మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతోనే రైతులకు ఎరువుల కొనుగోలుకు రూ.4 వేలు ఇవ్వనున్నారని..
మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతోనే రైతులకు ఎరువుల కొనుగోలుకు రూ.4 వేలు ఇవ్వనున్నారని.. బెల్ట్‌షాపులు ఎలా మూస్తామని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎక్సైజ్ ఎస్సై విజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శంకరపట్నం అంబాల్‌పూర్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు గుడుంబా విక్రయ కేసులో మంగళవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
ఈ క్రమంలో గ్రామాల్లో గుడుంబా విక్రయాలు 90% తగ్గాయని, బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, వాటిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... ‘బెల్ట్ షాపులు ఎలా మూస్తాం. మద్యంతోనే రైతులకు రూ.4 వేలు ఇవ్వనున్నారు’ అన్నారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.