న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ భవితవ్యం ఇవాళ సాయంత్రం తేలనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు విచారిస్తున్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈడీ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూ కోర్టు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆదేశాలు జారీ చేయనుంది. ఇప్పటికి అయిదుసార్లు ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరవలేదు. కోర్టు ఏం చెబుతుందో అనేదానిపై ఆమ్ ఆద్మీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.ఇదే కేసులో ఆమ్‌ఆద్మీపార్టీ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గత ఏడాది అరెస్టయి ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
ఇదీ చదవండి.. ఉత్తరాఖండ్‌లో ఈడీ రెయిడ్స్.. ఆ పార్టీ నేతలే టార్గెట్
Comments
Please login to add a commentAdd a comment