సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హయంలో తీసుకొచ్చిన మద్యం బ్రాండ్లపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. గత బాబు పాలనలో చిత్రవిచిత్రమైన మద్యం బ్రాండ్ల పేర్లను బయటకు తెచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మున్ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి బ్రాండ్లను సైతం తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ చమత్కరించారు.
ఈ క్రమంలోనే బాబు ప్రభుత్వం ఏ లిక్కర్ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చిందనే విషయాన్ని వైఎస్ జగన్ చదివి వినిపించారు.
బూం.. బూం బీర్
ప్రెసిడెంట్ మెడల్
గవర్నర్స్ ఛాయిస్
పవర్‌స్టార్ 999
రష్యన్ రోమనోవా
ఏసీబీ
999 లెజెండ్
హెవెన్స్ డోర్
క్రేజీ డాల్
క్లిఫ్ హ్యంగర్
నెపోలియన్
సెవెన్త్ హెవెన్
హైదరాబాద్ బ్రాండ్ విస్కీ
వీరా
బ్లామ్ డే
2019 మే నెలలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బ్రాండ్లు రిలీజ్ చేశారని ప్రస్తావించారు. అయితే అవన్నీ తరువాత వైఎస్సార్‌సీపీ హయాంలో వచ్చిన బ్రాండ్లంటూ అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లే తమ హయాంలో ఇచ్చామని, మార్చిందేమీ లేదని తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి దుష్ప్రచారం చేశారని విమర్శలు గుప్పించారు.. ప్రస్తుతం బాబు ఈ అయిదు నెలల్లోనూ అవే బ్రాండ్లు, అదే మద్యం ఇస్తున్నారని చెప్పారు.
గతంలో బాబు హయాంలో 4,380 మద్యం షాపులు ఉంటే వాటిని వైఎస్సార్‌సీపీ పాలనలో 2934కు తగ్గించామని తెలిపారు. బాబు హయాంలో 43 వేల బెల్ట్ షాప్‌లు నడిచేవని.. తమ ప్రభుత్వం వచ్చాక పర్మిట్ రూమ్‌లను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. లిక్కర్ షాప్‌లు ఎప్పటి వరకు నడపాలనే టైమింగ్‌ను కూడా తీసుకొచ్చామని చెప్పారు.
మద్యం మాఫియాకు సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే: వైఎస్ జగన్
20 డిస్టిలరీలకు గానూ 14కు లైసెన్స్‌లు ఇచ్చింది చంద్రబాబే
మా హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు.
మేం నాసిరకం మద్యం విక్రయించామని ప్రచారం చేశారు.
ఇప్పుడు నాణ్యమైన లిక్కర్ అంటూ ఊదరగొడుతున్నారు.
షాప్‌ల సంఖ్య తగ్గించి మద్యం అమ్మకాలు నియంత్రించాం.
ప్రభుత్వ మద్యం షాపులను చంద్రబాబు రద్దు చేశాడు.
ఇది నిజంగా పెద్ద స్కాం.
తన మద్యం మాఫియాకు మొత్తం షాపులు కట్టబెట్టాడు.
డిస్టలరీస్‌కు వాల్యూమ్స్ పెంచి కమీషన్లు తీసుకుంటున్నాడు.
ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.
త్వరలో బెల్ట్‌షాప్‌లు, పర్మిట్ రూమ్‌లు కూడా వచ్చేస్తాయి.
రూ.99కే మద్యం అన్నాడు.. ఇది కూడా స్కామే
Comments
Please login to add a commentAdd a comment