లక్షలోపు రుణమాఫీ, జీవో జారీ చేసిన టీ.ప్రభుత్వం!
హైదరాబాద్: 2014 మార్చి 31 వరకు ఉన్న లక్షలోపు వ్యవసాయ రుణాలు రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతు రుణమాఫీ జీ వోను బుధవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రైతు రుణమాఫీ మార్గదర్శకాలతో కూడిన జీ వో నం.69ను ప్రభుత్వం తరపున తెలంగాణ వ్యవసాయశాఖ విడుదల చేసింది.
ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున రుణమాఫీ వర్తింపు ఉంటుందని, స్వల్పకాలిక, వ్యవసాయ గోల్డ్ లోన్స్ కూడా రుణమాఫీ చేస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. రైతు రుణాల మాఫీ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని, బ్యాంకులు తక్షణమే రైతులకు కొత్త రుణాలివ్వాలని బ్యాంకర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది.