ల్యాప్‘టాప్’లాంటి ఐడియా..
వీరంతా దేవాలయంలో ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తున్నారో తెలుసా? ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ ఉపాధిని పొందుతున్నారు.
ల్యాప్‌టాప్‌ల్లో ఈ చలాన్ల ఎంట్రీతో సంపాదన
వీరంతా దేవాలయంలో ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తున్నారో తెలుసా? ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ ఉపాధిని పొందుతున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం దేవాలయంలో యువకులంతా ల్యాప్‌టాప్ బ్రౌజింగ్‌లో బిజీగా ఉన్నారు. విషయం ఏమై ఉంటుందని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీలో భాగంగా టీఎస్‌ఎండీసీ ద్వారా ప్రతిరోజూ ఇసుక రవాణా చేయడానికిచ్చే పర్మిట్లను వీరు ఆన్‌లైన్‌లో సాధిస్తున్నారు.
టీఎస్‌ఎండీసీ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం వెబ్‌సైట్ ఓపెన్ చేస్తారు. ఆ సమయంలోనే లారీల యజమానులు తమ లారీ నంబర్‌తో పాటు రూ.8,725 అప్‌లోడ్ చేయాలి. ‘మీసేవ’ బిజీగా ఉండడంతో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువతకు అవకాశం కల్పించడంతో.. వీరు ఇలా ఉపాధి పొందుతున్నారు.
– యాదాద్రి