సాక్షి, అమరావతి : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీ సత్ఫలితాలను అందిస్తోంది. ఈ పాలసీ ద్వారా వినియోగదారులకు పారదర్శకంగా ఇసుక సరఫరా జరుగుతోంది. నూతన పాలసీ ద్వారా గత నెల 30వ తేదీ నాటికి 23,91,716 టన్నుల ఇసుక సరఫరా జరిగింది. ఫలితంగా రాష్ట్రానికి రూ.89.31కోట్ల ఆదాయం లభించింది.
(చదవండి : నెట్టింట్లో ఇసుక!)
ఇసుక అక్రమార్కులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అక్రమంగా ఇసుక నిల్వ, బ్లాక్ మార్కెటింగ్, ఇసుకతో వ్యాపారం చేసిన వారికి రూ. 2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరింది. ఇసుక అక్రమాలపై టాస్క్‌ఫోర్స్ దాడులలో కళ్లెం వేసింది. అలాగే ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కంప్యూటర్‌పై స్వల్ప పరిజ్ఞానం ఉన్న వారు కూడా సులభంగా ఇసుక బుక్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించారు. ఫలితంగా అక్రమాలకు తావు లేకుండా.. రాష్ట్ర ప్రజలకు సులభంగా ఇసుక లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment