Gurajada Apparao
-
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. గురజాడ అప్పారావుకి జగన్ నివాళి
-
గురజాడ అప్పారావుకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.‘‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అన్న దేశభక్తి గీతాన్ని సమాజాన్ని మేల్కొలిపే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెలుగుజాతికి అందించిన అభ్యుదయ కవితా పితామహుడు, గురజాడ అప్పారావు. ఆయన జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.“దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అన్న దేశభక్తి గీతాన్ని, సమాజాన్ని మేల్కొలిపే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెలుగుజాతికి అందించిన అభ్యుదయ కవితా పితామహుడు, గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2024 ఇదీ చదవండి: -
ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ అజేయుడే!
‘‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా... దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.’’ గురజాడ దేశభక్తి గీతం ఒక్కటే చాలు ఆయనకు ప్రపంచ స్థాయి కవుల పక్కన చోటివ్వడానికి అని శ్రీశ్రీ అన్న మాటలు అక్షర సత్యాలు. దేశం, దేశంపై ప్రేమ, దేశభక్తి అంటే ఏంటో వంద సంవత్సరాల కిందటే మనిషి కోణంలోంచి ఆలోచించి చెప్పాడు గురజాడ. రెండువేల ఆరువందల సంవత్సరాల ముందే గౌతమ బుద్ధుడు అన్న ‘బహుజన హితాయ బహుజన సుఖాయ’ వాక్యంలోనూ, బౌద్ధ నైతిక ధర్మంలోనూ దుఃఖంలేని మానవ సమాజమే ముఖ్యం. బౌద్ధ ధర్మంలోని సారాన్ని హృదయానికి హత్తుకున్నవాడు కాబట్టే గురజాడ ‘దేశభక్తి’ లాంటి ప్రపంచస్థాయి గీతాన్ని రాయగలిగాడు. ఈ దేశంలోంచి బౌద్ధం తరిమి వేయబడినపుడే మతపరంగా భారతదేశం ఆత్మహత్య చేసుకుంది అన్నాడు గురజాడ. మనిషిని పట్టించుకోని ఏ మతం అయినా, విషయమైనా మానవజాతి ప్రగతిని కోరే వారి దృష్టిలో అసమ్మతం అయిందేనన్నది వాస్తవం. దేశమంటే చెట్లు, గుట్టలు, నదీనదాలు కాదు. మట్టి మాత్రమే కాదు, దేశమంటే మను షులు. దేశభక్తంటే ఆ మనుషులపై భక్తి, ప్రేమ... ఆ మనుషుల బాగోగులను చూడటమే. మనిషి కేంద్రంగా, మనిషి బాగోగులు లక్ష్యంగా, మానవాభివృద్ధి ధ్యేయంగా పాలన సాగించేవాడే మంచి పాలకుడు. దేశమును ప్రేమించడమంటే అదే. అలాంటి పాలన నందించే అతికొద్దిమంది నాయకులలో యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అతనికి కావాల్సింది తన ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ అందించడం. కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గాలకతీతంగా అందరికీ మేలు చేసే పనులు చేయడం. అందుకే దాదాపు 31 లక్షల మందికి మూడున్న రేళ్లయినా పూర్తికాక ముందే ఇండ్ల స్థలాలు ఇచ్చారు. దాదాపు రెండు లక్షల మందికి ఇప్పటికే ఇళ్లు కట్టించారు. లక్షలాది ఇళ్ల నిర్మాణ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల వాగ్దానాలను 95 శాతం పైగా నెరవేర్చారు. విద్య, వైద్యం, సేద్యం, తిండి, బట్ట, ఇల్లు... ఇలా మనిషి మనుగడకు సంబంధించిన అన్ని అవసరాలనూ రాజకీయ విలువలనూ కాపాడుతూ, కమిట్మెంట్ రాజకీయాలను నడుపుతూ తీర్చడం సామాన్య విషయం కాదు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతూ సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తున్నారు. ఇలాంటి మనిషి కేంద్రంగా సాగుతున్న పాలన తెలుగుదేశం లాంటి ప్రధాన ప్రతి పక్షానికీ, తెలుగు రాష్ట్రాల్లో తద్వారా దక్షిణాదిలో బలపడాలని అనుకుంటున్న బీజేపీకీ, ఏ రాజకీయ సిద్ధాంత అవగాహన లేక నోటి కొచ్చింది మాట్లాడుతూ ఎవరితోనైనా సరే పొత్తు పెట్టుకోవాలని చూసే పవన్ కల్యాణ్‌కూ నచ్చవు. ద్వేషపూరిత రాజకీయాలను రెచ్చ గొడుతూ అధికారంలోకి రావాలని చూడటమే వీరి ఉద్దేశ్యం. దేశభక్తంటే వీరికి మతభక్తి. కులాలను రెచ్చగొట్టడం. ప్రాంతీయ విభేధాలను రెచ్చ గొట్టడం. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఏవీ వీరికి పట్టవు. ఏం చేసైనా సరే అధికారంలోకి రావడం వీరి ఉద్దేశ్యం. ప్రజల కనీసావరాలను తీర్చే ఒక్క ప్రణాళిక కానీ, రాష్ట్ర ప్రగతి పథానికి ఉపయోగపడే ఒక్క పథకం కానీ లేకుండా ప్రజల సెంటిమెంట్లను రెచ్చ గొట్టి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న వీరికి 2019 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికల్లోనూ జరిగిన ఆశా భంగమే 2024 ఎన్నికల్లో జరుగుతుందన్నది వాస్తవం. గురజాడ చెప్పిన దేశమును ప్రేమించుమన్నా అన్న సూక్తినీ, దేశభక్తి నిర్వచనాన్నీ హృదయానికి హత్తుకొని పరిపాలన కొనసాగిస్తూ ఆంధ్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ అజేయుడే! (క్లిక్ చేయండి: మూడు రాజధానుల ప్రతిపాదన అందుకే..) - కాలువ మల్లయ్య ప్రముఖ సాహితీవేత్త -
కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఎందుకు రాశారు!?
గురజాడ వారి ‘కన్యాశుల్కం’ ఒక అపూర్వ నాటక శిల్పం. లెక్కలేనన్ని పునర్ముద్రణలతో ఈ నాటకం ఎప్పటికప్పుడు పునరుజ్జీవనం పొందుతూనే ఉంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలోని ‘మానవవికాస వేదిక’ కన్యాశుల్కం నాటకాన్ని తాజాగా మళ్లీ ముద్రించింది. విజయనగరంలోని గురజాడ గృహాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి కన్యాశుల్కం ప్రతిని ఉచితంగా ఇవ్వనున్నారు. ఆ ఇంటిని పర్యవేక్షిస్తున్న గురజాడ ముని మనుమడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్, వారి సతీమణి ఇందిరాదేవిలకు ఈనెల 29వ తేదీ గురువారం సాయంత్రం తిరుపతి ఆఫీసర్స్ క్లబ్ జరగనున్న సమావేశంలో ‘కన్యాశుల్కం’ ప్రతులను అందివ్వనున్నారు. ‘కన్యాశుల్కం’ నాటకాన్ని గురజాడ అసలు ఎందుకు రాశారు!? గర్భస్థ శిశువుకు కూడా బేరం పెట్టడం వంటి దారుణ స్థితిగతులు గురజాడను కలిచివేసి కన్యాశుల్కం నాటక రచనకు ప్రేరేపించాయి. ఈ దురాచారం పైన గురజాడ కత్తి దూయలేదు, దండెత్తలేదు, అవహేళన చేసి వదిలి పెట్టారు. లండన్‌లో మురికివాడల గురించి ప్రపంచ ప్రసిద్ధ నాటకకర్త జార్జ్ బెర్నార్డ్ షా ‘విడోవర్స్ హౌసెస్’ అన్న నాటకాన్ని రాసి 1892 డిసెంబర్ 9న ప్రదర్శించారు. దానికి నాలుగు నెలల ముందే 1892 ఆగస్టు 12వ తేదీన విజయనగరంలో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని గుర జాడ ప్రదర్శించారు. (క్లిక్: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి..) సమకాలీన సమస్యలపైన వచ్చిన తొలి నాటకంగా ‘కన్యాశుల్కం’ ప్రపంచ నాటక రంగ చరిత్రలో నిలిచిపోయింది. గిడుగు రామమూర్తికి బి.ఏ. లో సహ విద్యార్థి అయిన గురజాడ వ్యవహారిక భాషా ఉద్యమం ఊపిరి పోసుకోక ముందే, తన పాతికేళ్ల వయసులో వ్యవహారిక భాషలో ‘కన్యాశుల్కం’ రాసి వ్యవహారిక భాషా ఉద్యమానికి బీజం వేశారు. బ్రిటిష్ ప్రభుత్వం కన్యాశుల్కాన్ని నిషేధించకపోయినా, 1929లో బాల్య వివా హాల నిషేధ చట్టం రావడానికి ‘కన్యాశుల్కం’ నాటకం దోహదం చేసింది. అందుకనే ఇదొక మహా దృశ్యకావ్యంగా, తెలుగు వారి సాహిత్య వారసత్వ సంపదగా నిలిచిపోయింది. (క్లిక్ చేయండి: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) – రాఘవ శర్మ -
సీఎం జగన్‌ను కలిసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శాసనసభలోని సీఎం కార్యాలయంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కలిశారు. మహాకవి గురజాడ అప్పారావు 160వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని భూమన కరుణాకర్‌రెడ్డి ఐదువేల కాపీలను ముద్రించారు. వీటిని సీఎం జగన్ బుధవారం ఆవిష్కరించారు. ఈ కాపీలను విజయనగరంలోని గురజాడ ఇంటికి బహూకరించి.. సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు భూమన తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: (కరవు, బాబు ఇద్దరూ కవలలు: సీఎం జగన్) -
గురజాడ అప్పారావుకు సీఎం జగన్ ఘన నివాళి
సాక్షి, అమరావతి: మహాకవి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా మంగళవారం ఆయనకు సీఎం జగన్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘మహాకవి, తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన ఆ మహానీయుడిని మరువదు ఈ తెలుగు నేల’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: యువతకు గుడ్‌న్యూస్.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే.. మహాకవి, తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన ఆ మహనీయుని మరువదు ఈ తెలుగునేల. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2021 -
కవితల పండుగ: ఫేమస్ కవితలు చూసేద్దామా!
‘ప్రపంచమొక పద్మవ్యూహం/ కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు శ్రీశ్రీ. కవిత్వం గురించి ఎంత చెప్పుకున్నా కవితాభిమానులకు తీరే దాహం కాదది. కవిత్వం ఒక వాక్కళ. బహుశ వాక్కు పుట్టినప్పుడే కవిత్వమూ పుట్టి ఉంటుంది. కవిత్వం ఒక చిత్కళ. కవిత్వంలేని భాష లేదు, కవిత్వానికి అందని భావమూ లేదు. కవిత్వం గురించి సవివరంగా చెప్పుకోవాలంటే ఎన్ని ఉద్గ్రంథాలైనా చాలవు. కవిత్వాన్ని సంక్షిప్తంగా చవిచూపడానికి ఒక్క పదునైన వాక్యమైనా సరిపోతుంది. కవిత్వం గురించి ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే, నేడు (మార్చి 21న) ప్రపంచ కవితా దినోత్సవం. కవిత్వానికి గల సమస్త పార్శవాలనూ స్పృశించడం సాధ్యమయ్యే పనికాదు గాని, ఈ సందర్భంగా ఆధునిక తెలుగు కవుల చమత్కారాల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆద్యులలో ఒకరు కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కర్త అయిన కందుకూరి తన కాలంలోని సాంఘిక దురాచారాలను ఖండించడానికి తన కలానికి పదునుపెట్టారు. సమాజంలోని పెద్దమనుషుల దుర్మార్గాలపై వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెట్టారు. కందుకూరి రాసిన ప్రహసనాలు ఆయన చమత్కార ధోరణికి అద్దం పడతాయి. కందుకూరి ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’ అనే ప్రహసనప్రాయమైన నవల రాశారు. అందులో ఆడుమళయాళాన్ని గురించి వర్ణనలో ఆయన హాస్యం గిలిగింతలు పెట్టిస్తుంది. ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’లోని ‘ఆడుమళయాళం’ పూర్తిగా మహిళల రాజ్యం. అక్కడివారు ‘పత్నీవ్రత ధర్మబోధిని’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలోని నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటారు. వాటిలో మచ్చుకొకటి... ‘పురుషుండు గార్దభమునున్ స్థిరమగు దండనము లేక చెడిపోదురిలన్ గరుణ దలంపక నెలకొక పరిౖయెనం గొట్టవలయు పత్ని పురుషునన్’ ఇదంతా ఇప్పటితరం పాఠకులకు ‘జంబలకిడి పంబ’ సినిమాను తలపిస్తుంది. కందుకూరి ప్రహసనాల్లో ‘కలిపురుష శనైశ్చరవిలాసం’ ఒకటి. అందులో మద్యానికి ఎంగిలి లేదంటూ వ్యంగ్యంగా చెప్పిన పద్యం... ‘పొగచుట్టకు సతిమోవికి అగణితముగ మద్యమునకు అమృతమునకున్ తగ నుచ్చిష్టము లేదని ఖగవాహను తోడ కాలకంఠుడు బలికెన్’ గురజాడ అప్పారావు తన ‘కన్యాశుల్కం’ నాటకంలో ఇదే పద్యాన్ని వెంకటేశం నోట పలికిస్తారు. అంతేకాదు, ఇదే పద్యాన్ని అనుకరిస్తూ, గిరీశం పాత్రతో ఇలా చెప్పిస్తారు: ‘‘ఖగపతి యమృతము తేగా భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ పొగచుటై్ట జన్మించెను పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’’ ‘కన్యాశుల్కం’ నాటకం ఆద్యంతం హాస్యభరితంగానే సాగుతూ, ఆనాటి సమాజంలోని దురాగతాలను కళ్లకు కడుతుంది. హాస్యానికి మారుపేరైన కవులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రహసనాలు కూడా రాశారు. ఆయన రాసిన ‘అద్భుత కవిత్వ ప్రహసనం’లో ప్రాచీన కవిత్వం పాషాణమని, నవీన కవిత్వం గొప్పదని గురువుతో చెబుతారు శిష్యులు. వారు వెలగబెట్టిన నవీన కవిత్వానికి ఒక మచ్చుతునక... ‘తోటకూర తెచ్చి దొడ్డిలోన తరిగి కుండలోన బెట్టి కుదమగాను కింద మంటబెట్ట ఉడకకేం జేస్తుంది దాని కడుపు కాల ధరణిలోన’ ఇక చిలకమర్తివారు రాసిన పకోడి పద్యాలు సుప్రసిద్ధాలు. అయితే, తిరుపతి వేంకట కవులు కూడా పకోడిపై ఒక చమత్కార పద్యం చెప్పారు. కరకరలాడే ఆ పద్యం ఇదీ: ‘కరకరలాడు కొంచెమగు కారము గల్గు బలాండు వాసనా హరమగు గొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చట ధరను బకోడిబోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా దరమున బల్కుచుందు రదితాదృశమే యగునంచు దోచెడిన్’ ఇలాంటివన్నీ ఆధునిక సాహిత్యం తొలినాళ్లలోని చమత్కారాలకు ఉదాహరణలు. ‘మహాప్రస్థానం’తో శ్రీశ్రీ కవనరంగంలో కదం తొక్కడం ప్రారంభించాక కొత్త ఊపు వచ్చింది. విప్లవకవిగా ముద్రపడిన శ్రీశ్రీ ‘సిప్రాలి’లో చమత్కార కవిత్వంతో పాటు పేరడీ గారడీలూ చేశాడు. ‘సిరిసిరిమువ్వ’ మకుటంతో కంద పద్యాలు, ‘ప్రాసక్రీడలు’, ‘లిమరిక్కుల’తో కలిపి ‘సిప్రాలి’గా తీసుకొచ్చిన పుస్తకంలో శ్రీశ్రీ కవితా చమత్కారం పూర్తిస్థాయిలో కనిపిస్తుంది. ‘పంచపదుల్లో’ శ్రీశ్రీ కవితా హాస్యం చూడండి... ఇవి నిజంగా ‘పంచ్’పదులు. ‘అరవ్వాడి దోసై మీద తోచించి వ్రాశై ఏవో విట్లు వేశై ఏవో ఫీట్లు చేశై తర్వాత చూసుకుందాం ప్రాసై...’ ‘పెరిగితే వ్యాపార దృష్టి మరిగితే లాభాల సృష్టి దొరికితే అమెరికా ముష్టి మిగిలేది విగ్రహపుష్టి నైవేద్య నష్టి!’ ఆరుద్ర ‘కూనలమ్మ పదాలు’, ‘ఇంటింటి పజ్యాలు’లో చమత్కారమే ప్రధానంగా కనిపిస్తుంది. ఆరుద్ర చమత్కారానికి ఓ రెండు మచ్చు తునకలు ‘కోర్టుకెక్కిన వాడు కొండనెక్కిన వాడు వడివడిగ దిగిరాడు ఓ కూనలమ్మా!’ ‘బ్రూటుకేసిన ఓటు బురదలో గిరవాటు కడకు తెచ్చును చేటు ఓ కూనలమ్మా!’ పేరడీ గారడీలు ‘మహాప్రస్థానం’లో శ్రీశ్రీ ‘నవకవిత’ శీర్షికన... ‘‘సిందూరం, రక్తచందనం బందూకం, సంధ్యారాగం పులిచంపిన లేడినెత్తురూ ఎగరేసిన ఎర్రనిజెండా రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక కావాలోయ్ నవకవనానికి...’’ అంటూ ఉద్వేగభరితంగా రాసిన కవితకు ‘జరుక్ శాస్త్రి’గా ప్రసిద్ధుడైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఇలా పేరడీ రాశారు. ‘‘మాగాయీ కందిపచ్చడీ ఆవకాయ, పెసరప్పడమూ తెగిపోయిన పాతచెప్పులూ పిచ్చాడి ప్రలాపం, కోపం వైజాగులో కారా కిల్లీ సామానోయ్ సరదాపాటకు...’’ శ్రీశ్రీ ఒరిజినల్ కవిత ఎంత ఉద్వేగం కలిగిస్తుందో, జరుక్ శాస్త్రి పేరడీ కవిత అంతకు మించి నవ్వులు పూయిస్తుంది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితలకు జరుక్ శాస్త్రితో పాటు మాచిరాజు దేవీప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి వారెందరో పేరడీలు రాశారు. మహాప్రస్థానంలో శ్రీశ్రీ ‘పొలాలనన్నీ హలాల దున్నీ ఇలాతలంలో హేమం పండగ జగానికంతా సౌఖ్యం నిండగ...’ అంటూ రాసిన కవితకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఇలా పేరడీ రాశారు: ‘అవాకులన్నీ చవాకులన్నీ మహారచనలై మహిలో నిండగ ఎగబడి చదివే పాఠకులుండగ విరామమెరుగక పరిశ్రమిస్తూ అహోరాత్రులూ అవే రచిస్తూ ప్రసిద్ధికెక్కే కవి పుంగవులకు వారికి జరిపే సమ్మానాలకు బిరుదుల మాలకు దుశ్శాలువలకు కరతాళాలకు ఖరీదు లేదోయ్...’ పేరడీ కవులు కొందరు ప్రాచీన పద్యాలకు సైతం పేరడీలు రాశారు. పోతన భాగవతంలో రాసిన ‘వారిజాక్షులందు వైవాహికములందు’ అనే శుక్రనీతి పద్యానికి డాక్టర్ వెలుదండి నిత్యానందరావు పేరడీ పద్యం చూడండి... ‘పదవి వచ్చు వేళ పదవి పోయెడు వేళ ప్రాణమైన పదవి భంగమందు కూడబెట్టినట్టి కోట్ల రక్షణమందు బొంగకవచ్చు నఘము పొందడధిప’ పోతన భాగవత పద్యాలకు పేరడీలు రాసిన వారిలో పులికొండ సుబ్బాచారి ఒకరు. ‘కలడు కలండనువాడు కలడో లేడో..’ అనే పద్యానికి ఆయన రాసిన పేరడీ ఇది: ‘కలదందురు మంజీరలొ కలదందురు గండిపేట కాలువలందున్ కలదందురు పంపులలో కలదు కలందనెడు నీరు కలదో లేదో!’ శ్రీశ్రీకి గురుతుల్యుడైన అబ్బూరి రామకృష్ణారావు కూడా పోతనను పేరడీ చేశారు. భాగవతంలో పోతన రాసిన ‘అరయన్ శంతనుపుత్రునిపై విదురుపై నక్రూరుపై కుబ్జపై...’ అనే పద్యానికి అబ్బూరి వారి పేరడీ ఇదీ... ‘వడపై, నావడపై, పకోడిపయి, హల్వాతుంటిపై, బూందియాం పొడిపై, నుప్పిడిపై, రవిడ్డిలిపయిన్, బోండాపయిన్, సేమియా సుడిపై చారు భవత్కృపారసము నిచ్చో కొంతరానిమ్ము నే నుడుకుం గాఫిని ఒక్కచుక్క గొనవే! ఓ కుంభదంభోదరా!’ శ్రీశ్రీ కవితలకు పేరడీలు రావడం ఒక ఎత్తయితే, శ్రీశ్రీ తానే స్వయంగా పేరడీ గారడీలు చేయడం విశేషం. శ్రీశ్రీ తన ‘సిప్రాలి’లో సుమతీ శతకంలోని ‘ఏరకుమీ కసుగాయలు...’ పద్యానికి చేసిన పేరడీ... ‘కోయకుమీ సొరకాయలు వ్రాయకుమీ నవలలని అవాకులు చెవాకుల్ డాయకుమీ అరవ ఫిలిం చేయకుమీ చేబదుళ్లు సిరిసిరిమువ్వా!’ వేమన పద్యాలకైతే పేరడీలు కొల్లలుగా వచ్చాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రసిద్ధులే కాకుండా, కొందరు అజ్ఞాత కవులు కూడా వేమన పద్యాలకు చమత్కారభరితమైన పేరడీలు రాశారు. వేమన పద్యాలకు కొన్ని ఆధునిక పేరడీలు చూడండి... ‘కల్లు సారా బ్రాండి కడుపార త్రాగరా జంకు గొంకు లేక పొంకముగను ఏది దొరకనపుడు ఎండ్రిను ద్రాగరా విశ్వదాభిరామ! వినుర వేమ! ‘గంగిగోవు పాలు గంటెడే చాలునా కడివెడేడ దొరుకు ఖరముపాలు భక్తి కలుగు కూడు పట్టెడే చాలునా విశ్వదాభిరామ! వినుర వేమ!’ ఈ రెండూ వేమన పద్యాలకు అజ్ఞాత కవుల పేరడీలు. వేమనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరడీ మచ్చుకొకటి... ‘వేదవిద్య నాటి వెలుగెల్ల నశియించె గారె బూరె పప్పుచారె మిగిలె బుర్ర కరిగి బొర్రగా మారెరా విశ్వదాభిరామ వినురవేమ’ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక అజ్ఞాతకవి నీచుల రాజ్యం వచ్చినందుకు బాధపడుతూ వ్యంగ్యంగా చెప్పిన ఈ పద్యాలు నవ్వులు పూయించక మానదు... దాదాపు ఉర్దూలోనే రాసిన ఈ పద్య సంభాషణనుు చూడండి... ‘లుచ్ఛా జమాన ఆయా అచ్ఛోంకో హాథ్ దేన హర్ ఏక్ సీకా అచ్ఛా జమాన ఫిర్ కబ్ వచ్చేనా చెప్పవయ్య వల్లీసాబూ!’ (నీచుల రాజ్యం వచ్చింది. మంచివాళ్లకు చెయ్యిచ్చే పద్ధతిని ప్రతివాడూ నేర్చాడు. మళ్లీ మంచికాలం ఎప్పుడొస్తుందోయ్ వలీ సాహెబు) అని అడిగితే, ‘బందేనవాజ్ బుజురుగ్ జిందాహై ఆజ్తో న జీతే హం ఖుదా బందాహి జానె వహసబ్ గందరగోళం జమాన ఖాజాసాబూ! (చేసిన మంచి పనుల వల్ల దేశసేవకులు, పుణ్యపురుషులు అలా ఉన్నారు. మనం అలా జీవించలేం. ఇప్పటికీ భగవద్భక్తుడు సేవకుడే ఈ విషయాలను తెలుసుకోవాలి. అయినా ఖాజా సాహెబూ! ఇప్పుడంతా గందరగోళం కాలం వచ్చింది కదా) అని బదులిచ్చాడు. తెలుగు కవిత్వంలో ఇలాంటి చమత్కారాలు కోకొల్లలు. ఆధునిక కవులలో వికటకవులుగా, హాస్యకవులుగా పేరుపొందిన వారు మాత్రమే కాదు, సంప్రదాయకవులుగా, భావకవులుగా, విప్లవకవులుగా ముద్రపడినవారు సైతం తమ కవిత్వంలో చమత్కారాలూ మిరియాలూ తగుపాళ్లలో నూరారు. స్థలాభావం కారణంగా ఇక్కడ ప్రస్తావించలేకపోయిన కవులలో కూడా ఎందరో మరెందరో పాఠకులకు చవులూరించే కవితలు చెప్పి భళాభళి అనిపించారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా అందుకోండి ఈ కవనవ్వుల నజరానాలు. ఆధునిక చాటువులు స్వతంత్ర కావ్యాలు రచించి ప్రసిద్ధులైన ఆధునిక కవులు కొన్ని సందర్భాలలో హాస్యరసభరితమైన చమత్కార చాటువులు చెప్పారు. వాటిలో కొన్ని... ‘శివతాండవం’తో ప్రసిద్ధులైన పుట్టపర్తి నారాయణాచార్యులు శ్రీనాథుడికి తీసిపోని రీతిలో చెప్పిన చిలిపి చాటువుల్లో మచ్చుకొకటి... ‘గజగమన గాదు ఇయ్యది గజసదృశ శరీర సీటు కంతయు తానై అజగరమై కూర్చున్నది గజిబిజిౖయె పోయె మనసు కన్నులు గూడన్’ ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి స్వతంత్ర కావ్యాల్లో హాస్యం తక్కువగానే ఉన్నా, ఆయన సందర్భోచితంగా సంధించిన చమత్కార చాటువులు లేకపోలేదు. ఆయన చెప్పిన ఒక చమత్కార పద్యం... ‘చదువురాని వేళ ‘చంకరుండ’న్నాడు చదువుకొనెడి వేళ ‘సంకరుండ’నె చదువు ముదిరిపోయి షంకరుండనెనయా స్నిగ్ధ మధురహాస! శ్రీనివాస! మిశ్రభాషా కవనవినోదం ఆధునిక కవుల్లో ఇంగ్లిషు, ఉర్దూ భాషలను తెలుగుతో కలగలిపి మిశ్రభాషా కవిత్వం చెప్పి నవ్వులు పూయించిన వారు ఉన్నారు. బ్రిటిష్ పాలనలోని ఆంధ్ర ప్రాంతంలోని కవులు తెలుగు పద్యాల్లో యథేచ్ఛగా ఇంగ్లిషును వాడుకుంటే, నిజాం పాలనలోని తెలంగాణ ప్రాంత కవులు తమ ఉర్దూ పాటవాన్ని ప్రదర్శించారు. మిశ్రభాషా కవనవినోదానికి కొన్ని ఉదాహరణలు... సామాజిక దురాచారాలను నిరసిస్తూ్త నాటకాలు రాసిన ప్రముఖులలో కాళ్లకూరి నారాయణరావు ఒకరు. మధుపానాసక్తత మితిమీరిన ఆధునిక జీవనశైలిని వెటకరిస్తూ ‘మధుసేవ’ నాటకంలో ఆయన హాస్యస్ఫూర్తికి ఉదాహరణగా నిలిచే పద్యం... ‘మార్నింగు కాగానె మంచము లీవింగు మొఖము వాషింగు చక్కగ సిటింగు కార్కు రిమూవింగు గ్లాసులు ఫిల్లింగు గడగడ డ్రింకింగు గ్లాసులు గ్రంబులింగు భార్యతో ఫైటింగు బయటకు మార్చింగు క్లబ్బును రీచింగు గాంబులింగు విత్తము లూసింగు చిత్తము రేవింగు వెంటనే డ్రింకింగు వేవరింగు మరల మరల రిపీటింగు మట్టరింగు బసకు స్టార్టింగు జేబులు ప్లండరింగు దారిపొడుగున డాన్సింగు థండరింగు సారె సారెకు రోలింగు స్రంబలింగు’ నవ్వులను విశ్లేషించి వివరించిన హాస్యరచయిత భమిడిపాటి కామేశ్వరరావు కూడా తెలుగులో ఇంగ్లిషును రంగరించి... ‘ది స్కై ఈజ్ మబ్బీ... ది రోడ్ ఈజ్ దుమ్మీ మై హెడ్ ఈజ్ దిమ్మీ...’ అంటూ కవిత చెప్పారు. -
కరోనాపై గెలుపు తథ్యం
భారత్‌లో ఉత్పత్తి చేసిన టీకాలతో కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మక విజయం సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనాపై భారత్ స్పందన ఆత్మవిశ్వాసం, స్వావలంబనతో కూడుకొని ఉన్నదని, ఇంతటి భారీ స్థాయి వ్యాక్సినేషన్ ప్రపంచం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌పై పోరాటంలో ఎంతోమంది యోధులు తమ జీవితాలను త్యాగం చేశారని, ఇంటికి తిరిగి వెళ్లకుండా విధి నిర్వహణలోనే విగత జీవులయ్యారని గుర్తుచేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. సొంత లాభం మానుకొని పొరుగు వారికి సేవ చేయాలని పిలుపునిస్తూ మహాకవి గురజాడ అప్పారావు రాసిన ‘దేశమును ప్రేమించుమన్న..’ అనే దేశభక్తి గీతంలోని కొన్ని పంక్తులను ప్రస్తావించారు. ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... – సాక్షి, న్యూఢిల్లీ దవాయి బీ.. కడాయి బీ టీకా రెండు డోసులు తీసుకోవడం అత్యంత కీలకం. టీకా తీసుకున్న తర్వాత కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. దవాయి బీ.. కడాయి బీ(టీకాతోపాటు జాగ్రత్తలు పాటించడం) అనే మంత్రం శిరోధార్యం. కరోనా వైరస్ ఎంతోమంది జీవితాలను అస్తవ్యస్తం చేసింది. కరోనా బాధితులు ఇళ్లలో, ఆసుపత్రుల్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే తల్లులు.. పెద్దలు ఆసుపత్రుల్లో ఉంటే వారి పిల్లలు దగ్గరుండి చూసుకోలేక తీవ్ర మానసిక క్షోభ అనుభవించారు. ఈ వైరస్ వల్ల మృతి చెందిన వారు సంప్రదాయబద్ధమైన అంతిమ సంస్కారాలకు సైతం నోచుకోలేకపోయారు. కరోనాపై పోరాటంలో ఎందరో ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు తమ జీవితాలను త్యాగం చేశారు. కరోనా బాధితులకు సేవలందిస్తూ వైరస్ సోకి వందలాది మంది విగత జీవులయ్యారు. పనితీరు, భద్రతపై నమ్మకం కుదిరాకే.. కరోనా వైరస్‌ను తుదముట్టించేందుకు జరిగిన పోరాటంలో దేశ ప్రజలంతా ఇప్పటిదాకా ఎంతో సహనం ప్రదర్శించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ అదే సహనం కొనసాగించాలి. సాధారణంగా ఒక కొత్త టీకాను అభివృద్ధి చేయాలంటే చాలా ఏళ్ల సమయం పడుతుంది. అలాంటిది మన దేశంలో అతి తక్కువ సమయంలోనే రెండు కరోనా టీకాలు అందుబాటులోకి రావడం గర్వకారణం. మన శాస్త్రవేత్తల శ్రమ, నైపుణ్యం వల్లే ఇది సాధ్యమయ్యింది. మరికొన్ని టీకాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మానవతా దృక్పథానికే పెద్దపీట వేస్తున్నాం. కరోనాకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నవారికే తొలి ప్రాధాన్యం దక్కుతుంది. దేశంలో తయారైన కరోనా టీకాల పనితీరు, భద్రతపై శాస్త్రవేత్తలకు, నిపుణులకు పూర్తి నమ్మకం కుదిరాకే అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపారు. ఈ విషయంలో కుట్ర సిద్ధాంతాలు, అసత్య ప్రచారం, పుకార్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు నమ్మొద్దు. ఫ్రంట్‌లైన్ యోధుల రుణం తీర్చుకుంటున్నాం కరోనాపై దేశ ప్రజలు అసమాన ధైర్యసాహసాలతో పోరాటం సాగించారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అంబులెన్సు డ్రైవర్లు, ఆశ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఇతర ఫ్రంట్‌లైన్ సిబ్బంది ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వీరిలో కోందరు తమ ఇంటికి తిరిగి వెళ్లలేదు. కరోనాపై పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలిచిన ఈ యోధులు ఇవాళ నిరాశ, భయపూరిత వాతావరణాన్ని దూరం చేశారు. రుణం తీర్చుకోవడానికి, దేశ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేయడానికే హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ యోధులకు తొలుత కరోనా వ్యాక్సిన్ అందజేస్తున్నాం. రెండో దశలో 30 కోట్ల మందికి టీకా టీకా రెండు డోసుల మధ్య నెల రోజుల వ్యవధి ఉంటుంది. రెండో డోస్ తీసుకున్న రెండు వారాల అనంతరం మానవ శరీరం కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని సంతరించుకుంటుంది. తొలి దశలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేస్తాం. ఇది ప్రపంచంలో దాదాపు 100 దేశాల జనాభా కంటే ఎక్కువ. రెండో దశలో 30 కోట్ల మందికి టీకా అందుతుంది. రెండో దశలో వయోధికులకు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి టీకా ఇస్తాం. 30 కోట్ల కంటే అధిక జనాభా కలిగిన దేశాలు ఇండియా, అమెరికా, చైనా మాత్రమే. భారతదేశ శాస్త్రవేత్తలు, వైద్య విధానాలు, ప్రక్రియలు, వ్యవస్థాగత యంత్రాంగం వంటివి అంతర్జాతీయంగా విశ్వసనీయత పొందాయి. ఈ విశ్వసనీయతను మన స్థిరమైన ట్రాక్ రికార్డ్‌తో సంపాదించుకున్నాం. ఆరోగ్యంగా ఉండాలి.. ‘భారతదేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది, ఇది గర్వకారణమైన రోజు. ఇది మన శాస్త్రవేత్తలు, కష్టపడి పనిచేసే మన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికుల శక్తి సామర్థ్యాలను కొనియాడుతూ ఉత్సవం జరుపుకొనే సందర్భం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి’ అని ఆకాంక్షిస్తూ మోదీ శనివారం ట్వీట్ చేశారు. ప్రపంచం గుర్తించింది మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఆదుకున్నాం. ప్రపంచంలోని చాలా దేశాలు చైనాలో చిక్కుకున్న తమ ప్రజలను అక్కడే వదిలేశాయి. మనం భారతీయులను మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రజలను సైతం అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొచ్చాం. తమ దేశం నుంచి వెనక్కి పంపించే భారతీయులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కష్టంగా ఉందని భావించిన దేశానికి మనం ఒక ప్రయోగశాలనే తరలించాం. కోవిడ్–19 మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశ ప్రతిస్పందనను ప్రపంచం గుర్తించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక సంస్థలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే లభించే ఫలితానికి ఇదొక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. ఆ సవాలులో ప్రజలు ఉత్తీర్ణులయ్యారు కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో భారతదేశం సకాలంలో అప్రమత్తమయ్యింది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంది. దేశంలో తొలి పాజిటివ్ కేసును గుర్తించిన 2020 జనవరి 30వ తేదీకి రెండు వారాల ముందే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశాం. ఇప్పటికి ఏడాది ముందే నిఘా ప్రారంభించాం. 2020 జనవరి 17న తొలి మార్గదర్శకాలు జారీ చేశాం. విమానాశ్రయాల్లో ప్రయాణికులను తనిఖీ చేసిన తొలిదేశాల్లో ఇండియా కూడా ఉంది. జనతా కర్ఫ్యూ సమయంలో క్రమశిక్షణ, సహనానికి సంబంధించిన సవాలులో ప్రజలు ఉత్తీర్ణులయ్యారు. ఇది ప్రజలను లాక్‌డౌన్‌కు మానసికంగా సిద్ధం చేసింది. దీపాలు వెలిగించడం, ఫ్రంట్‌లైన్ యోధులకు మద్దతుగా చప్పట్లు కొట్టడం వంటివి దేశ ప్రజల మనోధైర్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. శనివారం ఢిల్లీలో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమక్షంలో తొలి టీకాను పారిశుద్ధ్య కార్మికుడు మనీశ్‌కు ఇస్తున్న దృశ్యం ఢిల్లీలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్‌కు టీకా ఇస్తున్న దృశ్యం ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియాకు టీకా వేస్తున్న సిబ్బంది ముంబైలో నేవీ అధికారిణి షీలా మథాయ్‌కు టీకా వేస్తున్న వైద్య సిబ్బంది -
సాహితీ రంగులు
ఈ వ్యాసాలలో విషయం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది తాను చదివిన కొన్ని రచనలలో తాను గ్రహించిన విశేషాలను పాఠకులకు అర్థమయ్యే విధంగా చెప్పటం. రెండవది జ్ఞాపకాల పుటలలో నుంచి విలువైన వాటిని సేకరించి, మనతో పంచుకోవటం. ఇందులో ఏది చెయ్యాలన్నా ముందుగా కావలసినది సహృదయం, తన పరిసరాల మీద మమకారం, తన పరిచయాల పట్ల గౌరవం, తనను ఆకర్షించిన పాత్రల మీద అవ్యాజమైన ప్రేమ. తులసిగారిలో ఇవన్నీ సమపాళ్లలో సమృద్ధిగా ఉన్నాయని ఈ వ్యాసాలు చదవటం మొదలుపెట్టగానే గ్రహిస్తాం. పూర్ణమ్మ గేయానికి చేసిన వ్యాఖ్య ఎంతో అర్థవంతంగా ఉంది. పూర్ణమ్మ మనసును గురజాడ ఎంత బాగా అర్థం చేసుకున్నాడో, అంత బాగాను గురజాడ మనసును తులసి గారు అర్థం చేసుకున్నారనిపిస్తుంది. ‘‘నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొకపరి తలవండి’’ అనటం, ‘‘దీవెన వింటూ ఫక్కున నవ్వటం’’– ఇవన్నీ పూర్ణమ్మ తీసుకున్న అంతిమ నిర్ణయాన్ని సూచించే సంకేతాలని తులసిగారు వివరిస్తారు. ఆమె కవితాహృదయం రావిశాస్త్రి కథల గురించి, చాసో మాస్టర్ ఆర్ట్ గురించి, పతంజలి రచనా ప్రస్థానం గురించి రాసిన వ్యాసాల్లో స్పష్టంగా వ్యక్తమౌతోంది. ‘జీవితంలోంచి చాసో సిద్ధాంతాన్ని చూసాడు, సిద్ధాంతంలోంచి రావిశాస్త్రి జీవితాన్ని చూసాడు, వీటిలో ఉన్న తేడా పతంజలి చూపుకు ఆనిం’దని చెప్పటం పతంజలి రచనలకి లోతైన వ్యాఖ్యానంగా నాకు తోస్తుంది. గురజాడ సమకాలీన భారతీయ రచయితల గురించి రాసిన వ్యాసం ఎంతో విలువైన చారిత్రక సమాచారాన్ని ఇస్తుంది. పలు అనువాదాలు చేసిన రచయిత్రిగా ఇరుగు పొరుగు భాషల నుంచి వస్తున్న అనువాద రచనల్లోని లోటుపాట్లను గురించి అర్థవంతమైన చర్చ చేశారు. రచయిత్రులకు సహజమైన, సమర్థనీయమైన స్త్రీ పక్షపాతం ఈ వ్యాసాలలో కనిపిస్తుంది. అమృతా ప్రీతమ్, కుర్రతుల్ ఇన్ హైదర్, ఆశాపూర్ణాదేవి, మహాదేవి వర్మ, కె.రామలక్ష్మి వంటి వారితోపాటు, ఒడియా సాహిత్యంలో స్త్రీవాద రచయిత్రుల రచనల గూర్చిన చర్చ ఇక్కడ చూడవచ్చు. చాసో, నారాయణబాబు, రోణంకి, పురిపండా, ఆరుద్ర, శ్రీశ్రీ, ఉప్పల లక్ష్మణరావు మొదలైనవారి ముఖచిత్రాలను, హావభావాలను, దైనందిన జీవితంలో వారు మసలిన విధానాన్ని వారి గురించి ప్రస్తావించిన పలు వ్యాసాలు కళ్లకు కట్టినట్టుగా వివరిస్తాయి. మౌలికంగా మార్క్సిస్టు భావజాలంతో ముడిపడిన అభ్యుదయ మార్గానికి చెందిన తులసిగారి అన్ని అభిప్రాయాలతో నాకు నూరు శాతం ఏకీభావం ఉందని చెప్పలేను. ఐతే, వ్యాసాలను చదవటానికి, అభిమానించటానికి అది అవరోధం కాదు. కారా మాష్టారి ‘హింస’ కథలో మూడు ప్రధాన పాత్రలూ వైఫల్యం చెందటం వల్ల ప్రయోజనం దిశగా కథ ముగియలేదని ఆవిడ అభిప్రాయపడటం అర్థం చేసుకోవచ్చు. కానీ మానవ వైఫల్యం కూడా జీవితంలో భాగమే. ఆ విధంగా ఏర్పడిన పరిస్థితులను, వాటి అనివార్యతను చిత్రించటంలోనే సహజత్వం సిద్ధిస్తుంది. కేవలం కథా ప్రయోజనం కోసం దానిని మార్చినంత మాత్రాన ఒనగూరేదేమీ ఉండదు. -విన్నకోట రవిశంకర్ -
గిడుగును ఆడుకున్న పిడుగు
గురజాడ అప్పారావు తెలివిగా ఓటమిని కూడా గెలుపుగా కన్పించేట్టు చేసేవారు. గురజాడ, గిడుగు రామ్మూర్తి పంతులు చిన్నతనం నుంచి మంచి స్నేహితులు, సహచరులు. గిడుగును ఏదో విధంగా ఆట పట్టించేవారు గురజాడ. ఒకరోజు గురజాడ, గిడుగు చెరువు కట్టమీదకు షికారుకు వెళ్లారు. అప్పుడు గురజాడ తాను ‘మేఘ మల్హర’ రాగమాలాపించి వర్షం కురిపిస్తానని పందెం కాశారు. అది వర్షాకాలం కావడాన, అంతకుముందే దట్టంగా మబ్బులు పట్టివుండటాన, గొంతు సవరించుకుంటుండగానే చినుకులు మొదలయ్యాయి. అది తనకే అమితాశ్చర్యాన్ని కలిగించింది. తాను తాన్సేన్ అంతటివాడినని పొంగిపోయారు. అయితే ఇంకో రోజు మాత్రం యీ మంత్రం పారలేదు. గురజాడ ఎంత పాడినా మబ్బులు తన పాటను ఆలకించలేదు. అయినా గిడుగుకు టోకరా ఇవ్వడం ఎలా? ఎవరో తనకంటే గొప్ప సంగీత విద్వాంసుడు యెక్కడో బిగ్గరగా మేఘ రంజని రాగం ఆలాపిస్తుండటం వల్ల మేఘాలు అటువైపు పరుగెత్తుతున్నాయని బుకాయించారు. - అయినాల కనకరత్నాచారి -
మూలాల్ని ఛేదించటమే ‘మీటూ’
స్వార్థ ప్రయోజన పునాదులపైన ఆదినుంచీ బలుస్తూ వచ్చిన ఫ్యూడల్, పెట్టుబడిదారీ సమాజాలకు ‘సిజేరియన్ ఆపరేషన్’ జరక్కుండా సమాజాన్ని, సామాజిక పరిస్థితుల్ని మార్చలేం. ఆ శస్త్ర చికిత్స ఈ వ్యవస్థకు జరగనందునే నైతిక బలహీనతలు ముదిరిపోయి– అవి జర్నలిస్టులకు, నటులకు, సినీ దర్శకులకు, కవులకు, రచయితలకు, కళాకారులకు, సంగీత కళాకారులకు కార్పొరేట్ భద్ర పురుషులకు, పార్లమెంటేరియన్లకు, సైనిక పోలీస్ శాఖలకు, పాలకులకు– ఒకరేమిటి సమాజాన్ని శాసించే సర్వ శాఖలకూ వ్యాపించి, కానరాని కీచక పర్వాలు తెరచుకుంటున్నాయి. అందుకే మూలాన్ని ఛేదించడమే మీటూ ఉద్యమ కర్తవ్యం కావాలి. ‘స్త్రీలు పనిచేస్తున్న సంస్థల్లో కేవలం స్త్రీల పట్ల జరిగే వేధింపుల పరిష్కారానికి మాత్రమే 1997లో న్యాయస్థానం విశాఖ ఆదేశిక సూత్రాల (గైడ్‌లైన్స్)ను రూపొందించింది. కానీ గతం నుంచీ స్త్రీల పట్ల జరుగుతున్న వేధింపుల, అత్యాచారాల పరిష్కారానికి కూడా నేడు విశాఖ గైడ్‌లైన్స్ వర్తింపచేయాల్సిన అవసరముంది’’ – జస్టిస్ (రిటైర్డ్) సుజాత మనోహర్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫ్రీ ప్రెస్ జర్నల్ ఇంటర్వ్యూ ‘నేటి తీవ్రమైన పోటీ ప్రపంచంలో మానవుల విజయానికి ప్రజల గుర్తింపు అనే ముద్రను ఒక ఆరాధ్యమంత్రంగా భావించడం జరుగు తోంది. కానీ ఈ విజయభావన చాటున జరుగుతున్నది సామాజిక అన్యా యాల పట్ల సామాజికులు నోరెత్తకుండా చేయడమే! ఇలాంటి తప్పుడు పవిత్ర భావనను సృష్టించడానికి పితృస్వామిక వ్యవస్థ తన శక్తియుక్తుల్ని ఇప్పటికే చాలా వెచ్చించింది. కానీ ఈ వ్యవస్థ తనకు తాను అద్దంలో చూసుకుంటే దాని వికృతాకారం బయటపడుతుంది. సామాజిక ఔన్నత్యం పేరిట విర్రవీగే దాని డాబు దర్పాలన్నీ నేడు ‘నేను (మేము) సైతం’’ అని ఆత్మరక్షణార్థం విరుచుకు పడుతున్న మహిళా ఉద్యమం ముందు డుల్లి పోతాయి. అది కదలబారుతున్న లక్షలాదిమంది బాధాతప్తుల çహృదయ స్పందన అని గుర్తించాలి’ – మిస్ ఫరా నక్వీ, ప్రసిద్ధ మీడియా రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఢిల్లీ ఇప్పటికీ సమాజంపై పెత్తనం చలాయిస్తున్న పితృస్వామిక వ్యవస్థ అనాదిగానే తన ఉనికికోసం, స్త్రీ పరంగానూ, పురుషుడి పరంగానూ కొన్ని సామెతలను సమాజం మీదికి వదిలి కూర్చుంది. ఆడదాని బతుకు అరిటాకు బతుకుగా చిత్రించి ఆమెను అనాథగా మార్చింది. స్త్రీ మాట ఆపదలకు మూలమని చెప్పి నోరు నొక్కింది. కానీ అదే వ్యవస్థ తాను మాత్రం మారకుండా ఉత్తరోత్తరా రానున్న పరిణామాలను ఊహించు కుని బహుశా దోపిడీ సమాజంలో స్త్రీకి ఒక ‘రాయితీ’గా ఆడదాన్ని నోరు పెట్టుకుని బతకమనడంలో కూడా బోలెడంత అర్థముండి ఉండాలి. అందుకే అన్ని రకాల దాష్టీకాలకు చరమాంకాన్ని రచించేందుకు ఇపుడు ‘నేను (మేము) సైతం’ (మీటూ–ఉయ్ టూ) అంటూ ప్రపంచ మహిళా ఉద్యమ ఉ«ధృతిలో భాగంగా మన దేశంలో కూడా పితృస్వామిక వ్యవస్థ ఆగడాలకు భరతవాక్యం చెప్పే వైపుగా ఉద్యమిస్తోంది. నిజానికి ఈ మహోద్యమ పునాదులు ఈనాటివి కావు. ఒక వైపునుంచి తెలుగునాట వీరేశలింగం, గురజాడ, చిలకమర్తి, గిడుగు... మరోవైపునుంచి రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, జ్యోతిబాయి పూలే, గాంధీజీలు సామాజిక అసమానతలకు, స్త్రీ పురుషుల మధ్య వివక్షతకు వ్యతిరేకంగా సంస్కరణోద్యమాలు నిర్వహించారు. అయినా ఫలితం నేటికీ పాక్షికంగానే ఉండిపోయింది. నిజానికి నిర్భయ హత్యోదంతం తర్వాత కూడా వేధింపులకు నిస్సిగ్గుగా పాల్పడిన వారిలో కొందరికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా గత దశాబ్దిన్నర కాలం లోనూ దేశంలో ‘రేప్’ కేసులు అదుపులోకి రాకపోవడం చూస్తుంటే పితృస్వామిక, పెట్టుబడిదారీ వ్యవస్థల్లో మౌలికంగా ఏ పరివర్తనా రాలేదు. కనీసం అందుకు జరిగిన ప్రయత్నమూ చిత్తశుద్ధితో జరగలేదు. ఒకనాటి జార సమాజం అనుకున్న రాజుల, చక్రవర్తుల కాలంలోనే ఆ సమాజాన్ని సరిదిద్దడం కోసం శృంగారానికి సంబంధించిన కథల ద్వారా ప్రజల్ని జ్ఞానవంతుల్ని చేసే యత్నంలో అన్యాపదేశంగా 17–18 శతాబ్దాలలోనే ‘హంసవింశతి’లో అయ్యలరాజు నారాయణామా త్యుడు, ‘శుకసప్తతి’ కథల ద్వారా పాలవేకరి కదిరీపతి పండితుడూ గొప్ప నీతిని బోధించారు. ఒక మంచివాడున్న చోట ఒక దుష్టుడూ ఉంటాడన్న సూక్తి ఫ్యూడల్ వ్యవస్థలోనూ, పెట్టుబడి సమాజంలోనూ అనివార్యం. చెడును చూపడం ద్వారా మంచిని వ్యవస్థాపించడానికి ప్రయత్నించడం ప్రజాహితమైన కావ్యసృష్టి నాటక కళా రంగాలకు ధ్యేయంగా ఉండాలనీ, తద్వారా జన సామాన్యంలో మానసికంగా ఔన్న త్యానికి దారులు పరచాలనీ నిరూపించిన స్త్రీ, పురుష రచయితలు నేటికీ లేకపోలేదు. అయితే తమ స్వార్థ ప్రయోజన పునాదులపైన ఆదినుంచీ బలుస్తూ వచ్చిన ఫ్యూడల్, పెట్టుబడిదారీ సమాజాలకు ‘సిజేరియన్ ఆపరేషన్’ జరక్కుండా, సామాజిక పరిస్థితుల్ని మార్చలేం. అందుకే గురజాడవారి ‘కన్యాశుల్కం’లో గిరీశం ‘అటునుంచి నరుక్కురమ్మని’ చెప్పింది. ఆ శస్త్ర చికిత్స ఈ వ్యవస్థకు జరగనందునే నైతిక బలహీనతలు ముదిరిపోయి– అవి జర్నలిస్టులకు, నటులకు, సినీ దర్శకులకు, కవు లకు, రచయితలకు, కళాకారులకు, సంగీత కళాకారులకు కార్పొరేట్ భద్ర పురుషులకు, పార్లమెంటేరియన్లకు, సైనిక పోలీస్ శాఖలకు, పాల కులకు– ఒకరేమిటి సమాజాన్ని శాసించే సర్వ శాఖలకూ వ్యాపించి, కాన రాని కీచక పర్వాలు తెరచుకుంటున్నాయి. మనం ప్రేమించే పాండవుల్ని సహితం ఈ జాఢ్యం పీడించింది. కాబట్టే వ్యాస భారతం సహితం ‘పాండవాంః జారజాతాః’ అని పేర్కొనవలసి వచ్చింది. చెప్పుకుంటూ పోతే చాలా ‘చిత్రమైన’ చరిత్రలు మనలోనే గూడుకట్టుకుని ఉన్నాయి. ఈ వేధింపుల, అత్యాచారాల జాఢ్యం ఒక్క యువతులపట్లనే కాదు, వివాహిత స్త్రీలనూ వదలడం లేదు. దేశంలోని వివాహిత మహి ళలలో నూటికి 80 మంది తమ భర్తల నుంచే గృహ హింసను ఎదు ర్కొంటున్నారని ఒక తాజా సర్వే పేర్కొనగా, 27 శాతంమంది అవి వాహిత స్త్రీలు సొంత బంధువులనుంచీ, 18 శాతం మంది స్త్రీలు మగ కుర్రకారు స్నేహితుల నుంచీ, 17 శాతం స్త్రీలు పరిచయస్తులనుంచీ వేధింపులు ఎదుర్కొంటున్నారని సర్వేలో బయటపడింది. కాగా, 99.1 శాతం మహిళలు లైంగిక వేధింపులకు గురైనా, ఆ కేసులు అసలు రిపోర్టు కాకుండానే కనుమరుగు చేశారని ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’ తాజాగా వివరాలు నమోదు చేసింది. ఈ సందర్భంగా అన్నింటికన్నా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురయ్యే వ్యక్తులపైగాని, వేధింపు లకు పాల్పడే వ్యక్తులపైగానీ మానవుల మెదడులోని ‘హార్మోన్లు’ కల్గించే ప్రభావం గురించి శాస్త్రవేత్త టాటా ఇనిస్టిట్యూట్ సోషల్ సైన్సెస్ విభాగంలో పరిశోధకురాలు, మనస్తత్వ శాస్త్రవేత్త అయిన ప్రసిద్ధ ప్రొఫె సర్ శ్రీమతి ప్రాచీ యాదవ్ కొన్ని విషయాలను వెల్లడించారు: ‘‘లైంగిక వేధింపునకు లేదా అత్యాచారానికి పాల్పడేవారు వ్యక్తి జాఢ్య ఉన్మాదులు. ఈ జాఢ్యం ఉన్న ప్రతివ్యక్తి అనుభవం వేర్వేరుగా ఉంటుంది. కానీ ఇందుకు లోనయ్యే బాధితురాళ్లు మాత్రం దుర్భలులై పోయి, నిస్త్రాణమైపోతారు. ఈ దారుణానుభవం బాధితుల జీవితం లోని ప్రతి ఒక్క దశల్లోనూ వెన్నాడుతూనే ఉంటుంది. మహిళల మనస్సుపై పడే ఈ హింస/గాయం– జీవిత భాగస్వామి లేదా తెలిసిన వ్యక్తినుంచో లేదా కుటుంబ సభ్యులనుంచో, స్నేహితుల నుంచో, పని చేసేచోటనో లేదా వీధిలో వెంటాడుతున్నప్పుడో, అసలు ఏ మాత్రం పరి చయం లేని వ్యక్తులనుంచో ఎదురుకావచ్చు. చివరికి చిన్నారులైన ఆడ పిల్లలూ ఈ హింసకు గురికావచ్చు. ఈ లైంగిక దాడులకు ప్రధాన కారణం మనిషి మెదడు పనిచేసే ప్రక్రియల్లోనే ఉంది. ఈ దారుణ ఘటనలకు మనిషి శరీర భాగాల్లోని హార్మోన్లు వెంటనే ప్రతిస్పంది స్తాయి. లైంగిక ప్రమాదానికి గురైన స్త్రీ అప్పుడు తాను ఎదురు తిరిగి పోరాడటమా లేక హింస బారినుంచి తప్పించుకుని పారిపోవడమా అని ఆ క్షణంలోనే తేల్చుకుంటుంది. ఈ నిర్ణయ శక్తిని నిర్ణయించేది ఆమె మెదడులోని ‘కాటెకోలమైన్’ హార్మోన్. అలాగే ‘కోర్టిసోల్’ అనే హార్మోను ఎదురు తిరగమని బాధితురాల్ని ప్రోత్సహించే నైతిక బలమిస్తుంది. ఇలా హింసకు గురికాబోతున్న సమయంలో ఆ వ్యక్తి భౌతికంగా, ఉద్రే కంగా అనుభవించే బాధను తట్టుకునేందుకు ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ వేదనలో ఉన్న స్త్రీ/పురుషులు హేతుబద్ధంగా వ్యవహరించే శక్తిని తాత్కా లికంగా కోల్పోతారు. మొత్తం శరీరమే స్తంభించిపోతుంద’’ని ప్రొఫెసర్ ప్రాచీ వివరించారు (డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్). ఈ వైపుగా కూడా ఆలోచించి, పరిశీలించి దేశంలోని సామాజిక కార్యకర్తలు, మహిళా ఉద్యమకారులు అధ్యయనం చేసి ఉన్న పరిస్థితు లతో రాజీ పడకుండానే మహిళా ఉద్యమానికి మరింతగా శక్తియుక్తుల్ని పొందుపరిచి అవిశ్రాంత పోరును ఉధృతం చేస్తేగానీ పితృస్వామ్య– పెట్టుబడి వ్యవస్థలు ఈ మాత్రమైనా అంకెకు రావని గుర్తించాలి. శరీర సౌందర్యంకన్నా బుద్ధి బలానికి ప్రాధాన్యత కల్పించిన ప్రాచీన హంస– చిలక కథల్ని మరొకసారి చదివి, నేటి యువతీ యువకులు సన్మార్గ స్ఫూర్తిని పొందడం అవశ్యం. అందుకనే మహాకవి గురజాడ వందేళ్ల క్రితమే ‘స్త్రీల కన్నీటి గాథ లకు కారణం నాకు తెలుసు. వారికి వకాల్తా పట్టడానికే నేను నిర్ణయిం చుకున్నాను’ అన్నాడు. కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర ద్వారా ఒక బరువైన మాటను, తప్పును సవరించుకునే లోచనా శక్తినీ, ఆలోచనా శక్తినీ తనను ప్రలోభ పెట్టబోయిన సౌజన్యారావుకు కల్పిస్తూ ఒక నీతిని ప్రబోధించిన తీరు కూడా ‘నభూతో నభవిష్యత్’. ‘చెడని వారిని చెడ గొట్టవద్దని చెప్పింది మా అమ్మ’ అన్న అంత బరువైన సందేశాన్ని ఆమె ద్వారా గురజాడ ఎందుకు సమాజానికి అందించాడు? ఇంతకూ స్త్రీ తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఎందుకు తహతహలాడుతుందో గుర జాడ, చలం తమ గుండె గొంతుకల్ని ఇలా విప్పారు: ‘‘ప్రేమలేక, సంతో షం లేక జీవితంలో ఇంటరెస్టు కోల్పోయి, తను ఏ బాధపడ్డా కరుణించే వారు లేక, ఇంక విధిలేక బండచాకిరీలో తన శక్తినీ, ద్వేషంలో తన ప్రేమనీ, తిట్లలో తన ఆనందాన్ని సార్థకం చేసుకోవాలనే ప్రయత్నిస్తుంది స్త్రీ’’ ఆ ప్రయత్నానికి నేటి వైజయంతినే ‘మీటూ’ మహిళా ఉద్యమం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పాఠశాలల్లో ‘గురజాడ’ గీతాలాపన
శ్రీకాకుళం సిటీ: ‘దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న.. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్.. ఈ గేయం రాసింది ఆధునికాంధ్ర సాహిత్య కవి, ఆధునిక కవితా పితామహుడు గురజాడ అప్పారావు. దేశ భక్తిభావాన్ని విద్యార్థుల్లో మరింత పెంచేందుకు ఈ గేయాన్ని పాఠశాల స్థాయి నుంచే గీతాలాపన చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన మనవరాలు అరుణ గురజాడ పేర్కొన్నారు. అమెరికా టెక్సాక్స్లో నివాసముంటున్న ఈమె ఆదివారం సిక్కోలు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. క్షేత్రస్థాయిలోకి గురజాడ సిద్ధాంతాలు.. గురజాడ సంస్థల నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలోనూ పలుసేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నాం. గురజాడ ఆశయాలను, సిద్ధాంతాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలన్నదే మా ఉద్దేశం. దేశమును ప్రేమించుమన్న గేయం ద్వారా గురజాడ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. సమాజం అంటే మనం అనే పదం ఎక్కువగా ఉండాలి. దురదృష్టవశాత్తు ఇప్పుడా పదం కనిపించడం లేదు. నేను, నా కుటుంబసభ్యులు, నా సంసారం.. ఇలా అన్నింటిల్లోనూ నా.. అనే పదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తోటివారికి సాయపడాలి.. ప్రకృతి, సమాజాం ఎంతో ఇచ్చిందనే సంతృప్తితో తోటివారికి కొంత సాయపడాలి. ప్రతి ఒక్కరూ కనీసం ఒఒక రూపాయిని ఇతరులకు సాయం చేయడం ద్వారా భగవంతుడు వేరే విధంగా తిరిగి మళ్లీ అదే ధనాన్ని మనకి ఇస్తాడు. కార్యరూపం దాల్చని కన్యాశుల్కం–2 కన్యాశుల్కంలో గిరీశాన్ని, ఇతర పాత్రలను ఎలా మార్పుచేశారో అందరికి తెలిసిందే. కన్యాశుల్కం–2లో చాలా విషయాలను గురజాడ ప్రస్తావించి సమాజాన్ని చైతన్యపరుద్దామని భావించారు. దురదృష్టవశాత్తు ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. దేశాన్ని ప్రేమించుమన్న అనే గేయాన్ని మనదేశంతో పాటు ప్రపంచదేశాలను ఉద్దేశించి ముందుచూపుతోనే రచించారు. విజయనగరంలో సొంతింట్లో ప్రతిరోజు పిల్లలకు, పెద్దలకు వేర్వరుగా ఒక సభను ఏర్పాటుచేద్దామని భావించేవారు. స్థానికంగా కొన్ని పరిస్థితుల వల్ల ఆ కార్యక్రమాలు ముందుకు సాగలేదు. 20న గురజాడ కళావేదిక ప్రారంభం.. రాజమండ్రిలోని బిక్కవోలు సింగంపల్లిలో ఈ నెల 20న గురజాడ కళావేదికను ప్రారంభించనున్నాం. గత ఏడాది పిల్లల్లో సృజనాత్మక పెంపొందించేందుకు స్టడీసెంటర్, గ్రంథాలయాలను స్థాపించాం. ఐటీ వృత్తిలో సంపాదిస్తున్న మొత్తంలో కొంతభాగాన్ని గురజాడ సంస్థలకు ఖర్చుపెడుతూ ఆయన ఆశయసాధనకు కృషి చేస్తున్నాం. -
చంద్రబాబును వెంటాడిన సెంటిమెంట్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబును సెంటిమెంట్ భయం వెంటాడింది. దాంతో ఆయన తన షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. వివరాలిలా ఉన్నాయి. నిన్న (బుధవారం) విశాఖపట్నం పర్యటనలో భాగంగా సిరిపురం జంక్షన్లో రూ.10 కోట్లతో పునర్నిర్మించిన గురజాడ కళాక్షేత్రాన్ని చంద్రబాబు ప్రారంభించాల్సి ఉంది. విశాఖ చేరుకున్న ఆయన మొదట మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును ప్రారంభించారు. అనంతరం గురజాడ కళాక్షేత్రం వద్దకు చేరుకున్నారు. బయట ఉన్న గురజాడ అప్పారావు విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం కళాక్షేత్రం ప్రారంభ సూచకంగా లోపల ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. అయితే ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనకుండానే విమానానికి టైమ్ అయిపోతోందంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయన వెంట ఉన్న టీడీపీ నేతలు కొందరు.. ‘గురజాడ కళాక్షేత్రంలో సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలకు హాజరైన ప్రజాప్రతినిధులు పదవీచ్యుతులయ్యారు’ అని చంద్రబాబుకు చెప్పారని, ఈ కారణంగానే ముఖ్యమంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించకుండా వెళ్లిపోయారని అధికార వర్గాలు వెల్లడించాయి. సెంటిమెంట్‌కు భయపడే సీఎం లోపలికి వెళ్లి శిలాఫలకాన్ని ఆవిష్కరించలేదని పలువురు టీడీపీ నేతలు సైతం చర్చించుకోవడం కనిపించింది. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. -
విరిగి పెరిగితి పెరిగి విరిగితి కష్ట సుఖముల పారమెరిగితి
తన 53వ ఏటే కన్నుమూశారు గురజాడ అప్పారావు(21 సెప్టెంబర్ 1862 – 30 నవంబర్ 1915). ఆ స్వల్ప జీవితకాలంలోనే తెలుగు సాహిత్యానికి దీపధారిగా నిలిచారు. కన్యాశుల్కం నాటకంలో వాడుక భాషకు పట్టం కట్టారు. దిద్దుబాటు ద్వారా ఆధునిక కథాప్రక్రియకు కీలకమలుపుగా నిలిచారు. ‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’; ‘విరిగి పెరిగితి పెరిగి విరిగితి/ కష్ట సుఖముల పారమెరిగితి’ అంటూ తేలికమాటల్లో అనితరసాధ్య కవిత్వం వెల్లడించారు. ‘దేశభక్తి, ఆధునిక కవిత్వం, ప్రేమ, స్త్రీ చైతన్యం, సంఘ సంస్కరణ వంటి ఎన్నో ఉదాత్త వినూత్న భావాలను నిర్వచించి, నిర్వహించి వెళ్లిన కావ్యకర్త, కార్యకర్త’ గురజాడ అంటారు తెలకపల్లి రవి. గురజాడ జీవితాన్నీ సాహిత్యాన్నీ– యువకవిగా యుగకవి, గిరీశం పాత్ర–అపార్థాలు, ముత్యాల సరాలు! సత్యాల స్వరాలు, నైతిక విలువలపై వాస్తవిక దృక్పథం... ఇలా 17 అధ్యాయాలుగా విశ్లేషిస్తూ ఆయన ‘యుగస్వరం’ వెలువరించారు. ‘గురజాడ భావాలకూ, సంస్కరణలకూ ఇప్పుడు గతం కన్నా ప్రాధాన్యత పెరిగింది. అందుకు దేశంలో వచ్చిన రాజకీయ, సామాజిక దుష్పరిణామాలు కూడా ఒక కారణం. ప్రపంచీకరణలో భాగంగా మత, మార్కెట్ తత్వాలు విజృంభించిన నేపథ్యం ఇందుకు ప్రధాన భూమిక’ అంటూ అప్పటికి ఆధునికుడైన గురజాడ సాహిత్యానికి ఇప్పటి ఆధునిక కాలంలో ఉన్న ప్రాసంగికతను చర్చించారు. గురజాడ: యుగస్వరం; రచన: తెలకపల్లి రవి; పేజీలు: 208; వెల: 125; ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, 27–1–64, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ–520002. ఫోన్: 0866–2577533 -
కన్యాశుల్కం @125
-
గురజాడ సాహిత్యంలో వాస్తవాలు
విజయనగరం టౌన్: ప్రముఖ రచయిత గురజాడ అప్పారావు సాహిత్యంలో వాస్తవాలు ఉంటాయని కవయిత్రి బులుసు సరోజినీదేవి అన్నారు. బుధవారం స్థానిక ఆనంద గజపతి కళాక్షేత్రంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గురజాడ 101 వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఉదయం నిర్వహించిన ఈ వేడుకల్లో ముందుగా గురజాడ చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆధునిక మహిళకు గురజాడ మార్గదర్శి వంటి వారన్నారు. సమాజంలో మార్పు అనివార్యమని గురజాడ తన రచనల్లో వ్యక్తపరిచారని చెప్పారు. అలాగే కేవలం రచనల ద్వారానే మనిషిలో మార్పు తీసుకురావచ్చని తెలియజేసిన మహామనిషని కొనియాడారు. చదువుకున్న స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నదే గురజాడ అభిమతమన్నారు. అనంతరం శ్రీకాకుళం సాహితీ, కథానిలయం అధ్యక్షుడు డాక్టర్ బీవీఏ రామారావు నాయుడు మాట్లాడుతూ, ఆధునిక ప్రపంచంలో నాటకకర్తలు నాటకాలు రాస్తున్న సమయంలోనే గురజాడ కన్యాశుల్కం వచ్చిందన్నారు. గురజాడ సాహిత్యంలో నాటి సమాజంలో ఉన్న వాస్తవాలతో పాటూ ముందుచూపుతో రాసిన వాక్యాలు నేటితరానికి ఎంతో దగ్గరగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గురజాడ ఇందిర, వేంకటేశ్వరప్రసాద్, కాపుగంటి ప్రకాష్, మేకా కాశీవిశ్వేశ్వరుడు, పవ్వాడ సుబ్బరాజు, పీవీ.నరసింహరాజు, డాక్టర్ ఎ.గోపాలరావు, భోగరాజు సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గురజాడ కార్పెంటర్ దృష్టిలో స్త్రీ
‘ఎ ఉమన్ వెయిట్స్ ఫర్ మి’ కవితలో విట్మన్ స్వప్నించిన మహిళలా ప్రతిమహిళ క్రీడల్లో, వ్యాయామంలో పాల్గొని ఆరోగ్యం, ఆత్మరక్షణ సామర్థ్యం కలిగి ఉండాలనీ, ఐతే ఇటువంటి భావాలు ఒక బానిసలో-స్త్రీలో ఉండటం పురుషులు అంగీకరించలేరనీ అంటారు ఎడ్వర్డ్. స్త్రీవాద సాహిత్యంలో తరచు కన్పించే ‘వంటిల్లు తగలబెట్టడం’ అనే ప్రతీకకు మూలాలు గురజాడ అసంపూర్ణంగా విడిచిపెట్టిన ఒక రచనలో కన్పిస్తాయి. మెడ్రాస్ రెవ్యూ మాసపత్రికలో Edward Carpenter - His life and times శీర్షికతో గురజాడ రచించిన వ్యాసం చదివిన తర్వాత ఈ విషయం స్ఫురించింది. ఇందులో కార్పెంటర్‌ను టాల్‌స్టాయ్, విలియం మోరిస్, జాన్ రస్కిన్, వాల్ట్ విట్మన్, షెల్లి వంటి మానవతావాదులు, యుగకర్తల సరసన పేర్కొని ప్రశంసించారు గురజాడ. 1883లో కార్పెంటర్ రచించిన Towards Democracy కూడా ఈ వ్యాసంలో ప్రస్తావించారు. కార్మిక సంఘాలు శక్తివంతంగా పనిచెయ్యాలనీ, రాజకీయ వ్యవస్థలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలనీ, లాభాల కోసం కాక, మానవుల శ్రమను పొదుపుగా వాడుకొని మానవులు సృజనాత్మకంగా జీవించే అవకాశం రావాలనీ, స్త్రీలు సమానహక్కుల కోసం ఉద్యమించాలనీ కార్పెంటర్ ప్రతిపాదించారు. చరిత్రకారులు కార్పెంటర్‌ను తొలి పర్యావరణ శాస్త్రవేత్తగా, ఫేబియన్ సోషలిస్టుగా అభివర్ణించారు. గురజాడ ప్రస్తావించిన కార్పెంటర్ మరోరచన Love's Coming of Age. కార్పెంటర్ ఈ రచనలో స్త్రీ పురుషుల శృంగార సంబంధాలు, వివాహ వ్యవస్థ, వైవాహిక జీవితం, భవిష్యత్తరాలతో స్త్రీ పురుషులు నిర్వహించబోయే బాధ్యతలను చర్చించారు. మర్యాదస్తులైన స్త్రీలు, ఇంటి చాకిరికి అంకితమైన స్త్రీలు, వేశ్యలు అని స్త్రీలను కార్పెంటర్ మూడు వర్గాలుగా విభజించారు. యమకూపాల్లో అనామకంగా రాలిపోయే స్త్రీలు, ప్రతిరాత్రి శరీరాన్ని అమ్ముకొని స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించే స్త్రీలు (Free Women) అని వేశ్యలను మళ్లీ రెండువర్గాలు చేశారు. Woman in freedom ప్రకరణంలో పురుషుడితో సమానంగా అన్ని రంగాల్లో వ్యవహరించే స్త్రీలు తమ ఇచ్ఛానుసారం జీవించగలరనీ, కుటుంబాలు సమూహాలుగా ఏర్పడి శ్రమను పంచుకొన్నట్లయితే స్త్రీ కొంత మటుకైనా చాకిరి నుంచి విముక్తి పొందుతుందనీ, స్త్రీలు పురుషుల నీడలోంచి వెలుపలికి వచ్చి స్వతంత్రంగా వ్యవహరించే రోజు సమీపంలోనే ఉందనీ కార్పెంటర్ భవిష్యద్దర్శనం చేశారు. ‘ఎ ఉమన్ వెయిట్స్ ఫర్ మి’ కవితలో వాల్ట్ విట్మన్ స్వప్నించిన మహిళలా ప్రతిమహిళ క్రీడల్లో, వ్యాయామంలో పాల్గొని ఆరోగ్యం, ఆత్మరక్షణ సామర్థ్యం, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలనీ, ఐతే ఇటువంటి భావాలు ఒక బానిసలో-స్త్రీలో ఉండటం పురుషులు అంగీకరించలేరనీ అంటారు. అసలు ఈ లక్షణాలు తమకు సహజమైనవి కాదని స్త్రీలే భావించేంతగా పురుషులు ప్రవర్తించారంటారు కార్పెంటర్. తనకు లభ్యమైన కార్పెంటర్ రచనలన్నీ గురజాడ చదివినట్లనిపిస్తుంది. స్త్రీ పురుషుల మధ్య అన్నిరంగాల్లో సమానత్వాన్ని ఇద్దరూ కాంక్షించారు. స్త్రీలు ఆటపాటల్లో పాల్గొని తమను తాము కాపాడుకోగల సామర్థ్యం కలిగి ఉండాలని భావించారు. మొదట Love's Coming of Age లోని కొన్ని వాక్యాల అనువాదం: ‘‘ఇంటిచాకిరితో మురిగిపోయే ఇల్లాలి బ్రతుకు బానిస బ్రతుకు. ఆమె శక్తియుక్తులన్నీ ఇల్లు చక్కబెట్టుకోడానికే సరిపోతాయి. ఈ చాకిరిలో ఆమె మరొక రకంగా జీవించడానికి అవసరమైన జ్ఞానం, కాంతి లభించదు. ఇప్పుడు సమాజంలో వస్తున్న సాధారణమైన మార్పులు, సాంఘికమైన మార్పులు స్త్రీ జాతి విముక్తికి దోహదం చేస్తాయి. అత్యాధునిక సౌకర్యాలతో గృహ నిర్మాణం, భుజించడానికి సిద్ధంగా వండిన ఆహార పదార్థాలను అమ్మే విక్రయశాలలు, లాండ్రీలు, ఇతరేతర సౌకర్యాలు ఏర్పడటం, మనం భుజించే ఆహారాన్ని గురించి, గృహోపకరణాలను గురించి ప్రజల ఆలోచనల్లో వచ్చే విప్లవాత్మకమైన మార్పులు స్త్రీల చాకిరిని తగ్గించి వేస్తాయి. అలవాట్లలో స్త్రీలు సంప్రదాయవాదులైనా మార్పులు వస్తే వాటిని స్వీకరిస్తారు.’’ గురజాడ ‘సౌదామిని’ కథానాయికగా చిత్రించిన నవలలో ఒక పాత్రను ‘నేను’ దృష్టికోణం నుంచి రాశారు. కథాస్థలం ఊటి. ‘నేను’ వెంట అతని కవిమిత్రుడు గూడా ఉంటాడు. ‘నేను’ పాత్రను బాలయ్యనాయుడు తన అతిథిగా ఉండమని ఆహ్వానిస్తాడు. ‘నేను’, అతని కవిమిత్రుడు బాలయ్యనాయుడు బంగళాలో అతిథులుగా ఉంటారు. నాయుడికి సౌదామిని అనే అందమైన పెళ్లీడు కుమార్తె ఉంటుంది. ‘నేను’, కవిమిత్రుడు, బాలయ్య నాయుడు కూలాసాగా కబుర్లు చెప్పుకొంటున్నప్పుడు కవిమిత్రుడంటాడు: స్త్రీలు మేల్కోనాలి, తిరుగుబాటు చెయ్యాలి. మానవ జాతిలో స్త్రీ ఉత్తమమైనది. స్త్రీ బలహీనురాలని మీరనొచ్చు. అది అందరూ అనే మాటే. మనదేశంలో రైతు కుటుంబాల్లో స్త్రీ చాలా దృఢమైనది, ఆమెకు ఎంతో ఓర్పు ఉంది, పురుషుడి కన్నా ఎక్కువ సహనం కలది, నారేత వేస్తుంది, పొలాల్లో ప్రత్తి తీస్తుంది, చింతపండు వొలుస్తుంది, ధాన్యం దంచుతుంది, అన్ని పనుల్లో దాసీగా వ్యవహరిస్తుంది. పై కులాలకు చెందిన మన ఆడవాళ్ల విషయానికొద్దాం. ఆమె నీళ్లు చేదుతుంది, వంట చేస్తుంది, మరెన్నో పనులు చేస్తుంది. దేవుడు చెక్కిన శిల్పాలు వీళ్లు. సున్నితంగా, నాగరీకంగా ఉండే మన ఆడవాళ్లు శారీరకంగా బలహీనులే అని నేను అంగీకరిస్తాను. మృగప్రాయులను ఎదుర్కొనేందుకు ఒక ఆయుధాన్ని ఆమె చేతులో ఉంచుదాం. కత్తియుద్ధం స్త్రీలు మాత్రమే అభ్యాసం చెయ్యాలి. ‘నేను’ (కథ చెప్పే వ్యక్తి): వాళ్లకు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో బాగా తెలుసులేండి! కవి: ఎప్పుడు చతుర్లాడాలో నీకు తెలీదు. పురుషుడు విచక్షణాశక్తి కోల్పోవడం చేత, పురుషుడి క్రూరత్వం చేత స్త్రీలు కత్తిసాము అభ్యసించవలసి వస్తోంది. ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ సాయుధ కావాలి. ఆమె చాకో, రివాల్వరో దగ్గర ఉంచుకొని బయటకు వెళ్లాలి. నేను: చంపడానికి ఆమె కళ్లు చాలని నా ఉద్దేశం.కవి: అవును, సంస్కారులైన వారిని జయించడానికి. మృగప్రాయులను ఎదుర్కోడానికి కృపాణం కావాలి, బుల్లెట్లు కాదు. అప్పుడే క్రూరాత్ముల నుంచి ఆత్మరక్షణ చేసుకోగలదు. స్త్రీ వంటపని చేయడాన్ని నిషేధించాలి. నీకవసరమైన ఆహారం భోజన పదార్థాలమ్మే షాపులో దొరుకుతుంది. ఆహారాన్ని వేడిచేసుకోవడానికి నీవద్ద ఒక సాధనం ఉంటేచాలు. ప్రతివీధిలో అలాంటి షాపొకటి ఉండాలి. కుటుంబ సభ్యులందరూ ఏ బాదరబందీ లేకుండా అక్కడ భోజనం చేయొచ్చు. పెపైచ్చు మానవ శ్రమ ఎంత పొదుపౌతుంది! నేను: పేదవాళ్లు భోజనం కొనుక్కోలేరు!బాలయ్య నాయుడు: అతని ఆదర్శ లోకంలో పేదలే ఉండరు!కవి: ఆదర్శ లోకమా! నేను నిజమైన ఈ లోకాన్ని గురించే మాట్లాడుతున్నా! కవీ, తత్వవేత్తా తమ కాలం కన్నా చాలా ముందుంటారు. కవి ప్రతిపాదనను బాలయ్య నాయుడు ఆమోదిస్తాడు. సౌదామినికి కవి కత్తియుద్ధం, కవిత్వం నేర్పుతాడు. ఒక జమీందారు సౌదామినిని అపహరించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె జమీందార్‌ను బాకుతో గాయపరిచి, క్షణాల్లో పావురంలా ఇల్లు చేరుకుంటుంది. తర్వాత వివాహవ్యవస్థ పరిమితులను గురించి హీరో పాత్రద్వారా కొంత చర్చ నడిపారు గురజాడ. భర్తలు విడిచిపెట్టిన భార్యలు, భార్యల చేత విడిచిపెట్టబడ్డ భర్తలు స్వీయపోషణలో అసమర్థులైతే అటువంటి వారికోసం ప్రభుత్వమే అనాథాశ్రమాలు పెట్టి సంరక్షణ చేయాలని. ‘‘ఇప్పుడున్న వివాహ వ్యవస్థలో వెసులుబాటు తక్కువ’’ అనే వాక్యంతో గురజాడ నవలను పూర్తిచేయకుండా విడిచిపెట్టారు. స్త్రీ పురుషుల విషయంలో కార్పెంటర్ అభిప్రాయాలన్నిట్నీ గురజాడ ఆమోదించారని చెప్పడంలేదు. ‘కవి’ పాత్ర ద్వారా వ్యక్తం చేసిన అభిప్రాయాలను ‘నేను’, బాలయ్య నాయుడు పాత్రలు పరిహాసం చేస్తాయి. సౌదామిని పాత్రద్వారా స్త్రీలు ఆత్మరక్షణ పద్ధతులు తెలుసుకొని ఉండాలని మాత్రం సూచించారు. వివాహవ్యవస్థకున్న పరిమితులను మరింత సాకల్యంగా తెలుసుకోడానికి గురజాడ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలు ఉపకరిస్తాయి. (కార్పెంటర్ మీద గురజాడ రాసిన ఇంగ్లీషు వ్యాసం రాజాం వెలుగు సంస్థ ప్రచురించిన ‘గురజాడ నూరవ వర్ధంతి సంచికలో అచ్చయింది.) - డాక్టర్ కాళిదాసు పురుష్తోతం drkpurushotham@yahoo.com -
యాత్ర ముగింపు
జీవన కాలమ్ గురజాడ అప్పారావు గారు వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు కుటుంబ సభ్యులు వైద్యుడిని పిలిపించారట. అప్పారావు గారు వైద్యుడిని చూసి ‘‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’ అన్నారట. వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు. మొన్న అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య ఈ విషయాన్ని చెప్పారు. ప్రముఖ రచయిత కుష్వంత్‌సింగ్ తల్లి 94 సంవత్సరాలు బతికారు. ఆమె పక్కన కూర్చుని కుష్వంత్‌సింగ్ తల్లిని అడిగారట- ఏం కావాలని. ఓ పెగ్గు స్కాచ్ కావాలన్నారట ఆమె. ఒంగోలులో మా మిత్రుడి తండ్రిని చివరి రోజుల్లో నేను చూశాను. చాలా నెలల తర్వాత మా మిత్రుడు ఫోన్ చేశాడు - నాన్న వెళ్లిపోయాడని. చివరి క్షణాల్లో కొడుకుని పిలిచి - ఓ గ్లాసుతో బ్రాందీ కావాలన్నారట. తాగి, ఒక సిగరెట్టు కాల్చి హాయిగా కన్నుమూశాడు. మృత్యువుని మజిలీగా గుర్తు పట్టడం గొప్ప సంస్కారం. మృత్యువుని సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా గొప్ప సంస్కారం. దుఃఖం ఒక దృక్పథం. నిర్వేదం ఒక బలహీనత. భారతీయ సంస్కృతి మనిషి పుట్టినప్పటి నుంచీ ఒక ఆలోచనకు మనల్ని తరిఫీదు చేస్తుంది - ఏదో ఒకనాడు వెళ్లిపోక తప్పదని. కొందరు ఆ క్షణాన్ని గంభీరంగా ఆహ్వానిస్తారు. కొందరు బెంబేలు పడతారు. కొందరు బేల అవుతారు. ప్రఖ్యాత అమెరికన్ టెన్నిస్ ఆటగాడు ఆర్దర్ ఆష్కి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. 1983లో గుండెకి శస్త్రచికిత్స జరిగినప్పుడు శరీరంలోకి ఎక్కించిన రక్తం ద్వారా ఈ వ్యాధి సంక్రమించింది. చావు తప్పదని అర్థమవుతోంది. అభిమానులు దుఃఖంతో గుండె పట్టుకున్నారు. ఎందరో ఉత్తరాలు రాశారు. ఒక అభిమాని అన్నాడు: ‘‘ఇంత దారుణమైన రోగానికి దేవుడు మిమ్మల్నే ఎందుకు గురిచేయాలి?’’ అని. దీనికి ఆర్దర్ ఆష్ ఇలా సమాధానం రాశాడు: ఈ ప్రపంచంలో 5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడుతున్నారు. 50 లక్షల మందికి టెన్నిస్ వంటబట్టింది. 5 లక్షల మంది ప్రొఫెషనల్‌గా టెన్నిస్‌ని ఆడగలుగుతున్నారు. 50 వేల మంది టెన్నిస్ పోటీ టోర్నమెంట్లలో ఆడుతున్నారు. 50 మంది మాత్రమే వింబుల్డన్ స్థాయికి వచ్చారు. నలుగురే సెమీ ఫైనల్స్‌కి వచ్చారు. ఇద్దరే ఫైనల్స్‌కి వచ్చారు. నేను చాంపియన్షిప్ని సాధించి, వింబుల్డన్ కప్పుని గెలిచి, చేత్తో పట్టుకున్నప్పుడు - నేను దేవుడిని అడగలేదు ‘ఎందుకయ్యా నన్నొక్కడినీ ఎంపిక చేశావు?’ అని. ఇప్పుడు కష్టంలో ఉండి ‘నాకే ఎందుకు ఈ అనర్థాన్ని ఇచ్చావు? అని దేవుడిని అడిగే హక్కు నాకేముంది?’’ ఆకెళ్ల అచ్యుతరామమ్ గారు రైల్వేలో పెద్ద ఆఫీసరుగా చేశారు. రామాయణాన్ని ‘రగడ’ వృత్తంలో రాశారు. ఆదిశంకరుల రచనల్ని, త్యాగరాజ భక్తి తత్వాన్ని రచనల ద్వారా నిరూపించారు. 1984 ఫిబ్రవరి 12 ఉదయం సికింద్రాబాద్‌లో వారి అమ్మాయి కొత్త ఇంటికి శంకుస్థాపన. శుభకార్యానికి తెల్లవారుఝామున ఒక బాచ్‌ని దింపి ఇంటికి వస్తున్నారు. దారిలో గుండెపోటు వచ్చింది. సికింద్రాబాద్ తాడ్‌బండ్ దగ్గర ఉన్న పురాతన ఆంజనేయస్వామి గుడి ముందు కారుని పక్కకి ఆపి, పార్కింగు దీపాలు వెలిగించి, కారు తాళం చెవులు జేబులో వేసుకుని. స్టీరింగు మీద తల ఆనించి వెళ్లిపోయారు. రామభక్తుడికి మృత్యువు ఆంజనేయుడి సమక్షంలో ఒక యాత్ర. ఒక విచిత్రమైన సంఘటన. మా వియ్యపురాలి తండ్రిగారు దాదాపు 69 ఏళ్ల కిందట - విజయవాడలో పీడబ్ల్యూడీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. విజయవాడ రేడియో స్టేషన్ పాత బంగళాలో ఉండేవారు. చల్లా వెంకటరత్నంగారు వారి తండ్రిగారు. రామభక్తుడు. శ్రీరామనవమి నవరాత్రులలో ఆయన పూజలు చేసి, ప్రవచనాలు చెప్పించేవారు. ఆ సంవత్సరం మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు (అప్పట్లో వారు ఇరవయ్యవ పడిలో ఉండి ఉంటారు) రామాయణం చెప్తున్నారు. ఉదయం కల్యాణం జరిగింది. సాయంకాలం ప్రవచనం. జటాయువు నిర్యాణం గురించి చెప్తున్నారు శాస్త్రిగారు. వెంకటరత్నం గారు స్తంభానికి చేరబడి కూర్చుని వింటున్నారు. జటాయువు ‘రామా! రామా!’’ అంటూ ప్రాణాలు విడిచిపెట్టాడు - అన్నారు శాస్త్రిగారు. ‘‘జటా యువు వెళ్లిపోయాడా?’’ అన్నారు వెంకటరత్నంగారు. అవునన్నారు శాస్త్రిగారు. అంతే. స్తంభానికి ఆనుకున్న వెంకటరత్నంగారి తల వాలిపోయింది. వెళ్లిపోయారు. దాదాపు 21 ఏళ్ల కిందట మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో మహాభారత ప్రవచనం చెప్తూ ఈ ఉదంతాన్ని చెప్పారు. వెంకటరత్నం గారికి మృత్యువు ఒక ముహూర్తం. చాలా మందికి మృత్యువు ఒక మజిలీ. కొందరికి ఆటవిడుపు. మహాయోగులకి నిర్యాణం. కొందరికి ఐహికమైన ‘మోజు’లకు విడాకులు ఇచ్చే ఆఖరి క్షణం. కొందరు అదృష్టవంతులకు మరో గమ్యానికి దాటే వంతెన. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
గురజాడకు ఘననివాళి
-
నేడు గురజాడ శత వర్ధంతి
-
చారిత్రక కట్టడంగా గురజాడ గృహం
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం విజయనగరం కంటోన్మెంట్: నవయుగ వైతాళికుడిగా ఖ్యాతిగాంచిన గురజాడ నివసించిన గృహాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు గుర్తించింది. విజయనగరంలోని గురజాడ గృహాన్ని చారిత్రక కట్టడంగా, ఆ గృహ సముదాయాన్ని పురావస్తు కట్టడంగా గుర్తిస్తున్నట్టు పురావస్తు, మ్యూజియం శాఖ శనివారం ప్రకటించింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ జీఓ నంబర్-8ను విడుదల చేశారు. దీని ప్రకారం గురజాడ గృహాన్ని చారిత్రక కట్టడంగా, పురావస్తు ప్రదేశంగా గుర్తిస్తూ గెజిట్ పబ్లికేషన్‌ను విడుదల చేయనున్నారు. -
మహాకవి గురజాడ ముని మనుమని ఆత్మహత్య
రాజమండ్రి : మహాకవి గురజాడ అప్పారావు ముని మనుమడు, ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ గురజాడ శ్రీనివాస్(47) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాజమం డ్రి పట్టణం ప్రకాశ్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీని వాస్కు ఇటీవల రాజమండ్రి నుంచి కాకినాడ బదిలీ అయింది. అక్కడి కార్యాలయం పరిసరాల్లో ఇల్లు అద్దెకు తీసుకున్న ఆయన ఈ నెల 17న రాజమండ్రిలోని ఇల్లు ఖాళీ చేసి కాకినాడ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, శ్రీనివాస్ భార్య లలిత కొత్త ఇంటిలో పాలు పొంగించేందుకు శనివారం కాకినాడ వెళ్లారు. రాజమండ్రి కార్యాలయం సిబ్బంది శ్రీనివాస్ మొబైల్‌కు అనేకసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లి చూశారు. తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూసేసరికి పడకగదిలో ఫ్యాన్ కొక్కేనికి తువాలుతో ఉరేసుకున్న శ్రీనివాస్ కనిపించారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పగా ప్రకాశ్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన భార్య లలిత కాకినాడ నుంచి వచ్చారు. పుణేలో చదువుతున్న శ్రీనివాస్ కుమారుడు రాజమండ్రి బయల్దేరాడు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ కిషోర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
నవ్యాంధ్ర సాహిత్యానికి వేగుచుక్క గురజాడ
రాజభవనాల గోడల్లో వేలాడుతున్న కవితా కన్యకను భుజాన ఎత్తుకొని జనం దగ్గరకు తెచ్చిన మహాకవి గురజాడ. అంధ విశ్వాసాలపై సాహిత్యాన్ని పాశుపతాస్త్రంగా ప్రయోగించిన ఆయన గిడుగును స్ఫూర్తిగా తీసుకొని వ్యవహారిక భాషకు పెద్ద పీట వేశారు. మనిషి చేసిన రాయిరప్పకు, మహిమ కలదని సాగి మొక్కుతు మనిషి అంటే రాయిరప్పల కన్న కనిష్టంగా చూస్తావేమి బాలా... అనీ, దేశమంటే మట్టికాదోయ్, దేశమం టే మనుషులోయ్... అనీ ఎలుగెత్తారు. మంచి అన్నది మాల అయితే మాలనే నగుదున్.. అంటూ వర్ణవ్యవస్థపై తిరుగు బాటు బావుటా ఎగరేశారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యక, లవణ రాజుకల... లాంటి అద్భుతమైన కవితలు ఆయన రాసి నా, వీటిలో ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ ఓ ఆణిముత్యంగా నిలు స్తుంది. బాల్యవివాహాలను అరికట్టాలనే ధ్యేయంతో రాసిన కథా గేయం ఇది. ఆ రోజుల్లో పెళ్లీడు ఆడపిల్లలను కాసులకు కక్కుర్తిపడి వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవారు. కాటికి కాలు చాచిన వృద్ధులు పెళ్లయిన కొన్నాళ్లకే మరణించడంతో వారంతా జీవి తాంతం వితంతువులుగా మిగిలేవారు. ఈ నేపథ్యంలో గుర జాడ రాసిన పూర్ణమ్మ కథ సమాజాన్ని ఓ కుదుపు కుదిపింది. ఈ కవితలోని చరణాలను చదువు తున్నప్పుడు ఎం తటి కఠిన హృదయుడైనా కన్నీరు పెట్టుకుంటాడు. కరుణ రసాత్మకమైన ఈ ఖండకావ్యం గురజాడకు ఎన లేని ఖ్యాతి తెచ్చిపెట్టింది. పూర్ణమ్మ లేత హృదయం లో విజృంభించి, విశృంఖల విహారం చేసిన తీవ్రవే దనను అలతి, అలతి పదాలలో వ్యక్తీకరించిన తీరును మరువలేం. ‘కన్యక’ కవితలో గృహహింసకు వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని పిలుపునిచ్చింది ఆయనే. స్త్రీకి విద్య అవ సరమని చెబుతూ ‘దిద్దుబాటు’ అనే మినీ కథను రాశారు. ఆయన రాసిన అత్యుత్తమ నాటకం ‘‘కన్యాశుల్కం’’. ఈ నాటకంలో మధురవాణి, గిరీశం, రామప్ప పంతులు, అగ్నిహో త్రావధానులు, కరటకశాస్త్రి పాత్రల్లో మన చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరు తారసపడుతుంటారు. మనుషుల్లోని చెడునంతా బట్టబయలు చేసి మంచిమార్గం చూపెట్టిందిది. వేశ్యలు మను షులేనని, వాళ్లని వెలివేయకుండా దారిలోకి తెచ్చి పెళ్లిళ్లు జరి పించాలని ఆ నాటకంలో సూచించారు. ఈ నాటకం లోని సంభాషణలు సూక్తులుగా, సామెతలుగా ప్రసిద్ధి కెక్కాయి. ‘‘తాంబూలాలిచ్చాం తన్నుకుచావండి’’, ‘‘ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది’’, ‘‘నాతో మాట్లాడ టమే ఒక ఎడ్యుకేషన్. మనవాళ్లు ఒట్టి వెధవాయి లోయ్’ ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటే గాని పొలిటీషియన్ కాదు’ వంటి సంభాషణలు నేటికీ చాలా మంది ఉపయోగిస్తున్నారు. ‘కన్యాశుల్కం’ రచనతో ఆంధ్రనా టక సాహిత్యంలో ఒక నూతన పంథా ప్రారంభమైంది. ఈ నాటకం జీవితమంత గొప్పదని శ్రీశ్రీ కితాబు ఇచ్చారు. గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21న విశాఖజిల్లా రాయవరంలో జన్మించారు. 1882లో మెట్రిక్ చదువుతున్న ప్పుడు ఆంగ్లంలో ‘కకూ’ అనే గేయాన్ని రాసి ఉపాధ్యాయుల ప్రశంసలు పొందారు. 1883లో ‘సారంగధర’ అనే ఆంగ్ల పద్య కావ్యాన్ని ప్రచురించారు. విజయనగరంలో డిగ్రీ పూర్తయ్యాక, అక్కడి ఎం.ఆర్.ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. 1887లో ఆనాటి విజయనగరం సంస్థానాధిపతి ఆనందగజ పతిరాజు, గురజాడను విజయనగరం మహరాజా కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా నియమించారు. 1892లో కన్యాశుల్కం మొదటి కూర్పును విడుదల చేశారు. 1906లో బోధనా భాషగా తెలుగును అమలు చేయాలంటూ ఉద్యమించారు. అదే ఏడాది ‘కొండు భట్టీయం’ నాటకం రాశారు. 1910లో ముత్యాలసరా లు అనే నూతన ఛందస్సుకు శ్రీకారం చుట్టారు. ‘కన్యక’, ’సుభ ద్ర’ కావ్యాలను వెలయించారు. ‘దించులంగరు’, ‘నీలగిరి పాటలు’ ఆయన రాసినవే. గురజాడ 1915 నవంబర్ 30న విజయనగరంలో తుది శ్వాస విడిచారు. గ్రాంథిక భాషకు కాలం చెల్లిపోయిందని, మంచి గతమున కొంచెమేనని, మతములన్నియు మాసిపో వును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగుననీ గుర్తించి తొలి కోడై కూసిన గురజాడ తెలుగు సాహిత్య వినీలాకాశంలో ఓ ధ్రువ తారగా నిలిచిపోయారు. (నేడు గురజాడ 100వ వర్ధంతి) వి.కొండలరావు పొందూరు, శ్రీకాకుళం జిల్లా -
తెలుగు వెలుగు..గురజాడ!
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మేలిమలుపు తిప్పిన ఘనత మహాకవి గురజాడ అప్పారావుకు దక్కుతుందనడంలో సందేహం లేదు. బెంగాలీలకు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాగో తెలుగువారికి గురజాడ అంతటి గొప్ప కవి. ఆదివారం ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. ఒంగోలు కల్చరల్ : కవిత్వంలో మూస విధానాన్ని బద్దలు కొడుతూ ముత్యాల సరమనే కొత్త ఛందాన్ని సృష్టించి గేయ కవితలు రచించిం ది గురజాడ అప్పారావే. దేశభక్తి గేయంతో పాటు పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.. కన్యక వంటి పలు కవితా ఖండికలు గురజాడ కవిత్వ ప్రతిభకు మచ్చుతునకలు. గుర జాడ సృష్టించిన వినూత్న కవిత్వ మార్గమే తనకు మార్గదర్శకమైందని స్వయంగా శ్రీశ్రీ పేర్కొనడం విశేషం. రాళ్లురప్పలతో కూడిన ముళ్లబాటలో గురజాడ వెలుగుబాట వేస్తే ఆ మార్గాన్ని తాను మరింత వెడల్పు చేశానని, తన మహాప్రస్థానంలోని గేయాలన్నీ ఆ ప్రభావంతో రచించినవేనని శ్రీశ్రీ పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం సాహిత్యాభిమానులకు తెలిసిందే. గురజాడ అప్పారావు సమాజంలోని అంధవిశ్వాసాలను నిరసించారు. అందరూ తోక చుక్కను చూసి భయపడే రోజుల్లో భూమికి దూరపు బంధువైన తోకచుక్క అరిష్టదాయకం కాదని ధైర్యం చెప్పడమేగాక ఆ తోక చుక్కకు సాదర ఆహ్వానం పలికారు గురజాడ. దురాచారంపై దూసిన ఖడ్గం కన్యాశుల్కం గురజాడ కీర్తిని శాశ్వతం చేసిన కన్యాశుల్కం నాటకం ఒక చారిత్రక అవసరాన్ని నెరవేర్చింది. ఆనాటి సమాజంలో అమాయక స్త్రీల జీవితాలను సంక్షుభితం చేస్తున్న కన్యాశుల్క దురాచారానికి మంగళం పాడేందుకు సాహిత్యాన్ని గురజాడ వజ్రాయుధంలా సంధిం చారు. తదనంతరం కాలంలో ఆ నాటకం వల్ల కన్యాశుల్క దురాచారం తగ్గుముఖం పట్టిందని చెప్పడంలో సందేహం లేదు. సమాజానికి మేలు చేసేదే నిజమైన సాిహ త్యమనే విమర్శకుల అభిప్రాయాన్ని గురజాడ నిజమని నిరూపించారు. కన్యాశుల్కం నాటకం రచించి వందేళ్లకు పైబడినా ఆ నాటకం నేటికీ నిత్యనూతనం. గురజాడ నిస్సందేహంగా ప్రజాకవి, మహాకవి, యుగకవి. ప్రజల కోసం, వ్యవస్థలో నిజమైన మార్పు కోసం అక్షర సమరం సాగించిన భాషాయోధుడు. వ్యావహారికభాషగా తెలుగుకు తగిన గుర్తింపు తేవడం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన పోరాటశీలి. సాంఘిక సంస్కరణకు తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి. గురజాడ మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరణీయం. గురజాడ రచించి న ‘దేశమును ప్రేమించుమన్న.. మంచి అన్నది పెంచుమన్న.. ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టి మేల్ తలపెట్టవోయి..! అనే దేశభక్తి గేయం ఒక్కటిచాలు ఆయన కీర్తిని అజరామరం చేసేందుకు. ఆ గేయం నేటికీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని ప్ర సాదిస్తూనే ఉంది. దేశమంటే ఏమిటో ప్రజలంటే ఎవరో చాటిచెబుతూ జాతిని జాగృతం చేస్తూనే ఉంది. నాటికీ నేటికీ ఒక్కటే అడుగుజాడ.. అదే గురజాడ సృష్టించిన వెలుగు జాడ! -
గురజాడ జయంతి నేడు
-
మహాకవి గురజాడ 152వ జయంతి
విశాఖపట్నం: మహాకవి గురజాడ అప్పారావు 152వ జయంతిని ఆయన స్వగ్రామం ఎస్.రాయవరంలో ఘనంగా నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, శానిటేషన్ శాఖల మంత్రి కిమిడి మృణాళిని ఆయన స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురజాడ పేరుమీద ఓపెన్ ఆడిటోరియం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. గురజాడ రచనలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని జిల్లాలలో గురజాడ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. ** -
మధుర... వాణి
సత్వం: ‘నాతో మాట్లాడడవే ఒక ఎడ్యుకేషన్’ ‘తనకి రొట్టా? ఒహడికి ముక్కానా?’ ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అంటూ ప్రతి సందర్భాన్నీ నాటకంతో ముడిపెట్టి మాట్లాడే ‘కన్యాశుల్కం’ భక్తులే పుట్టుకొచ్చారు. ‘కవిత్రయమంటే- తిక్కన, వేమన, గురజాడ’ అన్నాడు శ్రీశ్రీ, ప్రాచీన కవిత్రయపు పీఠాల్ని కాసేపు కదిలించి. గురజాడ భక్తుడిగా మాత్రమే శ్రీశ్రీ ఈమాట చెప్పి ఉండకపోవచ్చు; ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ పరిచిన బాటే, ఆయన్ని, తనకంటే ముందరి, భిన్నకాలాలకు చెందిన ఇరువురు మహనీయులతో కూడిన ఒక పదబంధాన్ని పంచుకునేలా చేసివుంటుంది. ‘ప్రాచీనత’, ‘ఆధునికత’ సంధియుగంలో జన్మించాడు గురజాడ. సాహిత్యం పునాదిగా ఆకాలాన్ని అర్థం చేసుకుంటే- అది పురుషుడి విలాస వస్తువుగా స్త్రీ చూడబడుతున్న కాలం; వెర్రిగా బాల్యవివాహాలు జరుగుతున్న కాలం; కన్యాశుల్కం కింద చిన్నారిబాలికల్ని, కడువృద్ధులకు సైతం కట్టబెడుతున్న ‘రక్తమాంసాల విక్రయ’ కాలం; వితంతువుల పునర్వివాహానికి ఏమాత్రం ఆమోదం లేని కాలం; సామాన్యప్రజలు తమని తాము ‘కర్మ’కు వదిలేసుకుని బతుకులీడుస్తున్న కాలం; మొత్తంగా- ‘నీతులూ, బూతులూ’ కలగలిసిన యుగం. అందుకే గురజాడ తన యావత్ సాహిత్యాన్ని ఈ సామాజిక రుగ్మతలపై పోరాటం కోసమే వెచ్చించాడు. దేశాన్ని ఉద్ధరించే, దేహాన్ని గౌరవించే, హేతువును పెంపొందించే రచనలకు శ్రీకారం చుట్టాడు. ‘సమాజాన్ని అప్రతిష్టపాలు చేసే పరిస్థితిని కళ్లముందర పెట్టి, నైతిక భావాల ఉన్నత ప్రమాణాల్ని ప్రాచుర్యానికి తేవడం కంటే, సాహిత్యానికి ఉత్తమమైన కార్యమేదీ ఉండదు’. ఉపాధ్యాయుడిగానూ, డిప్యుటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్‌క్లర్కుగానూ, విజయనగరం రాజు ఆస్థానంలోనూ, అధ్యాపకుడిగానూ పనిచేసిన గురజాడ- తొలుత ఆంగ్లంలో రాసినప్పటికీ, తర్వాత తెలుగులోకీ, అందునా ఆ సారం చేరవలసిన జనభాషలోకీ మరలాడు. స్నేహితుడు గిడుగు రామ్మూర్తితో కలిసి వ్యావహారిక భాషోద్యమానికి నడుం బిగించాడు. విజయనగర కేంద్రంగా జరిగే ‘కన్యాశుల్కము’ నాటకంలో అక్కడి యాసతో పాత్రోచిత భాషను ప్రవేశపెట్టాడు. పెద్ద కుటుంబాలనుంచి వచ్చినవారే నాయికానాయకులుగా సాహిత్యాన్ని ఆక్రమించుకుంటున్న కాలంలో వేశ్య మధురవాణిని నాయికను చేశాడు. వేశ్యావృత్తిని నిర్మూలించాలంటే, ముందుగా వేశ్యలను కూడా మనుషులుగా చూడటం అవసరమన్నాడు. గిరీశం, బుచ్చమ్మ, సౌజన్యారావు, రామప్పంతులు, లుబ్ధావదాన్లు, వెంకటేశం, కరటకశాస్త్రి... రచయితతో సమానంగా పాత్రలు గుర్తింపులోకి రావడం ఎప్పుడోగానీ జరగదు. వందేళ్లు పూర్తిచేసుకున్న ఈ నాటకం ప్రపంచనాటకాల్లో ఎన్నదగినదిగా ఖ్యాతిగాంచింది. ‘డామిట్! కథ అడ్డంగా తిరిగింది’ ‘నాతో మాట్లాడడవే ఒక ఎడ్యుకేషన్’ ‘తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం’ ‘తాంబూలాలిచ్చాను, తన్నుకు చావండి’ ‘పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్’ ‘డబ్బు తేని విద్య దారిద్య్ర హేతువు’ ‘తనకి రొట్టా? ఒహడికి ముక్కానా?’ ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అంటూ ప్రతి సందర్భాన్నీ నాటకంతో ముడిపెట్టి మాట్లాడే ‘కన్యాశుల్కం’ భక్తులే పుట్టుకొచ్చారు. ‘దేశమును ప్రేమించుమన్నా’... గురజాడ తత్వం మొత్తాన్నీ వెల్లడించే గేయం. దానికి ప్రపంచ జాతీయగీతం కాగల శక్తివుందన్నాడు శ్రీశ్రీ. ‘వొట్టి మాటలు కట్టిపెట్టోయ్/ గట్టి మేల్ తలపెట్టవోయ్... ఈసురోమని మనుషులుంటే/ దేశమేగతి బాగుపడునోయ్... అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్/ దేశి సరుకుల నమ్మవలెనోయ్... పరుల కలిమికి పొర్లి యేడ్చే/ పాపి కెక్కడ సుఖం కద్దోయ్... సొంతలాభం కొంతమానుకు/ పొరుగువానికి తోడుపడవోయ్/ దేశమంటే మట్టికాదోయ్/ దేశమంటే మనుషులోయ్... దేశమనియెడి దొడ్డవృక్షం/ ప్రేమలను పూలెత్తవలెనోయ్’... ఉత్తి భౌగోళిక దృష్టితో కాకుండా, మనుషులతో ముడిపెడుతూ దేశాన్ని చూశాడు గురజాడ. స్వయంసమృద్ధ, సహకారపూరిత అవనిని కాంక్షించాడు. అస్పృశ్య నివారణ ఉద్యమరూపు దాల్చకముందే, ‘మంచి చెడ్డలు ఎంచి చూడగ మనుజులందున రెండె కులములు, మంచి యన్నది మాలయైతే మాలనే అగుదున్’ అని ప్రకటించాడు. సహపంక్తి భోజనంలో పాల్గొన్నాడు. గురజాడ రాసిన ప్రతివాక్యమూ తెలుగునాట వ్యాప్తిలోకి వచ్చింది. ‘ఆటల పాటలతోటి కన్నియలు/ మొగుడు తాత యని కేలించ/ ఆటల పాటల కలియక పూర్ణిమ/ దుర్గను చేరీ దుఃఖించే (పూర్ణమ్మ); ‘పట్టమేలే రాజు అయితె/ రాజునేలే దైవముండడొ?/ పరువు నిలపను పౌరుషము మీ/ కేల కలగదొకో?’ (కన్యక); ఏనుగు ఎక్కి మనము/ ఏ వూరెళదాము?/ ఏనుగు ఎక్కి మనము/ ఏలూ రెళదాము (మిణుగురులు); ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ (ముత్యాల సరములు)... కవిగా, నాటకకర్తగానే కాకుండా, ‘దిద్దుబాటు’తో ఆధునిక కథకు బలమైన పునాదిని ఏర్పాటుచేశాడు. దంపతుల మధ్య తప్పక ఉండవలసిన అనురాగాన్ని చిత్రించాడు. 1862లో జన్మించిన ఈ మహాకవి అనారోగ్యంతో 53 ఏళ్లకే కన్నుమూశాడు. ‘బ్రతికి చచ్చియు, ప్రజలకెవ్వడు/ బ్రీతి కూర్చునొ, వాడె ధన్యుడు’. కృష్ణశాస్త్రి అన్నట్టు, ‘గురజాడ 1915లో చనిపోలేదు, అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించాడు’. - సెప్టెంబర్ 21న రచయిత గురజాడ అప్పారావు జయంతి -
నో డౌట్... ఇది సొంత ఇంట్రస్ట్!
గురజాడ అప్పారావు ‘సొంత లాభం కొంతమానుకోమని’ ఉద్బోధిస్తే ఆయన వారసులుగా చెప్పుకొనే జిల్లా నేతలు సొంత ఇం‘ట్రస్ట్’ మాకు ముఖ్యమంటూ జిల్లాకు ఏకంగా ప్రభుత్వ వైద్యకళాశాల రాకుండా చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాలను నిర్వహిస్తే తక్కు వ ఫీజులతో వైద్య విద్య అభ్యసించవచ్చన్న జిల్లా విద్యార్థుల ఆశలను అడియాసలు చేస్తూ ఓ ట్రస్ట్‌కు కళాశాలను కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి జిల్లాలో కొందరు టీడీపీ నేతలే కార ణమని, వారే ప్రభుత్వ కళాశాల ఏర్పాటు కాకుండా మోకాలు అడ్డుపెట్టినట్టు భోగట్టా.... సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల యోగం లేనట్టే. ప్రైవేటువైపే సర్కార్ మొగ్గు చూపుతోంది. టీడీపీ కీలక నేతలు చేస్తున్న తెర వెనుక ప్రయత్నాలతో మంత్రి మృణాళిని ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా పక్కకు వెళ్లిపోయింది. విజయనగరానికి చెందిన ఓ ట్రస్టుకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. దీంతో ప్రభుత్వ వైద్య విద్య జిల్లా విద్యార్థులకు అందని ద్రాక్షగా మారనుంది. స్థోమతుంటే లక్షలాది రూపాయల ఫీజులతో చదువు‘కొనా’లి. లేదంటే వైద్య విద్య అభ్యసించలేని పరిస్థితి ఏర్పడనుంది. జిల్లాకొక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని మేనిపెస్టోలో టీడీపీ పేర్కొంది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ప్ర భుత్వ వైద్య కళాశాలల్లేని విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈసారి ఏర్పాటు చేయడం ఖాయమని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృణాళిని కూడా మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టరేట్(డీఎంఈ)కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో డీఎంఈ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు సరిపడా 25 ఎకరాలను విజయనగరం పట్టణంలో ఘోషా ఆస్పత్రి, పెద్దాస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు ఆ ప్రతిపాదనల్లో పొందుపరిచారు. అలాగే రూ.400 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనల నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే, తెరవెనుక వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో చంద్రబాబు ఆ ప్రతిపాదనను తిరిస్కరించినట్టు తెలిసింది. సర్కార్ కళాశాల కన్నా ప్రైవేటు కళాశాలైతే బాగుంటుందని సంబంధిత అధికారులకు సూచించినట్టు తెలియవచ్చింది. దీంతో డీఎంఈ అధికారులు మరో మాట మాట్లాడకుండా వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఈ విషయంలో మంత్రి మృణాళి మాట కూడా చెల్లుబాటుకాలేదని సమాచారం. చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగే జిల్లా కీలక నేతలు లోపాయికారీగా చేసిన ప్రయత్నాలతోనే సర్కార్ కళాశాల ప్రతిపాదనలను చంద్రబాబు తిరస్కరించినట్టు తెలుస్తోంది. తమకు ఇప్పటికే అనేక విద్యా సంస్థలు ఉన్నాయని, దీన్ని కూడా ఇచ్చేస్తే మరింత పటిష్టమవుతుందని ట్రస్ట్ యాజమాన్యం, టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో అధినేత తలొగ్గినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రూ.400కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ప్రస్తుతం లేదన్న కారణాన్ని సాకుగా చూపించి కీలక నేతలకు సంబంధించిన ట్రస్టుకు అప్పగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రైవేటే దిక్కు జిల్లాలో ఇప్పటికే ఒక ప్రైవేటు వైద్య కళాశాల ఉంది. తాజాగా వస్తున్న రెండోది ప్రైవేటుకే కట్టబెడుతుండడం తో ప్రభుత్వ వైద్య కళాశాల కు జిల్లా దూరమయ్యే పరి స్థితి ఏర్పడనుంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వెళ్లడంతో స్థోమత ఉన్న విద్యార్థులకే చదివే అవకాశం ఉంటుం ది. పేదవిద్యార్థులు ఎప్పటిలాగే ఆశలు వదులుకోవల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ప్రభుత్వ వైద్య కళాశాల వస్తే ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని ఐదు జిల్లాల విద్యార్థుల కోసం 85 శాతం సీట్లు కేటాయిస్తారు. దీంతో లోకల్ కింద ఎక్కవ మందికి సీట్లొస్తాయి. అదే ప్రైవేటు యాజమాన్యమైతే ఇష్టానుసారం వ్యవహరిస్తుంది. అలాగే సర్కార్ కళాశాలలో రూ.10వేల ఫీజుకే వైద్య వైద్యను చదువుకోవచ్చు. ప్రైవేటు కళాశాలైతే ఏ కేటగిరీలో రూ.60వేలు, బీ కేటగిరిలో రూ.2.40 లక్షలు, సీ కేటగిరిలో రూ.5.50 లక్షల వ రకూ ఫీజులు చెల్లించవలసి వస్తుంది. ఇక యాజమాన్యం కోటా కిందైతే చెప్పనక్కర్లేదు. మొత్తానికి పక్కనున్న శ్రీకాకుళంలోనూ, పొరుగునున్న విశాఖలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలుంటే విజయనగరం జిల్లాలో ప్రైవేటే ముద్దు అని కీలక నేతలు ఆరాటపడుతున్నారు. దీంతో జిల్లాకొచ్చే మంచి అవకాశాన్ని కోల్పోయేపరిస్థితి ఏర్పడింది. -
‘కన్యాశుల్కం’ నాటకం