సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.మద్యం పాలసీ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. లిక్కర్ పాలసీ కేసులో కొనసాగుతున్న దర్యాప్తుల ముసుగులో సీబీఐ తనను వేధింపులకు గురిచేస్తోందని కేజజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ అధికారుల తీరు నిరాశ, ఆందోళన కలిగించే విషయమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 2023 ఏప్రిల్‌లో విచారణకు పిలిచినప్పుడు తాను సీబీఐకి సహకరించినట్లు గుర్తు చేశారు. అంతేకాదు, సీబీఐ అరెస్ట్ చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించారు. రిమాండ్ ఉత్తర్వులు చాలా సాధారణమైనవని, మొత్తం అరెస్ట్, విచారణ ప్రక్రియను నిర్విర్యం చేయడానికి దారితీస్తుందని కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌లో వెల్లడించారు.
కాగా, సీబీఐ అరెస్ట్, ట్రయల్ కోర్టు తనను సీబీఐ కస్టడీకి అప్పగించడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment