
న్యూఢిల్లీ: ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాట్లకు కావాల్సిన సీట్లను బీజేపీ గెలుచుకోలేదని ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎంతో మంది నిపుణులు, సెఫాలజిస్టులతో మాట్లాడనని చెప్పారు.
బీజేపీ ఈసారి కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, వెస్ట్‌బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో చాలా సీట్లు కోల్పోనున్నట్లు తెలిసిందన్నారు. ‘ఫోన్‌లో చాలా మంది సెఫాలజిస్టులతో మాట్లాడాను.
ప్రతి ఒక్కరు బీజేపీకి మెజారిటీ రాదనే చెబుతున్నారు. ఇక ఢిల్లీ విషయానికి వస్తే మొత్తం 7 ఎంపీ సీట్లలో బీజేపీ ఓడిపోతుంది. జూన్4న మోదీ అధికారం కోల్పోతారు. ఇండియూ కూటమి అధికారంలోకి వస్తుంది’అని కేజ్రీవాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment