Published
Sun, Jan 22 2017 11:06 PM
| Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
జక్కంపూడి రాజా ధ్వజం
కొత్తపేట :
కాపు కార్పొరేష¯ŒS రుణాలు తెలుగుదేశం పార్టీ ‘కాపు’లకే మంజూరు చేసుకుంటున్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రజా బ్యాలెట్ పంపిణీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబుతో పాటు జక్కంపూడి రాజా ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. రాజా మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తుంటే ఆయనను తమ పార్టీ నేతలతో తిట్టిస్తున్నారన్నారు. కాపు కార్పొరేష¯ŒS ఏర్పాటు చేసి రుణాలు ఇస్తున్నామని గొప్పలు చెపుకుంటున్న నేతలు అర్హులైన పేదలకు కాకుండా తమ పార్టీ కాపులకే ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై జగ్గిరెడ్డి స్పందనకు ఆయన గెలుపే గొప్ప నిదర్శనమన్నారు. రాబోయే కాలంలో జగ¯ŒSను సీఎం చేయడానికి మరోసారి జగ్గిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ప్రతినిధి దాతలు ఇచ్చిన భూములు కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. అంతేగా నీరు చెట్టు పథకం మట్టిని పేదల ఇళ్ల స్థలాలు కోసం కాకుండా కాజేసిన లేఅవుట్ స్థలాల మెరకకు ఉపయోగించుకున్నారని విమర్శించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ వెంట నడిచిన కాపులపై కేసులు పెట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.