సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్‌ను రూ.75కు ఇస్తామని, కుదిరితే రూ.50కే ఇస్తామని ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన ప్రకటనపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘వాహ్.. ఎంత గొప్ప పథకం.. ఏపీ బీజేపీ అత్యంత నీచ స్థాయికి దిగజారడం ఎంత సిగ్గుచేటు’అని వ్యాఖ్యానించారు. ‘రూ.50కే చీప్ లిక్కర్‌ను సరఫరా చేయాలనే బంపర్ ఆఫర్.. కేవలం పార్టీకి అత్యంత నిరాశాజనక పరిస్థితులున్న రాష్ట్రాలకే బీజేపీ జాతీయ విధానం పరిమితమా?’అని ట్విట్టర్‌లో కేటీఆర్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment