responce
-
కేజ్రీవాల్ ఎలాంటివారు?.. స్వగ్రామస్తులు చెప్పిందిదే!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆయనకు కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం లభించలేదు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుతో సానుభూతి పొందేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మరి ఆయన స్వగ్రామంలోని ప్రజలు ఈ ఉదంతంపై ఏమనుకుంటున్నారు? అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలోని హిసార్‌లో జన్మించారు. ప్రస్తుతం హిసార్‌లో కేజ్రీవాల్ బంధువులు నివసిస్తున్నారు. అతని బాల్య స్నేహితులు అక్కడే ఉన్నారు. అయితే సీఎం అరెస్ట్‌పై మీడియా ప్రశ్నలు సంధించినప్పుడు కొందరు మౌనంగా ఉన్నారు. కేజ్రీవాల్ చిన్ననాటి స్నేహితుడు గిరిధర్ లాల్ బన్సాల్ మాట్లాడుతూ కేజ్రీవాల్ నిజాయితీ గల వ్యక్తి అని, ఆయన అవినీతిపై పోరాడి సీఎం అయ్యారన్నారు. అయితే ఇప్పుడు అతన్ని జైల్లో పెట్టారు. అతనితో పాటు సిసోడియా, సంజయ్‌లను కూడా జైల్లో పెట్టారు. వీరంతా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు వీరిని అరెస్టు చేశారని గిరిధర్ ఆరోపించారు. అయితే కేజ్రీవాల్ ఈ ప్రాంతాన్ని అంతగా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. మా గ్రామానికి చెందిన కుర్రాడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడి సీఎం కావడం చాలా గర్వంగా ఉందని స్థానిక వ్యాపారి జగదీష్ ప్రసాద్ కేడియా అన్నారు. 2015లో సీఎం అయ్యాక తామంతా కేజ్రీవాల్ దగ్గరకు వెళ్లి ఆలయ నిర్మాణం కోసం విరాళాలు అడిగాం.. గంటపాటు మాట్లాడారేగానీ డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో మేమంతా షాక్ అయ్యామన్నారు. అనూప్ శర్మ అనే కార్మికుడు మాట్లాడుతూ కేజ్రీవాల్ హర్యానాకు ఏమీ చేయలేదని ఆరోపించారు. -
సైనికుల ఘర్షణపై స్పందించిన చైనా.. ఏమందంటే?
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత్, చైనా సైనికుల నడుమ ఘర్షణ తెలెత్తడంతో మరోమారు సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. ఈ నెల 9న చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. మన సైన్యం వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనికుల ఘర్షణ తర్వాత తొలిసారి స్పందించింది చైనా. భారత్ సరిహద్దులో పరిస్థితులు ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా స్థిరంగా ఉన్నాయని ప్రకటించింది. ‘మాకు ఉన్న సమాచారం మేరకు చైనా-భారత్ సరిహద్దులో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. సరిహద్దు వివాదంపై ఇరు పక్షాలు దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నాయి.’ అని పేర్కొన్నారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్. తవాంగ్ సెక్టార్లో సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేశారు. చైనా కుతంత్రాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన ప్రకటన చేసిన కొద్ది సేపటికే చైనా స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్ జెట్స్ గస్తీ -
భారత్ లో ఫుట్ బాల్ ఎందుకు పాపులర్ కాలేదు..?
-
షీ ట్యాక్సీ ..స్పందన నాస్తి..
ఆదిలాబాద్: మహిళల భద్రతకు ప్రవేశపెట్టిన 24/7 షీ–ట్యాక్సీ పథకానికి జిల్లాలో ఆదరణ కరువైంది. దరఖాస్తు గడువు మార్చి 1తో ముగిసింది. సింగిల్ డిజిట్‌లోనే దరఖాస్తులు వచ్చాయి. ఆదరణ కరువా.. ప్రచార లోపమో.. తెలియదు కానీ జిల్లా మొత్తంగా కేవలం నాలుగు దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మహిళ డ్రైవర్లుగా ట్యాక్సీలు నడిపేందుకు ప్రభుత్వం సబ్సిడీపై కార్లను అందజేస్తోంది. మహిళలు, విద్యార్థినులు, ఒంటరిగా ప్రయాణం చేసే యువతులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా వివిధ ప్రదేశాలకు వెళ్లేందుకు మహిళ డ్రైవర్ల ద్వారా వారి గమ్యస్థానానికి చేర్చేందుకు ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మెట్రో నగరాల్లోనే దీనికి ఆదరణ ఉంటుందని, పట్టణాల్లో దీనిపై ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రచార లోపమే కారణమా.. మహిళ, శిశు సంక్షేమ శాఖ, రవాణ శాఖల ద్వారా భారతీయ స్టేట్ బ్యాంక్ సౌజన్యంతో మహిళ డ్రైవర్లుగా ఆసక్తి ఉన్న అభ్యర్థినులకు షీ–టీమ్ స్కీమ్ ద్వారా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి 35శాతం సబ్సిడీ, 10శాతం మార్జిన్ మనీ మొత్తం కలిపి 45శాతం సబ్సిడీ అందచేస్తారు. మిగితా మొత్తం అభ్యర్థినిలే వెచ్చించాలి. ఆ అభ్యర్థులకు యాశోద దీదీత ఫౌండేషన్ ద్వారా సాంకేతిక శిక్షణ ఇప్పిస్తారు. ఆసక్తి ఉన్న మహిళలు మొదట దరఖాస్తు చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్ తర్వాత వాహనం సమకూర్చుతారు. ఈ పథకంపై సరైన ప్రచారం లేక దరఖాస్తుకు ముందుకు రాలేదు. మహిళ, శిశు సంక్షేమ శాఖాధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమై చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. అసలు ఈ పథకంపై ఈ శాఖలోని వివిధ ప్రాజెక్టు అధికారిణిలకే అవగాహన లేకపోవడం గమనార్హం. ఆయా ప్రాజెక్టుల్లోని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ఈ పథకానికి సంబంధించి ప్రచారం చేపట్టి ఉంటే దరఖాస్తుదారుల సంఖ్య అధికంగా ఉండేదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. పట్టణంలో ఆదరణ తక్కువే షీ–ట్యాక్సీ పథకానికి జిల్లాలో అభ్యర్థులు ఆసక్తి కనబర్చలేదు. ప్రధానంగా మెట్రో నగరాల్లో దీనికి డిమాండ్ ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులకు 45శాతం సబ్సిడీ వర్తించనుంది. అదేవిధంగా శిక్షణ కూడా ఇస్తాం. – మిల్కా, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి, ఆదిలాబాద్ చదవండి: మరోసారి కరోనా విజృంభణ.. 14 వరకు కర్ఫ్యూ -
8 నిమిషాలు! సిటీ పోలీసు రెస్పాన్స్ టైమ్ ఇదీ
సాక్షి, సిటీబ్యూరో: ఓ నేరం బారినపడిన, సహాయం అవసరమైన వ్యక్తి నుంచి పోలీసులకు ఫోల్ కాల్ వచ్చినప్పుడు ఎంత తొందరగా వారి వద్దకు చేరుకోగలిగితే... అంత తక్కువ నష్టం, ఎక్కువ మేలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘పోలీస్ రెస్పాన్స్ టైమ్’ అంటారు. గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం... వీలైనంత తక్కువ సమయంలో ఘటనాస్థలికి చేరుకోవడం... నేరాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే పెట్రోలింగ్ జరిగేలా చూడటం... ఈ లక్ష్యాలే ప్రధాన అజెండాగా రక్షక్, బ్లూకోల్ట్స్లకు ‘హైదరాబాద్ రెస్పాన్స్ టైమ్’ నిర్థారిస్తున్నారు. దీనికోసం ప్రస్తుతం ఉన్న గస్తీ వాహనాలను ‘డయల్–100’తో అనుసంధానించారు. నగరంలో మొదటి ఆరు నెలలకు సంబంధించి ఈ రెస్పాన్స్ టైమ్ సగటున ఎనిమిది నిమిషాలుగా ఉంది. టాప్‌టెన్ ఠాణాల్లో ఉన్న పంజగుట్ట 3.26 నిమిషాలు, నారాయణగూడ 3.39 నిమిషాలు, అబిడ్స్ పోలీసులు 3.57 నిమిషాలుగా నమోదైంది. ఒకప్పుడు ఇలా... నగరంలోని బాధితుడెవరైనా సహాయం కోసం ‘100’కు ఫోన్ చేస్తే... అది నేరుగా ఈఎంఆర్ఐ ఆధీనంలో ఉన్న ‘డయల్–100’కు చేరుకునేది. అక్కడి సిబ్బంది విషయం తెలుసుకుని.. బాధితుడు ఏ ఠాణా పరిధిలోకి వస్తాడో వాకబు చేసేవారు. ఆ తర్వాత సదరు ఫోన్ కాల్లోని అంశాలను టెక్టŠస్‌గా మార్చి బాధితుడున్న ప్రాంతం పరిధిలోకి వచ్చే ఠాణాతో పాటు జోన్ కార్యాలయం, కమిషనరేట్‌కు చెందిన ప్రధాన కంట్రోల్ రూమ్‌లోని కంప్యూటర్లకు పంపేవారు. దీంతోపాటు వాకీటాకీ ద్వారానూ సందేశం ఇవ్వడం ద్వారా గస్తీ వాహనాలను అప్రమత్తం చేసేవారు. ఈ సమాచారం అందుకునే గస్తీ సిబ్బంది ఎక్కడ ఉన్నారు? బాధితుడికి ఎంత దూరంలో ఉన్నారు? తదితర అంశాలు తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. దీంతో ఆయా గస్తీ వాహనాల్లోని సిబ్బంది చెప్పిన అంశాల పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఫలితంగా గస్తీ వాహనం బాధితుడి వద్దకు చేరే సమయం చాలా ఎక్కువగా ఉండేది. కొన్నిసార్లు అరగంట, గంట కూడా పట్టేది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో పాటు నేరస్తులు తప్పించుకునేవారు. ‘100’ కార్యకలాపాలు హైటెక్‌గా... గస్తీ సిబ్బందికి సైతం ట్యాబ్స్ అందించారు. వీటి ఆధారంగా ‘డయల్–100’ను గస్తీ వాహనాలతో అనుసంధానించారు. ఫలితంగా రెస్పాన్స్టైమ్ గణనీయంగా తగ్గడం తోపాటు సాంకేతికత పెరిగింది. ప్రస్తుతం ఇలా... ♦ ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు ‘100’కు ఫోన్ చేసి సçహాయం కోరిన వెంటనే అక్కడి సిబ్బంది సదరు ఫిర్యాదుదారుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ♦ ప్రతి గస్తీ వాహనంలో ఉన్న ట్యాబ్‌లోని జీపీఎస్ ఆధారంగా ‘100’ సిబ్బందికి ఏ వాహనం ఏ ప్రాంతంలో ఉందో కంప్యూటర్ తెర ద్వారా కచ్చితంగా తెలుస్తోంది. ♦ దీంతో బాధితుడు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ ఫోన్‌కా ల్ను మళ్లిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం కేవలం కొన్ని సెకన్లలో పూర్తవుతుంది. ♦ పెట్రోలింగ్ వాహనాల్లో ఉండే సిబ్బంది ఫోన్లకు ‘100’ నుంచి డైవర్డ్ అయిన కాల్ వస్తే... ప్రత్యేక రింగ్‌టోన్ వస్తుంది. ఫోన్ ఎక్కడి నుంచి అనేది తేలిగ్గా తెలియడం కోసం అన్ని వాహనాల్లోని సిబ్బందికీ ఇలాంటి టోన్ ఏర్పాటు చేశారు. ♦ ఫోన్ ఎత్తిన వెంటనే అతడి ట్యాబ్ తెరపై ఓ నోటిఫికేషన్ ప్రత్యక్షమవుతుంది. అందులో బాధితుడు/ఫిర్యాదుదారుడికి సంబంధించిన అంశాలు, ఫిర్యాదు ఏమిటన్నది కనిపిస్తాయి. గస్తీ వాహనంలోని సిబ్బంది ‘రిసీవ్డ్’ అనే బటన్ నొక్కడం ద్వారా ఫిర్యాదు అందుకున్నట్లు ఎక్నాలెడ్జ్ చేస్తారు. ♦ ఒకసారి ఎక్నాలెడ్జ్ చేసినప్పటి నుంచి ‘రెస్పాన్స్ టైమ్’ లెక్కింపు ప్రారంభమవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకునే గస్తీ వాహనాలు ఫిర్యాదు తీరును బట్టి అవసరమైన రీతిలో స్పందిస్తున్నాయి. ♦ ఏదైనా ప్రమాదం జరిగినట్లైతే క్షతగాత్రుల కు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు మొత్తం వ్యవహారాన్ని ఆధారాల కోసం ఫొటోలు తీసుకుంటున్నారు. ♦ పబ్లిక్ ప్లేసుల్లో జరిగే గొడవలు, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదుపై స్థానిక పోలీసు అధికారుల్ని అప్రతమత్తం చేయడంతో పాటు ఘటనాస్థలాల్ని వీడియోలో చిత్రీకరించి తదుపరి చర్యలు చేపడుతున్నారు. ♦ సహాయక చర్యలు, తదుపరి యాక్షన్స్ తీసుకోవడం పూర్తయిన వెంటనే సదరు ఫొటో లు, వీడియోలను ఆన్లైన్ ద్వారానే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు పంపిస్తారు. ♦ ఈ తంతంగాలన్నీ పూర్తయిన తర్వాత తొలుత వచ్చిన నోటిఫికేషన్‌ను మళ్లీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో ఉండే ‘కాల్ క్లోజ్’ బటన్ నొక్కడంతో ‘రెస్పాన్స్ టైమ్’ పూర్తవుతుంది. ♦ ఫోన్ కాల్ వచ్చిన దగ్గర నుంచి ఆద్యంతం జరిగే ప్రతి అంకం ‘డయల్–100’తో పాటు కమిషనరేట్ కంట్రోల్ రూమ్, జోనల్ కార్యాలయాలకు చేరుతాయి. కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది ప్రతి ఉదంతానికి సంబంధించిగస్తీ వాహనాలు ‘రిసీవ్డ్’ బటన్ నొక్కడానికీ, ‘కాల్ క్లోజ్డ్’ బటన్ నొక్కడానికి మధ్య కాలాన్ని లెక్కిస్తారు. ♦ ఇలా ఏ వాహనానికి ఆ వాహనం ‘రెస్పాన్స్ టైమ్’తో పాటు నగర వ్యాప్తంగా అన్ని వాహనాల సరాసరిని తీసుకుంటూ ‘హైదరాబాద్ రెస్పాన్స్ టైమ్’ను నిర్థారిస్తున్నారు. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మెరుగైన సేవలు అందిస్తున్నట్లు లెక్క. ♦ రెస్పాన్స్ టైమ్ ఎక్కువగా తీసుకున్న వాహనాల్లోని సిబ్బందిని జవాబుదారీ చేస్తున్నారు. ఆలస్యానికి కారణం ఏంట న్నది తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ‘రెస్పాన్స్’లో టాప్‌టెన్ ఠాణాలివీ.. పోలీసుస్టేషన్ రెస్పాన్స్ టైమ్ పంజగుట్ట 3.26 నిమిషాలు నారాయణగూడ 3.39 నిమిషాలు అబిడ్స్ 3.57 నిమిషాలు ఫలక్‌నుమ 4.04 నిమిషాలు ఛత్రినాక 4.12 నిమిషాలు బంజారాహిల్స్ 4.47 నిమిషాలు ఎస్సార్‌నగర్ 5.51 నిమిషాలు గాంధీనగర్ 6.46 నిమిషాలు కంచన్‌బాగ్ 7.29 నిమిషాలు బేగంపేట 7.44 నిమిషాలు సిటీ యావరేజ్ 8 నిమిషాలు -
పద్మాలకు 50వేల దరఖాస్తులు
న్యూఢిల్లీ: ఈసారి పద్మ అవార్డుల ఎంపికకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2014లో తొలిసారి ప్రజల నుంచి నామినేషన్లను ఆహ్వానించినప్పుడు 2,200 మాత్రమే కాగా, 2019లో ఆ సంఖ్య 50,000కు చేరుకుందని వ్యాఖ్యానించారు. సమాజంపై, ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావం చూపిన వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు, వ్యక్తులకు ఈసారి అవార్డులు వరించాయని అభిప్రాయపడ్డారు. ఈసారి తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 12 మంది రైతులు పద్మ అవార్డులను అందుకున్నారు. వీరిలో అత్యాధునిక పద్ధతులు సాంకేతికత పాటించినందుకు భారత్ భూషణ్ త్యాగి, రామ్‌శరణ్ వర్మతో పాటు సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న కమలా పూజారీ, రాజ్‌కుమారీ దేవి, బాబూలాల్ దహియా, హుకుమ్‌చంద్ పటీదార్ ఉన్నారు. వీరితో పాటు కన్వల్ సింగ్ చౌహాన్(మష్రూమ్, మొక్కజొన్న సాగు), వల్లభ్‌భాయ్ వస్రమ్‌భాయ్(క్యారట్ సాగు), జగదీశ్ ప్రసాద్(క్యాలీఫ్లవర్), సుల్తాన్ సింగ్(చేపల పెంపకం), నరేంద్ర సింగ్(పాడిపశువుల పునరుత్పత్తి)లకు పద్మ అవార్డులు దక్కాయి. వైద్య రంగానికి సంబంధించి 11 రాష్ట్రాల నుంచి 14 మంది వైద్యులను కేంద్ర పద్మ అవార్డులతో సత్కరించింది. పేదలకు నామమాత్రపు ఫీజుకే, కొన్నిసార్లు ఉచితంగా చికిత్స అందజేస్తున్న శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ(జార్ఖండ్), స్మిత, రవీంద్ర కోల్హే(మహారాష్ట్ర), ఆర్వీ రమణి(తమిళనాడు)లకు పద్మ అవార్డులు వరించాయి. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సేవలను కొనసాగిస్తున్న సెరింగ్ నోర్బూ(లడఖ్), ఇలియాజ్ అలీ(అస్సాం), అశోక్ లక్ష్మణ్‌రావ్ కుకడే(లాతూర్–మహారాష్ట్ర) పద్మ పురస్కారాలను దక్కించుకున్నారు. వీరితో పాటు ప్రతిష్టాత్మక వైద్య సంస్థలకు చెందిన జగత్‌రామ్(పీజీఐఎంఈఆర్ డైరెక్టర్–చండీగఢ్), షాదాబ్ మొహమ్మద్(కింగ్ జార్జ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం–లక్నో), సందీప్ గులేరియా(ఎయిమ్స్–ఢిల్లీ), మమ్మెన్ చాందీ(టాటా మెడికల్ సెంటర్ డైరెక్టర్–కోల్‌కతా) పద్మ అవార్డులను అందుకున్నారు. పద్మ పురస్కారాలు పొందినవారిలో సోషలిస్ట్ నేత హుకుమ్దేవ నారాయణ్ యాదవ్, గిరిజన నేత కరియాముండా, సిక్కు నేత సుఖ్‌దేవ్ సింగ్, మహాదళిత్ మహిళా నేత భగీరథి దేవి, 1984 అల్లర్ల బాధితుల తరఫున పోరాడుతున్న లాయర్ హర్విందర్ సింగ్ ఫూల్కా ఉన్నారు. -
వీళ్లంతా మీ ఫొటో తీస్తున్నారేందుకు..?!
లండన్ : అప్పుడప్పుడు చిన్న పిల్లలు అడిగే అమాయకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత తేలికేం కాదు. అలాంటి సందర్భాల్లో చాలామంది ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తారు. ఇదే పరిస్థితి బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్కి ఎదురయ్యింది. కానీ ఆమె చెప్పిన సమాధానం ఆ చిన్నారినే కాక నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. ఈమధ్యే ప్రసూతి సెలవులు ముగించుకున్న కేట్ మిడిల్టన్ వెస్ట్ లండన్‌లో సయేర్స్ క్రాఫ్ట్స్ ఫారెస్ట్ స్కూల్‌ని, వైల్డ్ లైఫ్ గార్డెన్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు కేట్‌ని ఫొటో తీయడానికి పోటీ పడ్డారు. ఈ హడావుడి చూసిన పిల్లలకు ‘ఏంటి ఈమె ప్రత్యేకత.. అందరు ఎందుకు ఈమెని ఫొటో తీయడానికి ఇంతలా పోటీ పడుతున్నారు’ అనే అనుమానం మొదలయ్యింది. సందేహం అయితే వచ్చింది కానీ ఎవరూ దాన్ని బయటపెట్ట లేదు. కానీ ఓ చిన్నారి మాత్రం ధైర్యంగా ‘వీళ్లంతా ఎందుకు మిమ్మల్ని ఫోటో తీస్తున్నారు’ అని కేట్‌ని అడిగింది. అందుకు యువరాణి నవ్వుతూ ‘వారంతా నన్ను ఫొటో తీయడం లేదు.. నిన్ను ఫొటో తీస్తున్నారు. ఎందుకంటే నువ్వు చాలా ప్రత్యేకం కదా’ అంటూ సమాధానం చెప్పారు. కేట్ చెప్పిన సమాధానం ఆ చిన్నారినే కాక అక్కడున్న వారిని కూడా సంతోషపెట్టింది. కేట్ సమాధానం విన్న నెటిజన్లు ‘ఎంతైనా ముగ్గురు పిల్లలకు తల్లి కదా..! పిల్లలతో ఎలా ప్రవర్తించాలో బాగానే తెలిసి ఉంటుందం’టూ ప్రశంసిస్తున్నారు. అంతేకాక ‘అవును మరి అంత చిన్న బుర్రకు కేట్ యువరాణి అని.. అందుకే ఫొటో తీస్తున్నారంటే ఎలా అర్థమవుతుంది.. అర్థమవ్వకపోగా మరిన్ని సందేహాలు తలెత్తే అవకాశం ఉందం’టూ కామెంట్ చేస్తున్నారు. -
ఉపాధి..ఊపందుకుంది
ఖమ్మం మయూరిసెంటర్ : ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో రెండు వారాల క్రితం మందకొడిగా సాగిన పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దాదాపు పూర్తి కావడం.. ఖరీఫ్ సీజన్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో కూలీలు ఉపాధి పనులకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. నిన్న మొన్నటి వరకు రబీలో వరి, మొక్కజొన్న పంటలకు సంబంధించిన పనులు ఉండడంతో అటువైపు వెళ్లేందుకు మక్కువ చూపారు. ప్రస్తుతం సాగు పనులన్నీ పూర్తికావడంతో కూలీలు ఉపాధి పనులను ఆశ్రయించారు. జిల్లాలో ఉపాధిహామీ పనులను రోజుకు లక్ష మంది కూలీలు వినియోగించుకుంటున్నారు. కందకాలు తవ్వడం, సైడ్ కాల్వలు, ఫాం పాండ్స్, పొలాల గట్లు చదును చేయడం, రోడ్లు వేయడం, మిషన్ కాకతీయ వంటి పనులు చేపడుతున్నారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలపాటు వీరు ఆయా పనులు చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు కూడా అధిక సంఖ్యలో పనులను వినియోగించుకుంటున్నారు. ఎటువంటి పనులు లేని సమయంలో కూలీలకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. ఈ సమయంలోనే కూలీలు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిదినాలు పెంచింది. ఈ మేరకు కూలీలకు పనిదినాలు అందుబాటులో ఉండడంతో ఒకే కుటుంబంలో ఇద్దరి నుంచి నలుగురి వరకు పనులకు వెళ్తున్నారు. ఎండలు లెక్కచేయకుండానే.. నిన్న, మొన్నటి వరకు ఉపాధి పనులను కూలీలు అంతగా వినియోగించుకోలేదు. ఒకవైపు వ్యవసాయ పనులు.. మరోవైపు ఎండలు మండిపోతుండడంతో ఉపాధి పనులు జిల్లాలో నత్తనడకన సాగాయి. దీంతో లక్ష్యం మేరకు పనిదినాలు పూర్తి కావని అధికారులు భావించారు. దీనికి తోడు ఉపాధి పనులకన్నా ఇతర కూలి పనులకు వెళ్తే డబ్బులు ఎక్కువగా వస్తుండడంతో ఉపాధి పనుల వైపు కన్నెత్తి చూడలేదు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ముగియడంతో చేసే పనులు లేక.. ఇంట్లో ఉంటే పూట గడిచే పరిస్థితులు లేకపోవడంతో కూలీలు ఉపాధి పనుల బాట పట్టారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్కచేయకుండా కూలీలు పనులకు వెళ్తున్నారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురు పనులకు వెళ్తే కుటుంబం గడుస్తుందనే ఉద్దేశంతో ఇల్లు గడవాలంటే.. ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన విద్దిగాని వెంకన్న కుటుంబం మొత్తం ఉపాధి పనులకు వెళ్తోంది. గతంలో వెంకన్న కల్లు గీత కార్మికుడిగా కుల వృత్తి చేసుకునేవాడు. అయితే ఆయనకు ఓ ప్రమాదంలో కాలు విరగడంతో పూర్తిగా తొలగించారు. ఇక తాటిచెట్టు ఎక్కే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఉపాధిహామీ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. ఉపాధి పథకంలో వికలాంగులకు ప్రత్యేకంగా పనులు ఉండడంతో వాటిని వెంకన్న ఉపయోగించుకుంటున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉపాధిహామీ పనులకు వెళ్తూ జీవిస్తున్నారు. పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పొట్ట నింపుకోవడానికి పనులు చేస్తున్నామని, తమకు వేతనాలు త్వరగా వచ్చేలా చూడాలని కూలీలు కోరుతున్నారు. రక్షణ చర్యలు చేపడుతున్న అధికారులు వేసవి తాపం నుంచి కూలీలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. అయితే ఆ సౌకర్యాలు ఇప్పటివరకు అంతంత మాత్రంగానే అమలు జరిగాయి. ప్రస్తుతం కూలీలు కూడా పనులకు పోటీపడి వస్తుండడంతో అధికారులు రక్షణ చర్యలు కూడా చేపడుతున్నారు. స్థానిక ఉపాధిహామీ సిబ్బంది కూలీలకు నీడ కోసం పట్టాలు, మంచినీటి సౌకర్యం, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. దీంతో కూలీలు కూడా ఉపాధి పనులను వినియోగించుకునేందుకు ముందుకొస్తున్నారు. సౌకర్యాలు కల్పిస్తున్నాం.. జిల్లాలో ఉపాధి పనికి వచ్చే కూలీల సంఖ్య పెరిగింది. జిల్లా లక్ష్యానికి అనుగుణంగా కూలీల సంఖ్య మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే వ్యవసాయ పనులు పూర్తిగా ముగియడంతో కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు. కూలీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నాం. కూలీల రక్షణకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఈ వారం కూలీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా రాష్ట్రంలోనే ఉపాధి పనుల్లో మెరుగైన స్థానాన్ని సంపాదించుకుంది. – బి.ఇందుమతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉద్యోగం దొరికే వరకు.. డిగ్రీ పూర్తయింది. ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నా. చిరుద్యోగం కూడా దొరకకపోవడంతో ఖాళీగా ఉండలేక ఉపాధి పనులకు వెళ్తున్నా. ఉపాధి పనికి వెళ్లడం వల్ల ఇంట్లో ఖర్చులకు కొంత ఆసరా దొరుకుతుంది. ఈ ఏడాది పని ప్రదేశాల్లో సౌకర్యాలు పెంచడంతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి పనులకు వెళ్తున్నా. ఉద్యోగం దొరికే వరకు ఉపాధి పనులకు వెళ్తాను. – నరేందర్, నిరుద్యోగి -
48 గంటల్లో నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో జరుగు తున్న అవినీతిపై ‘సాక్షి’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం సంచలనం సృష్టిస్తోంది. ‘డబుల్’ఇళ్ల అక్రమాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వ్యవహారంపై 48 గంటల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్‌ను ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం, పలువురు ఎమ్మెల్యేలు, వారి అనుచరుల్లో వణుకు మొదలైంది. హుటాహుటిన రంగంలోకి.. సీఎం కేసీఆర్ ఆదేశించిన మరుక్షణమే ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబ్‌నగర్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో విచారణ ప్రారంభించాయి. ఈ జిల్లాల్లో నిర్మాణం పూర్తయిన ఇళ్లెన్ని, ఎంత మందికి కేటాయింపులు చేశారు, ఏవిధంగా కేటాయింపులు జరిపారన్న అంశాలపై రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నాయి. అక్రమాలు వెలుగులోకి వచ్చిన జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై విచారణ జరిపేందుకు డీఎస్పీ ర్యాంకు అధికారులను ఇంటెలిజెన్స్ విభాగం నియమించింది. నాలుగు అంశాలపై ప్రధాన విచారణ డబుల్ బెడ్రూం ఇళ్ల వ్యవహారంలో ప్రధానంగా నాలుగు అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. లాటరీ పద్ధతి ద్వారా కాకుండా నేరుగా కేటాయింపులు ఎక్కడెక్కడ చేశారు, ఈ విధమైన కేటాయింపులను ప్రోత్సహించిన ఎమ్మెల్యేలెవరు, వారి అనుచరులెవరు, ప్రభుత్వ భూమి లేనిచోట, ప్రైవేట్ భూములను ఏ విధంగా కొనుగోలు చేశారు, అవి ఎంత మంది చేతులు మారాయి? అన్న అంశాలపై విచారణ జరపాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. పలువురు ఎమ్మెల్యేల్లో వణుకు! ఇళ్ల కేటాయింపులు జరపడం రెవెన్యూ విభాగం పనే అయినా.. లాటరీ పద్ధతి కాకుండా దళారుల మధ్యవర్తిత్వం, అనుచరుల ఒత్తిడితో కేటాయింపులు చేసిన అధికార çపార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జుల్లో వణుకు మొదలైంది. భారీగా డబ్బులు దండుకుని అనర్హులకు ఇళ్లు కేటాయించిన వ్యవహారంపై క్రిమినల్ కేసులకు కూడా వెళ్లేందుకు అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక రెవెన్యూ విభాగం తరఫున కేటాయింపుల్లో పాత్రధారులుగా ఉన్న ఎమ్మార్వోలకు కూడా సస్పెన్షన్ భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. సెలవుపై ఎమ్మార్వో.. ఉన్నతాధికారులు భద్రాచలంలో ఇళ్ల కేటాయింపు అక్రమాలకు సంబంధించి అక్కడి ఎమ్మార్వోను దీర్ఘకాలిక సెలవులో పంపించినట్టు తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెం సబ్ కలెక్టర్‌ను ఈ వ్యవహారంపై విచారణాధికారిగా నియమించినట్టు అక్కడి కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఇక పలు జిల్లాల్లో డబుల్ ఇళ్ల అక్రమాలకు సంబంధించి కొందరు అధికారులపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైనట్టు నిఘావర్గాలు పేర్కొన్నాయి. 10 మంది అనర్హుల గుర్తింపు భద్రాచలం : భద్రాచలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో 10 మంది అనర్హులను అధికారులు గుర్తించారు. డబుల్ ఇళ్ల అవకతవకలపై ‘సాక్షి’ ప్రచురితమైన కథనంతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ స్పందించి.. భద్రాచలంలో ఇళ్ల కేటాయింపుపై సమగ్ర వివరాలను తెప్పించుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. 10 మంది అనర్హులను గుర్తించామని, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులను సంప్రదించామని సబ్‌కలెక్టర్ పమెలా సత్పత్తి వెల్లడించారు. -
‘ఆ మహిళ అసత్య ప్రచారం చేస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : సెల్ఫీ అడిగినందుకు దుర్భాషలాడుతూ.. తన కుమారుడి ఫోన్ పగలగొట్టిందని ఓ మహిళ స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ట్విటర్ వేదికగా అనసూయ స్పందించారు. ఆ మహిళ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. ‘ఈ రోజు ఉదయం తార్నాకలో నివసించే మా అమ్మగారి వద్దకు వెళ్లాను. ఇంటి నుంచి బయటికి రాగానే ఆ మహిళ, అబ్బాయి మొబైల్లో వీడియో తీస్తున్నారు. నా దగ్గరికి వచ్చి సెల్ఫీ అడిగారు. కానీ ఆ సమయంలో సెల్ఫీ దిగేందుకు సిద్దంగా లేకపోవడంతో తిరస్కరించాను. అయినా వారు వినిపించుకోకుండా నన్ను విసిగించారు. నేను నా ముఖాన్ని దాచుకుంటూ నా కారులో కూర్చున్నా. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. దురదృష్టవశాత్తు ఆ మహిళ ఫోన్ పగిలిపోయింది. కానీ ఆ మహిళ అసత్య వార్తలను ప్రచారం చేస్తుంది’ అని తెలిపారు. మొబైల్ పగిలినందుకు క్షమాపణలు తెలుపుతున్నానని, కానీ నాపై నిందలు వేయడం పద్దతి కాదన్నారు. తనకి కూడా వ్యక్తిగత స్వేచ్చ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు కూడా సాటి మనషులేననే విషయం మరిచిపోతున్నామన్నారు. వారికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని, అది మరిచిపోయి కొంత మంది ఎందుకు ప్రతి విషయాన్ని పెద్దది చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక తన కుమారుడి ఫోన్ పగలగొట్టిందని, దుర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
లైసెన్స్ రద్దు చేయమన్నా.. స్పందించరేం!
కర్నూలు(అగ్రికల్చర్): నిబంధనలకు విరుద్ధంగా పురుగుమందుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న హైదరాబాద్ కెమికల్స్ లైసెన్స్ రద్దు చేయాలని అంతర్జిల్లా స్క్వాడ్ సూచనలను వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదు. కర్నూలులో అంతర్ జిల్లా స్క్వాడ్ రెండు రోజుల పాటు ఎరువులు, పురుగుమందుల దుకాణాలు, విత్తన కంపెనీలను తనిఖీ చేసింది. హైదరాబాద్ కెమికల్స్ పురుగుమందుల కంపెనీ నెల రోజుల క్రితం వరకు నంద్యాల కేంద్రంగా వ్యాపారాన్ని చేపట్టింది. ఇటీవలనే కర్నూలుకు వ్యాపారాన్ని మార్చింది. ఇందుకు అనుగుణంగా లైసెన్స్ తీసుకున్నారు. అయితే ప్రిన్స్‌పుల్ సర్టిఫికెట్లో కర్నూలు గోదామును చూపకుండా నంద్యాల పేరుతోనే వ్యాపారం నిర్వహిస్తుండటాన్ని స్క్వాడ్ అధికారులు తప్పు పట్టారు. గోదాములో ఉన్న కోటి రూపాయల విలువ చేసే పురుగుమందుల అమ్మకాలను నిలిపివేస్తు లైసెన్స్‌ను కూడ రద్దు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. అదే విధంగా కర్నూలు కొత్త బస్టాండు సమీపంలోని రాజశేఖర్‌రెడ్డి ఫర్టిలైజర్‌లో లైసెన్స్‌లో మూడు కంపెనీల ఎరువుల అమ్మకాలకు ఓ పామ్ ఇంక్లూజన్ లేకపోవడంతో రూ.46 లక్షల విలువ ఎరువుల అమ్మకాలను నిలిపివేవారు. ఈ షాపు ౖలñ సెన్స్ రద్దు చేయాలని స్క్వాడ్ ఆదేశించింది. మరో షాపు లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించింది. వ్యవసాయాధికారులు హైద్రాబాద్ కెమికల్స్ లైసెన్స్‌తో పాటు షాపుల లైసెన్స్‌లు రద్దు చేయడానికి చొరవ చూపడం లేదు.