Railway Engineer
-
కిడ్నాప్ చేసి.. గన్ పెట్టి.. పెళ్లి చేశారు
పాట్నా : వేరే పెళ్లి చేసుకుంటున్న వ్యక్తిని కిడ్నాప్ చేయడం, గన్ పెట్టి బెదిరించి పిల్లను ఇచ్చి పెళ్లి చేయడం ఇదంతా సినిమాల్లో చూసుంటా. తాజాగా బిహార్‌లో ఇదే సంఘటన జరిగింది. సమస్తిపుర్ రైల్వే డివిజన్లో పనిచేస్తున్న దుర్గేష్ శరణ్ అనే ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఓ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో, గన్‌పెట్టి మరీ ఓ అమ్మాయితో పెళ్లి జరిపించారు. వివరాల్లోకి వెళ్తే... దుర్గేష్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బిందూపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఖజ్వట్ట గ్రామంలో ఉన్న తన స్నేహితుడు సౌరభ్ ఇంటి నుంచి తిరిగి వస్తున్న సమయంలో అతన్ని అమ్మాయి కుటుంబం కిడ్నాప్ చేసింది. జందాహ స్టేషన్ ప్రాంతంలో శాల పవర్ హౌజ్‌లో దగ్గరిలో దుర్గేశ్ కిడ్నాప్‌కు గురయ్యాడు. ఎస్‌యూవీలో వచ్చిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని, సౌరభ్‌ను లాక్కొని వెళ్లారు. ఆ అనంతరం దుర్గేశ్‌ను రాఘోపూర్ నదీతీరం ప్రాంతానికి తీసుకెళ్లి, ప్రియాంక కుమారి అనే 23 ఏళ్ల అమ్మాయికి వచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. దుర్గేశ్ కిడ్నాప్‌కు గురవడంతో, తన స్నేహితుడు సౌరభ్ జందాహ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశాడు. స్నేహితుడి సౌరభ్ ఈ విషయంపై జందాహ పోలీసు స్టేషన్లో జరిగిందంతా వివరించారు. సౌరభ్ చెప్పిన మేరకు వైశాలి జిల్లా ఎస్పీ మానవ్‌జీత్ సింగ్ ఆదేశంతో పోలీసులు భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో దుర్గేశ్, రాఘోపూర్ నదీతీరం ప్రాంతంలో ఉన్న పెళ్లి కూతురి ఇంట్లో దొరికాడు. అయితే దుర్గేశ్ తమకు గత ఏడాది కాలంగా తెలుసని పెళ్లి కూతురు కుటుంబం చెబుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, కానీ అధిక కట్నం ఆశతో దుర్గేశ్ వివాహానికి నిరాకరిస్తున్నాడని చెప్పారు. తన కొడుకును కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లి చేశారని, వీరెవరూ తమకు తెలియదని ఇంజనీర్ తల్లి వీణా దేవీ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. -
‘క్రైం’ కిలాడీ
* ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న యాంకర్ హర్షవర్దన్ ముఠా అరాచకాలు * రైల్వే ఇంజినీర్, యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెరుుల్ * రూ.13 లక్షలు వసూలు * మరింత సొమ్ము కోసం బెదిరింపులు ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) : సూటు.. బూటు వేసుకుని బుల్లి తెరపై ప్రత్యక్షమవుతాడు. ‘మహానగరంలో మాయగాళ్లు.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తారు.. ఫోన్ చేసి బెదిరిస్తారు.. లక్షలకు లక్షలు ఇమ్మంటారు.. ప్రజలూ బహుపరాక్’ అంటూ గంభీరమైన మాటలు చెబుతాడు. ‘టిప్‌టాప్‌గా వస్తారు.. తప్పు చేయకపోయినా తప్పులున్నాయంటారు.. డబ్బు ఇవ్వకపోతే మిమ్మల్ని వీధిలోకి లాగుతామంటారు.. ఇలాంటి వాళ్ల విషయంలో బెదిరిపోకండి.. పోలీసుల్ని ఆశ్రయించండి..’ అంటూ గొప్పోడిలా సలహాలు ఇస్తాడు. తెరవెనుక మాత్రం అతడే కిలాడీ కేటుగాడని.. తానే అలాంటి పనులు చేస్తూ డబ్బు గుంజుతుంటాడని తెలిసి విస్తుపోవడం పోలీసుల వంతయియంది. నేర వార్తలను విభిన్నంగా చదువుతూ.. తెరవెనుక జనాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులకు చిక్కిన టీవీ యూంకర్ హర్షవర్దన్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను బ్లాక్మెయిల్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేసి కటకటాల పాలైన హర్షవర్దన్ ముఠా సభ్యులు తననూ బెదిరించారని.. రూ.13 లక్షలు వసూలు చేశారంటూ ఓ రైల్వే ఇంజినీర్ తాజాగా టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. రైల్వే ఇంజినీర్ నుంచి రూ.13 లక్షలు వసూలు హర్షవర్దన్ తన నుంచి రూ.13 లక్షలు వసూలు చేశాడంటూ విజయవాడకు చెందిన రైల్వే ఇంజినీర్ నాతా హరినాథ్‌బాబు ఏలూరు టూటౌన్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రైల్వే స్టేషన్లో సెక్షన్ సీనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హరినాథ్‌బాబు అదే నగరంలో ఉంటున్నారు. అతని ఫొటోను ఓ యువతి ఫొటోతో కంప్యూటర్ సాయంతో మార్ఫింగ్ చేసి దానిని ఇంటర్నెట్లో పెడతామంటూ హర్షవర్దన్, నల్లజర్లకు చెందిన ఓ టీవీ ఛానల్ నిర్వాహుకుడు లూక్‌బాబు, హేలాపురి దినపత్రిక తరఫున ఏలూరు, తాడేపల్లిగూడెంలలో పనిచేస్తున్న బోడ విజయకుమార్, దిరిశిపాముల విజయరత్నం బ్లాక్మెయిల్ చేశారు. ఆ ఫొటోను నెట్లో పెట్టకుండా ఉండాలంటే తమకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిన హరినాథ్‌బాబు వారిని ఈ నెల 2న విజయవాడ రైల్వేస్టేషన్‌కు రమ్మని చెప్పారు. వారికి అక్కడ రూ.13 లక్షలు ఇచ్చారు. అయినా హర్షవర్దన్, అతని ముఠా సభ్యులు ఫొటోను హరినాథ్‌బాబుకు ఇవ్వలేదు. మరికొంత సొమ్ము ఇస్తేనే ఫొటోను తిరిగి ఇస్తామన్నారు. ఆ తరువాత ఫాదర్ బాలను బ్లాక్మెయిల్ చేసిన కేసులో హర్షవర్దన్, అతని అనుచరులను ఏలూరులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న హరినాథ్ బాబు మంగళవారం అర్ధరాత్రి ఏలూరు చేరుకున్నారు. తనను బ్లాక్మెయిల్ చేసి రూ.13 లక్షలు వసూలు చేసిన విషయమై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సత్యకిషోర్ తెలిపారు. ముఠా సభ్యుల ఇళ్లల్లో తనిఖీలు హర్షవర్దన్ అనుచరులైన నల్లజర్లకు చెందిన లూక్‌బాబు, ఏలూరుకు చెందిన విజయకుమార్, తాడేపల్లిగూడేనికి చెందిన విజయరత్నం, ఏలూరు కార్ల విడిభాగాల షోరూం నిర్వాహకుడు వీరంకి చిరంజీవి ఇళ్లల్లో పోలీసులు మంగళ, బుధవారాల్లో సోదాలు నిర్వహించారు. బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగిస్తున్న సీడీలు, ఇతర రికార్డుల కోసం పోలీసులు వారి గృహాలతోపాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. -
‘క్రైం’ కిలాడీ
►ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న యాంకర్ హర్షవర్దన్ ముఠా అరాచకాలు ►రైల్వే ఇంజినీర్, యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ ►రూ.13 లక్షలు వసూలు ►మరింత సొమ్ముకోసం బెదిరింపులు ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్): సూటు.. బూటు వేసుకుని బుల్లి తెరపై ప్రత్యక్షమవుతాడు. ‘మహానగరంలో మాయగాళ్లు.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తారు.. ఫోన్‌చేసి బెదిరిస్తారు.. లక్షలకు లక్షలు ఇమ్మంటారు.. ప్రజలూ బహుపరాక్’ అం టూ గంభీరమైన మాటలు చెబుతాడు. ‘టిప్పుటాపుగా వస్తారు.. తప్పు చేయకపోయినా తప్పులున్నాయంటారు.. డబ్బు ఇవ్వకపోతే మిమ్మల్ని వీధిలోకి లాగుతామంటారు.. ఇలాంటి వాళ్ల మాటలకు బెదిరిపోకండి.. పోలీసుల్ని ఆశ్రయించండి’ అంటూ గొప్పోడిలా సలహాలు ఇస్తాడు. తెరవెనుక మాత్రం అతడే కిలాడీ కేటుగాడని.. తానే అలాంటి పనులు చేస్తూ డబ్బులు గుంజుతుంటాడని తెలిసి విస్తుపోవడం పోలీసుల వంతయియంది. నేర వార్తలను విభిన్నంగా చదువుతూ.. తెరవెనుక జనాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులకు చిక్కిన టీవీ యూంకర్ హర్షవర్దన్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను రూ.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసి కటకటాల పాలైన హర్షవర్దన్ ముఠా సభ్యులు తననూ బెదిరించారని.. రూ.13 లక్షలు వసూ లు చేశారని ఓ రైల్వే ఇంజినీర్ తాజాగా టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఫొటో మార్ఫింగ్ చేసి రూ.20 లక్షలు అడిగారు హర్షవర్దన్ తననుంచి రూ.13 లక్షలు వసూలు చేశాడంటూ విజయవాడకు చెందిన రైల్వే ఇంజినీర్ నాతా హరినాథ్‌బాబు ఏలూరు టూటౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రైల్వే స్టేషన్లో సెక్షన్ సీని యర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హరినాథ్‌బాబు అదే నగరంలో నివాసం ఉంటున్నారు. అతని ఫొటోను ఓ యువతి ఫొటోతో కంప్యూటర్ సాయంతో మార్ఫింగ్ చేసి దానిని ఇంటర్నెట్లో పెడతామంటూ హర్షవర్దన్, నల్లజర్లకు చెందిన ఓ టీవీ ఛానల్ నిర్వాహకుడు లూక్‌బాబు, హేలాపురి దినపత్రిక తరఫున ఏలూరు, తాడేపల్లిగూడెంలలో పనిచేస్తున్న బోడ విజయకుమార్, దరిశిపాముల విజయరత్నం బ్లాక్మెయిల్ చేశారు. ఆ ఫొటోను నెట్లో పెట్టకుండా ఉండాలంటే తమకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిన హరినాథ్‌బాబు వారిని ఈ నెల 2న విజయవాడ రైల్వేస్టేషన్‌కు రమ్మని చెప్పారు. వారికి అక్కడ రూ.13 లక్షలు ఇచ్చారు. అయినా హర్షవర్దన్, అతని ముఠా సభ్యులు మార్ఫింగ్ చేసిన ఫొటోను హరినాథ్‌బాబుకు ఇవ్వలేదు. మరి కొంత సొమ్ము ముట్టచెబితేనే ఫొటోను తిరిగి ఇస్తామన్నారు. ఆ తరువాత ఫాదర్ బాలను బ్లాక్మెయిల్ చేసిన కేసులో హర్షవర్దన్, అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న హరినాథ్‌బాబు మంగళవారం అర్ధరాత్రి ఏలూరు చేరుకున్నారు. తనను బ్లాక్మెయిల్ చేసి రూ.13 లక్షలు వసూలు చేసిన విషయమై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సత్యకిషోర్ తెలిపారు.