చారిత్రక కట్టడంగా గురజాడ గృహం | ap government issued orders to consider gurajada apparao's house as historic construction | Sakshi
Sakshi News home page

చారిత్రక కట్టడంగా గురజాడ గృహం

Published Sun, May 24 2015 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

చారిత్రక కట్టడంగా గురజాడ గృహం

చారిత్రక కట్టడంగా గురజాడ గృహం

- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం


విజయనగరం కంటోన్మెంట్: నవయుగ వైతాళికుడిగా ఖ్యాతిగాంచిన గురజాడ నివసించిన గృహాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు గుర్తించింది.

విజయనగరంలోని గురజాడ గృహాన్ని  చారిత్రక కట్టడంగా, ఆ గృహ సముదాయాన్ని పురావస్తు కట్టడంగా గుర్తిస్తున్నట్టు పురావస్తు, మ్యూజియం శాఖ శనివారం ప్రకటించింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ జీఓ నంబర్-8ను విడుదల చేశారు. దీని ప్రకారం గురజాడ గృహాన్ని చారిత్రక కట్టడంగా, పురావస్తు ప్రదేశంగా గుర్తిస్తూ గెజిట్ పబ్లికేషన్‌ను విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement