Tirupati MLA Bhumana Karunakar Reddy Meets AP CM YS Jagan, Details Inside - Sakshi
Sakshi News home page

కన్యాశుల్కం కాపీలను ఆవిష్కరించిన సీఎం జగన్‌

Published Wed, Sep 21 2022 4:33 PM | Last Updated on Wed, Sep 21 2022 4:49 PM

Tirupati MLA Bhumana Karunakar Reddy Meets CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శాసనసభలోని సీఎం కార్యాలయంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కలిశారు. మహాకవి గురజాడ అప్పారావు 160వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని భూమన కరుణాకర్‌రెడ్డి ఐదువేల కాపీలను ముద్రించారు. వీటిని సీఎం జగన్‌ బుధవారం ఆవిష్కరించారు.

ఈ కాపీలను విజయనగరంలోని గురజాడ ఇంటికి బహూకరించి.. సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు భూమన తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్, చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

చదవండి: (కరవు, బాబు ఇద్దరూ కవలలు: సీఎం జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement