
ప్రధాని మోదీ 75 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా ఆయన స్థానాన్ని భర్తీ చేయరు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మోదీని భర్తీ చేయాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని తాను గతంలోనే స్పష్టంగా చెప్పానట్లు అమిత్ షా గుర్తు చేశారు.
కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్ధులే కరువయ్యారన్న బీజేపీ నేతల వ్యాఖ్యలకు..బీజేపీలో నేతల పదవీ విరమణ వయస్సు 75. వచ్చే ఏడాది మోదీ వయస్సు 75కి చేరుతుందన్నారు.
నేను వాళ్లని ఒకటే అడగాలని అనుకుంటున్నాను. బీజేపీలో పదవీ విరమణ వయస్సు 75. వచ్చే ఏడాది మోదీ వయస్సు 75 దాటుతుంది అని అన్నారు. మరి మోదీ రిటైర్ అవుతున్నారా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అమిత్ షా పై విధంగా స్పందించారు.