సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను పకడ్బందీగా అమలు చేస్తోంది. తాజాగా కరోనా నివారణకు కేంద్రం చేసిన మరో సూచన అమల్లోకి తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధించింది. ఉమ్మివేయడం, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై నిషేధం విధిస్తూ.. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం వైఎస్ జగన్ సమీక్ష
తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment