సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం ఒకటో బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా చేసేందుకు ఇటీవల విడుదల చేసిన ప్రత్యేక పారిశ్రామిక విధానానికి (జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం పథకం) కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే నూతన ఇసుక విధానంపై కేబినెట్ చర్చించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి డీపీఆర్‌పై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ
Published Thu, Nov 5 2020 5:16 AM | Last Updated on Thu, Nov 5 2020 5:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment