రాజ్యాంగ విరుద్ధంగా జీవోల జారీ | Government Order issued unconstitutional | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ విరుద్ధంగా జీవోల జారీ

Published Fri, May 22 2015 3:30 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

Government Order issued unconstitutional

- రౌండ్‌టేబుల్ సమావేశంలో
- పలువురు వక్తల ధ్వజం
గాంధీనగర్ :
రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని, రాజ్యాంగ విరుద్ధంగా జీవోలు జారీ చేస్తోందని పలువురు వక్తలు ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రాజధాని భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా గురువారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. పలువురు వక్తలు మాట్లాడుతూ అవసరం లేకపోయినప్పటికీ రైతులనుంచి వేల ఎకరాల భూమిని బలవంతంగా లాగేసుకుంటున్నారన్నారు.

రాజ్యాంగ విరుద్దంగా జీవోలు జారీ చేసి రైతులను మోసగిస్తోందన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు  నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 1.39లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీచేయకుండా నిరంతరం  రాజధాని చుట్టూ పాలకులు చక్కర్లు కొడుతున్నారన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ 109, 110 ,166.జీవోలతో ప్రభుత్వ మోసం బయటపడిందని చెప్పారు,  సీపీడీఎంసీ పేరుతో కంపెనీ పాలనకు తెరతీశారన్నారు. కంపెనీ పేరును తర్వాత కార్పొరేషన్‌గా ప్రభుత్వం మార్పు చేసిందన్నారు.

రైతులు తమకు అంగీకారం ఉంటేనే భూముఇలివ్వండని నమ్మబలుకుతూ మరో వైపు బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. కార్పొరేషన్ పాలన అమల్లోకి వస్తే  ప్రతి పనికి పన్ను వసూలు చేస్తారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ రాజధాని పేరుతో భూములు సమీకరించి కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారన్నారు. తులసీదాసు మాట్లాడుతూ క్రెడా చట్టం ప్రకారం భూములు సేకరించి కార్పొరేషన్‌కు అప్పగిస్తోందని విమర్శించారు. భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు.

సీపీఐ(ఎంల్) న్యూడెమోక్రసీ నాయకుల పోలారి, సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి జేవీ రాఘవులు, రాజధాని ప్రాంత  కన్వీనర్ రాధాకృష్ణ, సీపీఐ నాయకులు, వై. కేశవరావు, కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న భూములను 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తే  రైతులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొటుందన్నారు. ప్రభుత్వా నిర్ణయాలకు వ్యతిరేకంగా సమైక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.  ఎం. విజయ్‌కుమార్, గంగాధరరావు, శ్రీనివాస్, జి. వీరాంజనేయులు, యలమందరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement