కిడ్నాప్‌ చేసి.. గన్‌ పెట్టి.. పెళ్లి చేశారు | Abducted Railway Engineer Forced To Marry Girl At Gunpoint In Bihar | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ చేసి.. గన్‌ పెట్టి.. పెళ్లి చేశారు

Published Wed, Jul 18 2018 11:32 AM | Last Updated on Wed, Jul 18 2018 1:54 PM

Abducted Railway Engineer Forced To Marry Girl At Gunpoint In Bihar - Sakshi

పాట్నా : వేరే పెళ్లి చేసుకుంటున్న వ్యక్తిని కిడ్నాప్‌ చేయడం, గన్‌ పెట్టి బెదిరించి పిల్లను ఇచ్చి పెళ్లి చేయడం ఇదంతా సినిమాల్లో చూసుంటా. తాజాగా బిహార్‌లో ఇదే సంఘటన జరిగింది. సమస్తిపుర్‌ రైల్వే డివిజన్‌లో పనిచేస్తున్న దుర్గేష్‌ శరణ్‌ అనే ఇంజనీర్‌ను కిడ్నాప్‌ చేసి, బలవంతంగా ఓ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో, గన్‌పెట్టి మరీ ఓ అమ్మాయితో పెళ్లి జరిపించారు. 

వివరాల్లోకి వెళ్తే... దుర్గేష్‌ సెక్షన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బిందూపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఖజ్వట్ట గ్రామంలో ఉన్న తన స్నేహితుడు సౌరభ్‌ ఇంటి నుంచి తిరిగి వస్తున్న సమయంలో అతన్ని అమ్మాయి కుటుంబం కిడ్నాప్‌ చేసింది. జందాహ స్టేషన్‌ ప్రాంతంలో శాల పవర్‌ హౌజ్‌లో దగ్గరిలో దుర్గేశ్‌ కిడ్నాప్‌కు గురయ్యాడు. ఎస్‌యూవీలో వచ్చిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని, సౌరభ్‌ను లాక్కొని వెళ్లారు. ఆ అనంతరం దుర్గేశ్‌ను రాఘోపూర్ నదీతీరం ప్రాంతానికి తీసుకెళ్లి, ప్రియాంక కుమారి అనే 23 ఏళ్ల అమ్మాయికి వచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. దుర్గేశ్‌ కిడ్నాప్‌కు గురవడంతో, తన స్నేహితుడు సౌరభ్‌ జందాహ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశాడు. 

స్నేహితుడి సౌరభ్‌ ఈ విషయంపై జందాహ పోలీసు స్టేషన్‌లో జరిగిందంతా వివరించారు. సౌరభ్‌ చెప్పిన మేరకు వైశాలి జిల్లా ఎస్పీ మానవ్‌జీత్‌ సింగ్‌ ఆదేశంతో పోలీసులు భారీ ఎత్తున్న సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ సెర్చ్‌ ఆపరేషన్‌లో దుర్గేశ్‌, రాఘోపూర్ నదీతీరం ప్రాంతంలో ఉన్న పెళ్లి కూతురి ఇంట్లో దొరికాడు. అయితే దుర్గేశ్‌ తమకు గత ఏడాది కాలంగా తెలుసని పెళ్లి కూతురు కుటుంబం చెబుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, కానీ అధిక కట్నం ఆశతో దుర్గేశ్‌ వివాహానికి నిరాకరిస్తున్నాడని చెప్పారు. తన కొడుకును కిడ్నాప్‌ చేసి, బలవంతంగా పెళ్లి చేశారని, వీరెవరూ తమకు తెలియదని ఇంజనీర్‌ తల్లి వీణా దేవీ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement