సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన రెండు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌ను దర్యాపు చేస్తున్న కేంద్రం ఏజెన్సీలకు పలు ప్రశ్నలు సంధించింది. దీంతో, ఈ కేసు మరోసారి ఆసక్తికరంగా మారింది.
వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాకు సంబంధించిన రెండు బెయిల్ పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర ఏజెన్సీలకు సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలున్నాయని ప్రశ్నించింది. కొందరు వ్యక్తులకు లబ్ధిచేకూరే విధంగా ఈ మద్యం విధానాన్ని రూపొందించారని సీబీఐ ఆరోపించింది. ఇందుకు సంబంధించి కొన్ని వాట్సాప్ మెసేజ్‌లను సీబీఐ కోర్టుకు సాక్ష్యంగా సమర్పించింది.
ఈ క్రమంలో సదరు మెసేజ్‌ల ఆమోదయోగ్యతపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు దినేష్ అరోరా స్టేట్‌మెంట్ మినహా సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించింది. నగదు ఎవరి నుండి ఎవరికి ఎలా చేరిందనే అంశంపై పూర్తి సాక్ష్యాధారాల లింకులను సమర్పించలేదని పేర్కొంది. వారు దాని గురించి మాట్లాడుకోవడం మీరు చూశారా? ఈ సాక్ష్యాలు ఆమోదయోగ్యంగా ఉంటాయా? ఇది అప్రూవర్‌గా మారిన ఓ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం కాదా? మరి దీన్నెలా సాక్ష్యంగా భావించగలం అని ఎదురు ప్రశ్నలు సంధించింది.ఈ కేసులో సిసోడియాకు వ్యతిరేకంగా సరైనా ఆధారాలను చూపించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది.
Take out time from your schedule and read all arguments in Manish Sisodia Case.
— 🇮🇳Delightful🇮🇳 (@sdhruv86) October 5, 2023
Today's Argument in SC shows that how anyone can be framed in PMLA case by ED without any establishment of any money Trail.
9 months have been passed since his arrest still no evidence found
మీరు రూ.100 కోట్లు, రూ.30 కోట్లు అని రెండు అంకెలు చెప్పారు. వారికి ఇది ఎవరు చెల్లించారు. నగదు చాలా మంది చెల్లించవచ్చు. మద్యానికి సంబంధించినదే కానవసరంలేదు. సాక్ష్యం ఎక్కడ ఉంది. దినేష్ అరోరా కూడా నగదు తీసుకున్న వ్యక్తే, గ్రహీత. ఆయన కూడా నిందితుడే. ఒక్క దినేష్ అరోరా ప్రకటన తప్ప.. ఈ కేసులో సరైన రుజువులు ఎక్కడున్నాయి. ఈ కేసులో విజయ్ నాయర్ మాత్రమే ఉన్నారని, మమనీష్ సిసోడియా పాత్ర లేదని ధర్మాసనం ప్రశ్నించింది. మనీలాండరింగ్ చట్టం కింద సిసోడియాను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: త్వరలో ‘కింగ్ పిన్’ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారు: అనురాగ్ ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment