న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు బుధవారం(ఏప్రిల్ 3)న విచారించి తీర్పును రిజర్వు చేసింది. ఎన్నికల వేళ ఢిల్లీ సీఎంను అరెస్టు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదించారు. దీనికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తరపున వాదించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి రాజు ఘాటుగా స్పందించారు.
ఎన్నికల కారణంగా తమను అరెస్టు చేయవద్దనే హక్కు నిందితులకు లేదన్నారు. విచారణ సక్రమంగా సాగాలంటే నిందితులను అరెస్టు చేసి జైలులో ఉంచాల్సిందేనని కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ అక్రమ అరెస్టు పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. కాగా, లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. తీహార్ జైలు నుంచి ఆప్ ఎంపీ రిలీజ్
Comments
Please login to add a commentAdd a comment