రెవెన్యూ, విద్యుత్ శాఖల్లో అవినీతిపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదన
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ, విద్యుత్ శాఖల్లో అవినీతిని నిరోధించడానికి హైకోర్టు చేసిన సూచనలు, సలహాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. దీనికి సంబంధించి త్వరలోనే జీవో జారీ చేస్తామని వివరించింది. అయితే ముందు ముసాయిదా జీవోను తమ ముందుంచాలని.. దాన్ని పరి శీలించి మరిన్ని సూచనలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ చర్యలతో అవినీతి 75% తగ్గినా విజయం సాధించినట్లేనని వ్యాఖ్యాని స్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసిం ది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెవెన్యూ అధికారులు రైతుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారన్న పత్రికా కథనాన్ని హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
అవినీతి నిరోధానికి జీవో జారీ చేస్తాం
Published Tue, Feb 23 2016 2:45 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement