'ఐ లవ్‌ మనీష్‌ సిసోడియా'! దుమారం రేపుతున్న బ్యానర్‌! | Installing Banner I Love Manish Sisodia Delhi Police Filed Case Against | Sakshi
Sakshi News home page

'ఐ లవ్‌ మనీష్‌ సిసోడియా'! దుమారం రేపుతున్న బ్యానర్‌!

Published Sun, Mar 5 2023 10:20 AM | Last Updated on Sun, Mar 5 2023 10:23 AM

Installing Banner I Love Manish Sisodia Delhi Police Filed Case Against  - Sakshi

ఢిల్లీలోని శాస్త్రి పార్క్‌ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాల గేటు వద్ద శనివారం ఏర్పాటు చేసిన ఐ లవ్‌ మనీష్‌ సీసోడియా అనే బ్యానర్‌ తీవ్ర కలకలం రేపింది. దీన్ని ఆ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఎస్‌ఎంసీ) కోఆర్డినేటర్‌ గజాలా, పాఠశాల ప్రిన్స్‌పాల్‌తో కలసి ఏర్పాటు చేశారు. దీంతో స్థానికి నివాసి దివాకర్‌ పాండే అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు ఫిర్యాదులో పాండే..మార్చి 3 ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కార్యకర్తలు శాస్త్రి పార్క్‌లోని ప్రభుత్వ పాఠశాల గేటుకి ఈ బ్యానర్‌ని కట్టినట్లు తెలిపారు. ఆ బ్యానర్‌పై ఐ లవ్‌ యూ సిసోడియా అని రాసి ఉందని, వారు స్కూల్‌ నుంచి ఒక డెస్క్‌ తీసుకువచ్చి దానిపై ఎక్కి మరీ ఈ బ్యానర్‌ని పెట్టారని చెప్పారు.

దీనిపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడమే గాక విద్యా దేవాలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ చివాట్లు పెట్టినట్లు తెలిపారు. దీనికి అనుమతి తీసుకున్నారా అని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అబ్దుల్‌ రెహమాన్‌ తాలుకా అని చెప్పారు. దీంతో ఒక వ్యక్తి ఆ ఎమ్మెల్యేని సంప్రదిస్తే..ఔను! అనే సమాధానం ఇచ్చారు. కానీ మాకు తెలుసు ఆయన అబద్ధం చెబుతున్నారని, ఎందుకంటే కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పాఠశాల ఉపయోగించుకునేందుకు అనుమతి ఉండదు. అని అన్నారు. ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో వారు ఆ బ్యానర్‌ని తొలగించినట్లు పాండే తెలిపారు. పిల్లలు ఇది రాశారని చెప్పేందుకు ఇలా చేశారని, వీటిని మన సంస్కృతి అనుమతించదని చెప్పారు.

పిల్లలు బ్రెయిన్‌ వాష్‌ చేసేందుకు ఇలాంటి పన్నాగాలకు పాల్పడుతున్నారన్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఐతే ఆయన  ఈ విషయం సీరియస్‌ అవుతుందని ఆ పాఠశాల ప్రిన్స్‌పాల్‌ భావించలేదని కూడా చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడమే గాక, నిందితులను శిక్షిస్తామని హామీ కూడా ఇచ్చారని పాండే చెప్పారు. కాగా, ఢిల్లీ కొత్త ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పన అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిసోడియాను గత ఆదివారం సీబీఐ అరెస్టు చేసింది.

ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో సిసోడియా శుక్రవారం రోస్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దేశ రాజధాని ట్రయల్‌ కోర్టు ముందు సిసోడియా తరుఫున దాఖలు చేసిన తాజా పిటిషన్‌లో ఈ కేసులో ఇప్పటికే అన్ని రికవరీ జరిగాయి కాబట్టి అతన్ని కస్టడీలో ఉంచడం వల్ల ఎటువంటి ఫలవంతమైన ప్రయోజం ఉండదని పేర్కొంది. అలాగే ఢిల్లీ డిప్యూటీ సీఎం విచారణకు సహకరిస్తున్నారని సిబీఐ కూడా తెలిపింది. ఐతే ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితులకు ఇప్పటికే బెయిల్‌ మంజూరవ్వడం గమనార్హం.  

(చదవండి: తాగిన మైకంలో మూత్రం పోసిన స్టూడెంట్‌.. ఆపై క్షమాపణలు! అయినా అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement