![America Responded On Dlehi Cm Kejriwal Arrest - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/26/arvindkejriwal.jpg.webp?itok=LSoWwqCl)
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారాన్ని గమనిస్తున్నామని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కేజ్రీవాల్ కేసులో పారదర్శక, న్యాయబద్ద, వేగవంతమైన విచారణ జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల శాఖకు సూచించినట్లు ఒక వార్తాసంస్థతో చెప్పారు. కాగా, ఇటీవలే కేజ్రీవాల్ అరెస్టు విషయంలో జర్మనీ స్పందించిన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఈ విషయంలో విదేశీ వ్యవహారల శాఖ భారత్‌లోని జర్మనీ రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది. ఈ క్రమంలోనే అమెరికా కూడా కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించడం చర్చనీయాంశమవుతోంది. అమెరికా అధికారి వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తున్నది కీలకంగా మారింది.
కాగా, ముడుపులు తీసుకుని లిక్కర్ పాలసీ రూపొందించడంలో ప్రధాన పాత్ర అరవింద్ కేజ్రీవాల్‌దేనన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చ్ 21న ఆయనను అరెస్టు చేసింది. తర్వాత ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ కేజ్రీవాల్‌ను ప్రవేశపెట్టింది. కోర్టు కేజ్రీవాల్‌ను మార్చ్ 28 దాకా ఈడీ కస్టడీకి ఇచ్చింది.
ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment