అనంతపురం : ఇసుక నూతన విధానాన్ని సడలించి సామాన్యునికి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం గోరంట్లలో ధర్నాకు దిగారు. అనంతరం తహాశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. మీ-సేవా కేంద్రాల ద్వారా ఇసుకకు దరఖాస్తు చేసుకునే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గోరంట్లలో ఇసుకరీచ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ధర్నాలో వైఎస్సాసీపీకి చెందిన జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంపల వెంకటరమణా రెడ్డితో సహా పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
(గోరంట్ల)
నూతన ఇసుక విధానంపై వైఎస్సార్‌సీపీ ధర్నా
Published Mon, Apr 27 2015 1:02 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement