
Delhi Liquor Scam: ప్రకంపనలు రేపుతున్న అరెస్టుల పర్వం

లోక్ సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతోంది

తాజాగా ఈ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది

ఏకంగా ఒక ముఖ్యమంత్రిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది

ఈ కేసులో ఇప్పటి దాకా జాతీయ దర్యాప్తు సంస్థలు ఎవరెవరిని.. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేసిందో చూద్దాం

2022 సెప్టెంబర్ 27న ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రు అరెస్ట్

2022 నవంబర్ 10న శరత్‌చంద్రారెడ్డి , బినోయ్‌బాబు అరెస్ట్

2022 నవంబర్ 14న రాబిన్ డిస్టలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయినపల్లి అరెస్ట్

2022 నవంబర్ 14న విజయ్ నాయర్ అరెస్ట్

2022 నవంబర్ 30న బడ్డీ రిటైల్ డైరెక్టర్ అమిత్ అరోరా అరెస్ట్

2023 ఫిబ్రవరి 9న కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్

2023 ఫిబ్రవరి 9న మద్యం వ్యాపారి గౌతం మల్హోత్రా అరెస్ట్

2023 ఫిబ్రవరి 11న మద్యం వ్యాపారి మాగుంట రాఘవ అరెస్ట్

2023 ఫిబ్రవరి 26న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

2024 మార్చి 15న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్

2024 మార్చి 21న ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్