న్యూఢిల్లీ:లిక్కర్‌స్కామ్ కేసులో జైలులో ఉన్నప్పటి అనుభవాలను ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియా పార్టీ నేతలతో పంచుకున్నారు. ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం(సెప్టెంబర్22) జరిగిన ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్న సిసోడియా తన జైలు అనుభవాలు వెల్లడించారు.
‘జైలులో ఉన్నపుడు అనేక బెదిరింపులు వచ్చాయి. జైలులోనే చంపేస్తామన్నారు. కేజ్రీవాల్ మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారని నాకు చెప్పారు. మీరు కూడా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని కోరారు. అలా చెబితే మీరు కేసు నుంచి బయటపడొచ్చన్నారు. పార్టీ మారీ బీజేపీలో చేరాలని సూచించారు.
జైలులో ఉన్న సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్(ఈడీ) నా బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసింది. కొడుకు స్కూల్ ఫీజు కట్టేందుకు కూడా అడుక్కోవాల్సి వచ్చింది. ఎన్ని చేసినా లక్ష్మణున్ని రాముడి నుంచి ఏ రావణుడు వేరు చేయలేడు. కేజ్రీవాల్ నా రాజకీయ గురువు’అని సిసోడియా అన్నారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్‌సిసోడియా ఏకంగా ఏడాదిన్నరపాటు తీహార్‌జైలులో ఉన్నారు. ఇటీవలే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. ఇదే కేసులో నిందితులు కేజ్రీవాల్, కల్వకుంట్ల కవితకు కూడా సుప్రీంకోర్టులోనే ఇటీవలే బెయిల్ మంజూరైంది.
ఇదీ చదవండి..ప్రధాని మోదీ నాపై కుట్ర పన్నారు: కేజ్రీవాల్
Comments
Please login to add a commentAdd a comment