.. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున పేదలకు 30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో వీడియో షేర్ చేశారు. (చదవండి: కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం) “ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేయాలని సంకల్పించాం. పేదలకు మంచి జరగకూడదన్న దుర్భుద్ధితో ప్రతిపక్షం కోర్టుల్లో కేసులు వేయడం చూశాం. దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు.. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున పేదలకు 30లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నాను.” pic.twitter.com/dxDYzRlO57 — YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2020 (‘పచ్చ తోరణం’ ప్రారంభించిన సీఎం జగన్) -
‘మాట వినకుంటే ఇళ్లు ముట్టడిస్తాం’
సాక్షి, విజయవాడ: పేదలకు ఇళ్ల స్థలాల కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం సరికాదని బహుజన పరిరక్షణ వేదిక సభ్యులు హితవు పలికారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలంపై ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని అన్నారు. ఇళ్ల స్థలాలపై కోర్టులో వేసిన కేసులు ఉపసంహరించుకోవాలని కోరారు. లేకుంటే 10 రోజుల్లో ప్రతిపక్షాల కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. పేదలకు ఇళ్ల స్థలాలపై సీఎం జగన్‌ను కలుస్తామని చెప్పారు. సోమవారం ఉదయం బహుజన పరిరక్షణ వేదిక సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పేదరికంలో మగ్గుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: కమలం వైపు.. టీడీపీ మిడతల దండు!) పేదలకు సీఎం జగన్ మేలు చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. దళితులకు ఇంగ్లీషు మీడియం లేకుండా చంద్రబాబు అడ్డం పడుతున్నారని అన్నారు. మొదటి నుంచీ చంద్రబాబుకు ఉన్న దుర్భుద్ధి ఇదేనని విమర్శించారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని బహుజన పరిరక్షణ వేదిక సభ్యులు పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి తామంతా మద్దతు ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రజాసంక్షేమం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలూ శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు. (తమ్ముడూ.. ఇది తగునా) -
పేదల జీవితాలతో ఆటలాడుకోవద్దు
-
ఇళ్ల స్థలాలకు భూమిచ్చారని దాడి
క్రోసూరు (పెదకూరపాడు): గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఘాతుకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పేదలకిచ్చే ఇంటి స్థలాల నిమిత్తం ప్రభుత్వానికి పొలం ఇచ్చిన రైతులపై టీడీపీ కార్యకర్తలు గడ్డ పలుగుతో దాడి చేసిన ఘటన క్రోసూరు మండలం బాలెమర్రు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు శ్రీనివాసరావు, అతని అల్లుడు కంకణంపాటి శ్రీధర్ కథనం మేరకు.. బాలెమర్రు గ్రామంలోని ఎస్సీలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు శ్రీనివాసరావు, శ్రీధర్ 1.23 ఎకరాల పొలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ పొలంలో సర్వేయర్, సహాయకులు వచ్చి శుక్రవారం సాయంత్రం కొలతలు వేసి.. మార్కింగ్ చేస్తుండగా పక్క పొలానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ముసులూరి సాంబశివరావు, ముసులూరి కృష్ణారావు, బొబ్బా వెంకటేశ్వరావు, బొబ్బా రాధాకృష్ణ, తాళ్లూరి లక్ష్మీనారాయణ వచ్చి ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం పొలం ఎందుకిచ్చారంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. గడ్డ పలుగుతో దాడి చేశారు. దీంతో శ్రీనివాసరావు, శ్రీధర్ భయపడి పారిపోయారు. అనంతరం వారిద్దరూ కారులో ఎస్సీ కాలనీకి వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని గడ్డపలుగుతో కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు చప్పిడి శ్రీను, మల్లెల హరి, పెద్దింటి దేవునిదయ, మేళం థామస్‌తో కలిసి బాధితులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. (చదవండి: బినామీ ‘బాబు’కు చెక్ ) -
ఇళ్ల స్థలం అడిగితే.. ఈడ్చుకెళ్లారు..
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: కడప కలెక్టరేట్ గురువారం రణరంగాన్ని తలపించింది. ఇళ్లస్థలాలివ్వండి మహాప్రభో అంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న ప్రజలపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలనే కనీస విచక్షణ కూడా లేకుండా వారిని ఈడ్చుకెళ్లారు. కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే.. కడప నగరంలోని అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని కోరుతూ గురువా రం కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో పికెటింగ్ నిర్వహించారు. ఉదయం 10గంటలకు వందలాది మంది ప్రజలు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ప్రధా న ద్వారం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అప్పటికే సీఆర్పీఎఫ్తోపాటు పెద్ద సంఖ్యలో సాయుధ పోలీసులు మో హరించారు. మధ్యాహ్నం 12గంటల ప్రాం తంలో డీఆర్ఓ ఈశ్వరయ్య ఆందోళనకారుల వద్దకు వచ్చారు. సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు సావంత్ సుధాకర్‌రావు, బి.మనోహర్, పాపిరెడ్డి, ఓ.శివశంకర్, మగ్బూల్బాషాలతో చర్చించి ఆందోళన విరమించాలని కోరారు. ఈ సందర్భంగా రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలోని అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలంటూ గత నాలుగేళ్లుగా అన్ని రకాల ఆందోళనలు నిర్వహిం చినప్పటికీ రెవెన్యూ యంత్రాంగంలో చల నం లేదన్నారు. కబ్జాదారులకు అండగా నిలుస్తున్న అధికారులకు పేదలకు జానెడు స్థలం ఇచ్చేందుకు మనసు రాకపోవడం విచారకరమన్నారు. ఇందుకు డీఆర్ఓ బదులిస్తూ స్థలాల మంజూరు విషయంపై జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడితే ఆ తర్వాత చర్చించవచ్చన్నారు. ఇందుకు సీపీఎం కార్యకర్తలు ససేమీరా అన్నారు. కలెక్టర్ శశిధర్ తక్షణమే వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదంటూ భీష్మించారు. సీపీఎం నాయకులపై కేసు నమోదు కడప అర్బన్, న్యూస్‌లైన్: నగరంలోని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద పికెటింగ్ నిర్వహించిన సందర్భంగా జరిగిన తోపులాటకు సంబంధించి సీపీఎం నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగనాయకులు తెలిపారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో కలెక్టరేట్ ప్రధాన ద్వారానికి అమర్చిన గేటు విరిగిపోయింది. ఈ నేపథ్యంలో వన్‌టౌన్ ఎస్ఐ పిజిఎం ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీపీఎం నాయకులు రవిశంకర్‌రెడ్డి సహా పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నిం చారు. కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు నాగేశ్వరరెడ్డి, నాయకుల నారాయణ, శివన్న, ఎస్ఐ రంగనాయకులు, సీఆర్పీఎఫ్తోపాటు ఇతర సా యుధ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తీవ్ర తోపులాటలో కలెక్టరేట్ ప్రధాన గేటు విరిగిపోయింది. దీంతో ఒక్క ఉదుటున ప్రజలు లోనికి చొచ్చుకెళ్లారు. కా ర్యాలయం పైకి వెళ్లనివ్వకుండా పోలీ సులు అడ్డుకున్నారు. తొక్కిసలాటలో పలువురు మహిళలు సొమ్మసిల్లారు. ఆందోళన విరమించకపోవడంతో సీపీఎం నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. మహిళా పోలీసులు రంగప్రవేశం చేసి పేద మహిళలను విచక్షణా రహితంగా ఈడ్చి పడేశారు. ఇలా రెండు దఫాలుగా అరెస్టుల పర్వం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ ఆవరణంతా తెగిపడిన చెప్పులు, పగిలిన గాజులు, విరిగిన జెండాకట్టెలు, కనిపించాయి. నేడు నిరసన ప్రదర్శన శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న తమపై పోలీసులు ప్రదర్శించిన వైఖరిని నిరసిస్తూ శుక్రవారం నగరంలో ప్రదర్శన నిర్వహించాలని సీపీఎం నాయకులు నిర్ణయించారు. ఉద యం 10గంటలకు జియోన్ కళాశాల ఆవరణం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు దస్తగిరిరెడ్డి తెలిపారు.