సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు నేపథ్యంలో ఆమె తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే.
కాగా, ఆమె జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలా లేదా అనే అంశంపై మంగళవారం రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరే అవకాశం ఉంది.
ఇలావుండగా ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment