ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి 5 డిమాండ్లు | India Alliance Five Demands Listed Out By Priyanka Gandhi In Rally | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌, సోరేన్‌లను వెంటనే విడుదల చేయాలి: ఇండియా కూటమి

Published Sun, Mar 31 2024 7:00 PM | Last Updated on Sun, Mar 31 2024 7:03 PM

India Alliance Five Demands Listed Out By Priyanka Gandhi In Rally - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరేన్‌లను వెంటనే విడుదల చేయాలని ఇండియా కూటమి డిమాండ్‌ చేసింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఢిల్లీలో ఆదివారం(మార్చ్‌ 31) భారీ సభ నిర్వహించిన ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేసింది. ఈ డిమాండ్లను కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ చదివి వినిపించారు.

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలని ఎన్నికల కమిషన్‌(ఈసీ)ని కూటమి డిమాండ్‌ చేసింది. ఎన్నికల్లో సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని ఈసీ అడ్డుకోవాలి. సీఎం కేజ్రీవాల్‌, మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌లను వెంటనే విడుదల చేయాలి. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలను వెంటనే ఆపాలి.

బీజేపీ చేస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అక్రమ వసూళ్లు, ఎన్నికల బాండ్ల ద్వారా చేస్తున్న మనీలాండరింగ్‌పై విచారించడానికి సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేయాలి’ అని ఇండియా కూటమి నేతలు డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్‌ థాక్రే, అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీత, హేమంత్‌సోరేన్‌ భార్య కల్పన సోరేన్‌ తదితరులు పాల్గొన్నారు.    

ఇదీ చదవండి.. ప్రధాని మోదీ అవి గుర్తు చేసుకోవాలి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement