లైసెన్స్ రద్దు చేయమన్నా.. స్పందించరేం!
Published Thu, Aug 4 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
కర్నూలు(అగ్రికల్చర్): నిబంధనలకు విరుద్ధంగా పురుగుమందుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న హైదరాబాద్ కెమికల్స్ లైసెన్స్ రద్దు చేయాలని అంతర్‌జిల్లా స్క్వాడ్ సూచనలను వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదు. కర్నూలులో అంతర్ జిల్లా స్క్వాడ్ రెండు రోజుల పాటు ఎరువులు, పురుగుమందుల దుకాణాలు, విత్తన కంపెనీలను తనిఖీ చేసింది. హైదరాబాద్ కెమికల్స్ పురుగుమందుల కంపెనీ నెల రోజుల క్రితం వరకు నంద్యాల కేంద్రంగా వ్యాపారాన్ని చేపట్టింది. ఇటీవలనే కర్నూలుకు వ్యాపారాన్ని మార్చింది. ఇందుకు అనుగుణంగా లైసెన్స్ తీసుకున్నారు. అయితే ప్రిన్స్‌పుల్ సర్టిఫికెట్‌లో కర్నూలు గోదామును చూపకుండా నంద్యాల పేరుతోనే వ్యాపారం నిర్వహిస్తుండటాన్ని స్క్వాడ్ అధికారులు తప్పు పట్టారు. గోదాములో ఉన్న కోటి రూపాయల విలువ చేసే పురుగుమందుల అమ్మకాలను నిలిపివేస్తు లైసెన్స్‌ను కూడ రద్దు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. అదే విధంగా కర్నూలు కొత్త బస్టాండు సమీపంలోని రాజశేఖర్‌రెడ్డి ఫర్టిలైజర్‌లో లైసెన్స్‌లో మూడు కంపెనీల ఎరువుల అమ్మకాలకు ఓ పామ్ ఇంక్లూజన్ లేకపోవడంతో రూ.46 లక్షల విలువ ఎరువుల అమ్మకాలను నిలిపివేవారు. ఈ షాపు ౖలñ సెన్స్ రద్దు చేయాలని స్క్వాడ్ ఆదేశించింది. మరో షాపు లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించింది. వ్యవసాయాధికారులు హైద్రాబాద్ కెమికల్స్ లైసెన్స్‌తో పాటు షాపుల లైసెన్స్‌లు రద్దు చేయడానికి చొరవ చూపడం లేదు.
Advertisement
Advertisement