హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై సోమవారం జీవో జారీ అయ్యింది. ఈనెల 11వ తేదీ నుంచి 14 వరకూ చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో 12మంది సింగపూర్ వెళ్లడానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణతో పాటు వివిధ రంగాల నిపుణులు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. కాగా రాజధాని నిర్మాణం కోసం బీఏసీ నిపుణుల బృందంతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. సీఎంతోపాటు నిపుణుల బృందం సింగపూర్లోని నగరాల మాస్టర్ ప్లాన్లను, నిర్మాణాలలో అనుసరించిన టెక్నాలజీని అధ్యయనం చేస్తారు.