‘పచ్చ’ చొక్కాలకే అభివృద్ధి పరిమితం
Published Fri, Dec 16 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
కడియం :
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు పచ్చచొక్కాలు వేసుకున్న వారికే పరిమితమయ్యాయని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నాయకుడు కందుల దుర్గేష్ అన్నారు. పార్టీలో చేరిన తరువాత తొలిసారిగా శుక్రవారం కడియం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా టీడీపీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు 750 హామీలను ఇచ్చారని, కానీ అందులో పూర్తిస్థాయిలో అమలైన హామీ ఒక్కటి కూడా లేదన్నారు. ప్రచార ఆర్భాటం తప్పితే ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం లేదన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న విశాల దృక్ఫథంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పనిచేసేవారన్నారు. ఆయన స్ఫూర్తిని జగ¯ŒS కొనసాగిస్తారన్న విశ్వాçÜం ఉందన్నారు.అందుకే వైఎస్సార్ సీపీలో చేరానని స్పష్టం చేశారు. సమావేశంలో డీసీఎంఎస్ డైరెక్టర్ వెలుగుబంటి అచ్యుతరామ్, గట్టి నర్సయ్య, సాపిరెడ్డి సూరిబాబు, తోరాటి శ్రీను, చిక్కాల బాబులు, ముద్రగడ జెమి, బోణం సతీష్ పాల్గొన్నారు.
Advertisement