ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆయనకు కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం లభించలేదు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుతో సానుభూతి పొందేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మరి ఆయన స్వగ్రామంలోని ప్రజలు ఈ ఉదంతంపై ఏమనుకుంటున్నారు?
అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలోని హిసార్‌లో జన్మించారు. ప్రస్తుతం హిసార్‌లో కేజ్రీవాల్ బంధువులు నివసిస్తున్నారు. అతని బాల్య స్నేహితులు అక్కడే ఉన్నారు. అయితే సీఎం అరెస్ట్‌పై మీడియా ప్రశ్నలు సంధించినప్పుడు కొందరు మౌనంగా ఉన్నారు. కేజ్రీవాల్ చిన్ననాటి స్నేహితుడు గిరిధర్ లాల్ బన్సాల్ మాట్లాడుతూ కేజ్రీవాల్ నిజాయితీ గల వ్యక్తి అని, ఆయన అవినీతిపై పోరాడి సీఎం అయ్యారన్నారు. అయితే ఇప్పుడు అతన్ని జైల్లో పెట్టారు. అతనితో పాటు సిసోడియా, సంజయ్‌లను కూడా జైల్లో పెట్టారు. వీరంతా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు వీరిని అరెస్టు చేశారని గిరిధర్ ఆరోపించారు. అయితే కేజ్రీవాల్ ఈ ప్రాంతాన్ని అంతగా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
మా గ్రామానికి చెందిన కుర్రాడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడి సీఎం కావడం చాలా గర్వంగా ఉందని స్థానిక వ్యాపారి జగదీష్ ప్రసాద్ కేడియా అన్నారు. 2015లో సీఎం అయ్యాక తామంతా కేజ్రీవాల్ దగ్గరకు వెళ్లి ఆలయ నిర్మాణం కోసం విరాళాలు అడిగాం.. గంటపాటు మాట్లాడారేగానీ డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో మేమంతా షాక్ అయ్యామన్నారు. అనూప్ శర్మ అనే కార్మికుడు మాట్లాడుతూ కేజ్రీవాల్ హర్యానాకు ఏమీ చేయలేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment