only tdp leaders
-
దేశం ‘కాపు’లకే కార్పొరేషన్ రుణాలు
జక్కంపూడి రాజా ధ్వజం కొత్తపేట : కాపు కార్పొరేష¯ŒS రుణాలు తెలుగుదేశం పార్టీ ‘కాపు’లకే మంజూరు చేసుకుంటున్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రజా బ్యాలెట్ పంపిణీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబుతో పాటు జక్కంపూడి రాజా ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. రాజా మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తుంటే ఆయనను తమ పార్టీ నేతలతో తిట్టిస్తున్నారన్నారు. కాపు కార్పొరేష¯ŒS ఏర్పాటు చేసి రుణాలు ఇస్తున్నామని గొప్పలు చెపుకుంటున్న నేతలు అర్హులైన పేదలకు కాకుండా తమ పార్టీ కాపులకే ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై జగ్గిరెడ్డి స్పందనకు ఆయన గెలుపే గొప్ప నిదర్శనమన్నారు. రాబోయే కాలంలో జగ¯ŒSను సీఎం చేయడానికి మరోసారి జగ్గిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ప్రతినిధి దాతలు ఇచ్చిన భూములు కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. అంతేగా నీరు చెట్టు పథకం మట్టిని పేదల ఇళ్ల స్థలాలు కోసం కాకుండా కాజేసిన లేఅవుట్ స్థలాల మెరకకు ఉపయోగించుకున్నారని విమర్శించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ వెంట నడిచిన కాపులపై కేసులు పెట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘పచ్చ’ చొక్కాలకే అభివృద్ధి పరిమితం
కడియం : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు పచ్చచొక్కాలు వేసుకున్న వారికే పరిమితమయ్యాయని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నాయకుడు కందుల దుర్గేష్ అన్నారు. పార్టీలో చేరిన తరువాత తొలిసారిగా శుక్రవారం కడియం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా టీడీపీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు 750 హామీలను ఇచ్చారని, కానీ అందులో పూర్తిస్థాయిలో అమలైన హామీ ఒక్కటి కూడా లేదన్నారు. ప్రచార ఆర్భాటం తప్పితే ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం లేదన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న విశాల దృక్ఫథంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పనిచేసేవారన్నారు. ఆయన స్ఫూర్తిని జగ¯ŒS కొనసాగిస్తారన్న విశ్వాçÜం ఉందన్నారు.అందుకే వైఎస్సార్ సీపీలో చేరానని స్పష్టం చేశారు. సమావేశంలో డీసీఎంఎస్ డైరెక్టర్ వెలుగుబంటి అచ్యుతరామ్, గట్టి నర్సయ్య, సాపిరెడ్డి సూరిబాబు, తోరాటి శ్రీను, చిక్కాల బాబులు, ముద్రగడ జెమి, బోణం సతీష్ పాల్గొన్నారు.