సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టును రికార్డు టైంలో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. సోమవారం ఆయన కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జల్‌జీవన్ మిషన్ సదస్సులో పాల్గొన్నారు. సమావేశ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీ టెండరింగ్ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వచ్చే నెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీలో పర్యటిస్తారని... పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ప్రాజెక్టుకు సంబంధించి సెప్టెంబర్‌లో టెండర్లు పిలవబోతున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రూ. 60 వేల కోట్ల అంచనాలతో ఈ పనులను ప్రారంభించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం నుంచి రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం కోరామని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment