లక్నో : మద్యం విషయంలో చోటుచేసుకున్న గొడవ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. పెగ్ పోయలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన స్నేహితుడ్ని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని శామ్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శామ్లి జిల్లాకు చెందిన జస్బిర్ అనే వ్యక్తి ఐదు రోజుల క్రితం స్నేహితుడు క్రిష్ణపాల్‌తో కలిసి మద్యం తాగుతున్నాడు. ఈ నేపథ్యంలో క్రిష్ణపాల్ మద్యం అయిపోయింది. జస్బిర్‌ను ఓ పెగ్ పోయమని అడిగాడు. (చపాతీలు చల్లగా ఉన్నాయని డాబా యజమానిని కాల్చేశాడు)
తన దగ్గర కూడా మద్యం తక్కువగా ఉందని చెప్పి, బస్బిర్ ఇందుకు ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన క్రిష్ణపాల్ పదునైన ఆయుధంతో జస్బిర్‌ను హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ శుక్రవారం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఓ పెగ్ పోయనందుకే జస్బిర్‌ను హత్య చేసినట్లు క్రిష్ణపాల్ అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment