న్యఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బుధవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. గురుగాంకు చెందిన ఈయన బడ్డీ రిటైల్ డైరెక్టర్.
సిసోడియాకు అత్యంత సన్నిహితులైన అమిత్ అరోరా, దినేష్ అరోరా, అర్జున్ పాండేలో లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ లైసెన్సుల జారీలో డబ్బులు వసూలు చేసి దారిమళ్లించారని తెలిపారు. వీరిలో దినేశ్ అరోరా ఇప్పటికే సీబీఐ కేసులో అప్రూవర్ గా మారి స్టేట్మెంట్ ఇచ్చారు.
అమిత్ అరోరా అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య ఐదుకు చేరింది సెప్టెంబర్ 27న లిక్కర్ వ్యాపారవేత్త సమీర్ మహాంద్రును ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: అందరి చూపు సుప్రీం వైపు.. సరిహద్దుల్లో భారీగా బలగాలు
Comments
Please login to add a commentAdd a comment